twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Romantic Movie Review: పరమ రొటీన్, మాస్ సినిమా.. ఆకాశ్ ఖాతాలో అలాంటి ఫలితమేనా?

    |

    Rating :2/5

    డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా నిలబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆంధ్రా పోరి, మెహబూబా సినిమాలతో ముందుకు రాగా అవి వర్కౌట్ కాలేదు. దీంతో మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న ఆకాశ్ 'రొమాంటిక్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ జగన్నాథ్ స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా, 'రొమాంటిక్' చిత్రాన్ని పూరీ జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్ట్ చేశాడు.

    ఈ సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ డైరెక్టర్స్‌తో పాటు సెలబ్రిటీలకు స్పెషల్ షో వేయడంతో వారు సినిమా సూపర్ డూపర్ అని అంచనాలు పెంచారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? నిజంగానే వాళ్ళు చెప్పిన రేంజ్ లో ఉందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

    రొమాంటిక్ కథ ఏంటంటే?

    రొమాంటిక్ కథ ఏంటంటే?

    'రొమాంటిక్ ' స్టోరి విషయానికొస్తే..పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేసిన రమ్య గోవారికర్ (రమ్య కృష్ణ) పాయింట్ ఆఫ్ వ్యూతో,. ఆమె వాయిస్ ఓవర్ తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. గోవా నుంచి ప్రారంభమైన ఈ కథలో వాస్కోడిగామా (ఆకాశ్ పూరీ) స్మగ్లర్, తన ఫ్రెండ్ అనీ(దేవియానీ శర్మ)తో కలిసి డబ్బు సంపాదించాలని బయలుదేరిన వాస్కో ఓ గ్యాంగ్‌ సిద్ధం చేసుకుంటాడు. ఈ క్రమంలోనే వాస్కోకు మౌనిక(కేతిక శర్మ) పరిచయమవుతుంది. అలా పరిచయమైన వీరి మధ్య ఏం జరిగింది? వీరిద్దరూ ప్రేమలో పడ్డారా? అసలు అది ప్రేమనేనా? వాస్కో కారణంగా వీరిద్దరూ చివరికి ఏమవుతారు? వాస్కో, మౌనిక చివరికి కలుస్తారా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

     రొమాంటిక్ ట్విస్టల విషయానికి వస్తే

    రొమాంటిక్ ట్విస్టల విషయానికి వస్తే

    గోవాలో జ‌రిగే ఈ క‌థలో వాస్కో ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌ కొడుకు, అనాథగా మారిత‌ డ‌బ్బు సంపాదించ‌డం కోసం అడ్డ‌దారులు తొక్క‌డం మొద‌లెడ‌తాడు. నాన‌మ్మ మేరి (ర‌మాప్ర‌భ‌), స్నేహితురాలు అనీ త‌ప్ప ఇంకెవ‌రూ లేరు. త‌న లాంటి అనాథ‌ల కోసం ఇళ్లు క‌ట్టించ‌డం త‌న ల‌క్ష్యంగా పెట్టుకుని పెద్ద పెద్ద నేరాలు చేయాల‌నుకుంటున్న క్రమంలో ఓ గ్యాంగ్ లో చేరతాడు. అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో, ఆ గ్యాంగ్ కే లీడ‌ర్ అవుతాడు.

    ఈ క్ర‌మంలో మోనికని చూసి ఎట్రాక్ట్ అవుతాడు. వాస్కో గ్యాంగ్ ని అంతమొందించేందకు గోవాలో అడుగుపెడుతుంది ఏసీపీ రమ్య‌ గోవార్క‌ర్ (ర‌మ్య‌కృష్ణ‌). వాస్కోని ప‌ట్టుకుని, గ్యాంగ్ ని అంత‌మొందించ‌డ‌మే ల‌క్ష్యంగా దిగిన ఏసీపీ ర‌మ్య వ‌ల‌లో వాస్కో చిక్కాడా లేదా? మోనిక‌తో ఎట్రాక్షన్ ఏమైంది? అసలు అది మోహ‌మా, ప్రేమా? ఈ విష‌యాలు తెలియాలంటే రొమాంటిక్‌ చూడాలి.

     దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

    దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

    పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. కానీ ఎక్కడ కొత్తగా ఏమీ అనిపించలేదు. సినిమా చూస్తున్నంత సేపు పూరీ జగన్నాథ్ స్టైల్ టెంప్లేట్, సీన్స్ , డైలాగ్స్ కనబడుతుంటాయి. అనిల్ పాదూరి పూరీ జగన్నాథ్ శిష్యుడు అవడమే కాక, హీరో పూరీ జగన్నాథ్ తనయుడు కావడంతో ఈ సినిమా కథలో కానీ కథనంలో కానీ టేకింగ్ లో గాని ఎక్కడా కొత్తదనం కనిపించలేదు. పూరి జగన్నాథ్ కథాకథనం స్క్రీన్ ప్లే అందించడంతో ఇది పూర్తిగా పూరి మార్క్ సినిమాగానే నిలిచిపోయింది. ఎక్కడ అనిల్ పాదూరి దర్శకత్వం వహించినట్లు అనిపించకపోవడం గమనార్హం.

