Kerala Crime Files Review: పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన అడ్రస్.. 'కేరళ క్రైమ్ ఫైల్స్' రివ్యూ
రేటింగ్: 2.5/5
టైటిల్: కేరళ క్రైమ్ ఫైల్స్
నటీనటులు: అజు వర్గీస్, లాల్, శ్రీజిత్ మహాదేవన్, అన్సల్ బెన్, జిన్స్ షాన్, నవస్ వలిక్కున్ను, సంజు, రూత్ పి. జాన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జితిన్ స్టనిస్లస్
ఎడిటింగ్: మహేశ్ భువనేంద్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్
నిర్మాతలు: రాహుల్ రిజి నాయర్
కథ: ఆషిక్ ఐమర్
దర్శకత్వం: అహ్మద్ కబీర్
విడుదల తేది: జూన్ 23, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (ఎపిసోడ్స్ 6)
మలయాళ చిత్రాలు, వెబ్ సిరీసులకు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త కథాంశంతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాలు నిర్మిస్తుంటారు. తాజాగా మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన హాట్ స్టార్ స్పెషల్ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ (Kerala Crime Files). క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రస్తుతం మలయాళం, తెలుగు, హిందీ, తమిళ్, మరాఠీ, కన్నడ, బెంగాలీ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో (Kerala Crime Files Review Telugu) తెలుసుకుందాం.
కథ: కేరళలోని గ్రాండ్ టూరిస్ట్ హోమ్ అనే లాడ్జ్ లో ఒక ప్రాస్టిట్యూట్ హత్య జరుగుతుంది. దీంతో ఎస్సై మనోజ్ (అజు వర్గీస్) రంగంలోకి దిగుతాడు. ఆ వేశ్య పేరు స్వప్న అని, ఆమెతోపాటు వచ్చిన వ్యక్తి పేరు షిజు (శ్రీజిత్ మహాదేవన్) అని తెలుసుకున్న ఎస్సై మనోజ్ లాడ్జ్ లో రాసిన అడ్రస్ ద్వారా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. మరి షిజును పోలీసులు పట్టుకున్నారా? షిజు గురించి తెలిసిన నిజాలు ఏంటీ? ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేని వేశ్య మర్డర్ కేసు పోలీసులకు ఎందుకు ప్రత్యేకంగా మారింది? వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటీ? వంటి ఆసక్తిర అంశాలకు సమాధానమే కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్.

విశ్లేషణ: కేరళ క్రైమ్ ఫైల్స్ ఒక క్రైమ్ ఇన్వేస్టిగేషన్ డ్రామా. అయితే టైటిల్ లో క్రైమ్ ఫైల్స్ అని పెట్టారు కాబట్టి చాలా కేసులు ఉంటాయని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఒక లాడ్జ్ లో ప్రాస్టిట్యూట్ ను ఎవరు? ఎందుకు? హత్య చేశారన్న కథాంశంతోనే సిరీస్ మొత్తం ఉంటుంది. కానీ, ఈ సిరీసులో ఇంకా సీక్వెల్స్ తీసుకొచ్చే అవకాశం ఉందేమో ముందు ముందు చూడాలి. ఎందుకంటే టైటిల్ లో "షిజు, పారాయిల్ వీడు (ఇల్లు), నీందకర" అని ఒక అడ్రస్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

హైలెట్స్: ఇక లాడ్డ్ లో ఎందుకు సరిపోవట్లేదన్న అనుమానంతో మర్డర్ జరిగిందన్న విషయాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ స్టోరీలోకి తీసుకెళ్తారు. అయితే అది కాస్తా స్లోగా అనిపిస్తుంది. అనంతరం నేరస్థుడి అడ్రస్ దొరకడం, అది తెలుసుకునేందుకు పోలీసులు వెతకడం, నిందితుడి కోసం పోలీసులు వెతికే తీరు అంతా ఆకట్టుకుంటుంది. పోలీసుల పర్సనల్, ప్రొఫెషనల్ సంఘర్షణలను కాస్తా టచ్ చేశారు. నేరస్థుడు దొరికాడన్న ప్రతిసారి పోలీసులకు చుక్కెదురు అయ్యే సీన్లను బాగా తెరకెక్కించారు. అయితే అక్కడక్కడ బోర్ కొడుతుంది.

సింపుల్ క్లైమాక్స్: క్లైమాక్స్ చాలా సింపుల్ గా ఉన్నా ఊహించని విధంగా బాగుంటుంది. బీజీఎమ్ సస్పెన్స్ మూడ్ ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు, డైరెక్షన్ అంతా బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్తా రేసీగా ఉంటే బాగుండేది. నటీనటులు అందరూ చాలా చక్కగా ఒదిగిపోయారు. మలయాళంలోని డైలాగ్ లను తెలుగు డబ్బింగ్ లోకి వచ్చేసరికి అర్థాలు కాస్తా మార్చేశారు. ఇలా మరికొన్ని సీక్వెల్స్ వస్తే క్రైమ్ ఫైల్స్ అనే టైటిల్ కు జస్టిఫికేషన్ ఉంటుంది.

ఫైనల్ గా చెప్పాలంటే?: ఎక్కువ వయెలెన్స్, క్రైమ్స్ లేకుండా సాధారణంగా సాగే క్రైమ్ డ్రామా కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ (Kerala Crime Files Web Series Review). సుమారు 30 నిమిషాల నిడివితో 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నా ఈ వెబ్ సిరీస్ టైమ్ ఉంటే వీకెండ్ లో చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