    ఆకాష్ పూరి నటన

    ఆకాష్ పూరి నటన

    పూరీ జగన్నాథ్ తన తనయుడి గురించి ప్రమోషన్స్‌లో ఆకాశ్ మంచి యాక్టర్ అని చెప్పాడు, రాజమౌళి కూడా టాలీవుడ్ కి ఒక మంచి నటుడు దొరికాడు అన్నారు. ఆ మాటలు నిజమే అని నిరూపించాడు ఆకాశ్ పూరీ. 'రొమాంటిక్' మూవీలో ఆకాశ్ యాక్టింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. మెహబూబా సినిమా తో పోలిస్తే ఆకాష్ పూరి నటనలో చాలా మెచ్యూరిటీ కనిపించింది. అయితే పూరి జగన్నాథ్ మార్క్ డైలాగులు పలుకుతున్న సమయంలో పూరీ జగన్నాధ ను ఆకాశ్ అనుకరిస్తన్నట్లు అనిపించింది. అలాగే పూరి జగన్నాథ్ సోదరుడు సాయి శంకర్ డైలాగ్ డెలివరీ లాగానే ఆకాష్ డెలివరీ కూడా అనిపించడం గమనార్హం.

    రమ్యకృష్ణ, కేతికశర్మ విషయానికి వస్తే

    రమ్యకృష్ణ, కేతికశర్మ విషయానికి వస్తే

    హీరోయిన్ కేతిక శర్మకు ఇది మొదటి సినిమా. ఇదే ఆమెను పూర్తిగా ఒక గ్లామర్ ఎట్రాక్షన్ గా వాడడం కోసమే సినిమాలో ఉంచారు ఏమో అనిపిస్తుంది. గ్లామర్ పరంగా ఆమెకు వందకు వంద మార్కులు వేయొచ్చు కానీ, నటన విషయంలో ఆమె నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రమ్యకృష్ణ మకరంద్ దేశ్పాండే లాంటి నటీనటుల ముందు కేతికశర్మ పూర్తిగా తేలిపోయింది. ఇక ఎప్పటిలాగే రమ్యకృష్ణ పోలీసు ఆఫీసర్ రోల్‌లో ఇరగదీసిందని చెప్పొచ్చు. హీరో ఫ్రెండ్ రోల్ ప్లే చేసిన దేవియానిశర్మ పర్ఫార్మెన్స్ సినిమా మొత్తం మీద చాలా హైలైట్‌గా నిలిచింది. ఉత్తేజ్, సునైనా, మకరంద్ దేశ్ పాండే, టెంపర్ వంశీ చాలా బాగా నటించారు.

    టెక్నికల్ విషయానికి వస్తే

    టెక్నికల్ విషయానికి వస్తే


    పూరి సినిమాల్లో జనరల్ గా టెక్నికల్ క్రూ ప‌నిత‌నం బాగా క‌నిపిస్తుంది. ఈ సినిమాలో కూడా అంతే. సునీల్ క‌శ్య‌ప్ పాట‌ల్లో కొన్ని ఆక‌ట్టుకుంటాయి. పీనేకే బాద్‌.. పాటలో రామ్, పూరి క‌నిపించ‌డంతో జోష్ పెరిగింది. ఈ సినిమాకి పూరి మార్క్ డైలాగులు బాగా అసెట్. ప్ర‌తీ సీన్ లో ఒక్క‌టైనా డైలాగ్ హైలైట్ అయ్యేలా రాసుకున్నాడు పూరి. గోవా నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని చాలా క‌ల‌ర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా ప్రెజెంట్ చేశాడు కెమెరామెన్‌. ఎడిటింగ్ మీద శ్రద్ద పెట్టాల్సింది.

    ఫైనల్ గా చెప్పాలంటే

    ఫైనల్ గా చెప్పాలంటే

    సినిమా పూరీ మార్క్ రొటీన్ రొట్ట సినిమా. కొత్తదనం ఆశించి వెళితే పూర్తిస్థాయిలో నిరాశ పడటం గ్యారెంటీ. చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేయొచ్చు. యూత్‌కు ఈ సినిమా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. మాస్ కుర్రాడు, క్లాస్ అమ్మాయి, వాళ్లిద్దరి మధ్య ప్రేమ, గ్యాంగ్ వార్ లాంటివి మిక్స్ చేసి వదిలాడు. పూరీ ఆకాష్ 'రొమాంటిక్' యూత్ కి మాత్రమే!

    Recommended Video

    Hero Srikanth Released Poison Movie Song
    నటీనటులు

    నటీనటులు

    ఆకాష్ పూరీ, కేతిక శర్మ, దేవియానీ శర్మ, రమ్య కృష్ణ, మకరంద్ దేష్ పాండే, టెంపర్ వంశీ, ఉత్తేజ్, సునైన బాదం, రమాప్రభ, ప్రీతి నిగమ్
    కథ, స్క్రీన్ ప్లే: పూరీ జగన్నాథ్
    ప్రొడ్యూసర్స్ : పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్
    డైరెక్షన్ : అనిల్ పాదూరి
    మ్యూజిక్ : సునీల్ కశ్యప్
    రిలీజ్ డేట్ : అక్టోబర్ 29, 2021

    English summary
    Dashing director Puri Jagannadh's son akash Puri's Romantic Movie directed by anil paduri released worldwide on october 29th, here is the movie review and Rating in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X