Akhanda 2 Critic Review: అఖండ 2 క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
తెలుగు ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్, నటరత్న నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా ప్రీమియర్లు ఒక రోజు ముందే ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో సెన్సార్ సందర్భంగా ఈ సినిమాను చూసిన క్రిటిక్ తన రివ్యూను సోషల్ మీడియా ద్వారా అందించారు. ఈ సినిమాపై దుబాయ్ క్రిటిక్ ఏమని రివ్యూ ఇచ్చారనే విషయంలోకి వెళితే..

అఖండ చిత్రంలో అఘోరా పాత్రతో ఆకట్టుకొన్న నందమూరి బాలకృష్ణ మరోసారి అదే పాత్ర, సనాతన ధర్మం కాన్సెప్ట్‌తో అఖండ 2 చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాకిస్థాన్ తీవ్రవాదులు, హిందువులకు మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమా ప్రోమోలలతో హైలెట్‌గా నిలిచాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో దుబాయ్ క్రిటిక్ ఉమేర్ సంధూ చేసిన ట్వీట్ మరింత ఆసక్తిని పెంచింది.
అఖండ 2 సినిమాపై నాది ఫస్ట్ రివ్యూ ఇది. ఈ సినిమా పైసా వసూల్ మూవీ. మాస్ ఎంటర్‌టైనర్. హార్డ్ కోర్ బాలకృష్ణ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఈ చిత్రంలో యాక్షన్ పాళ్లు ఎక్కువగానే ఉన్నాయి. గంభీరంగా, స్క్రీన్ దద్దరిల్లే రీతిలో డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. థియేటర్లలో అభిమానుల చేత ఈలలు వేయిస్తాయి. క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంటుంది. ఈ సినిమా కేవలం మాస్ ఆడియెన్స్ మాత్రమే అని ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో తెలిపారు.
ఇక ఈ సినిమాకు తన రివ్యూతో పాటు రేటింగ్‌ను అందించాడు. బాలకృష్ణ, సంయుక్త మీనన్ నటించిన ఈ చిత్రానికి తన రేటింగ్ 5 పాయింట్లకు గాను 3 పాయింట్లు ఇచ్చాడు. 3 రేటింగ్‌తో ఈ సినిమా రివ్యూను పూర్తి చేయడం గమనార్హం. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ సొంతం చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, ఉమేర్ సంధూ ఇచ్చే రివ్యూలు మిక్స్‌డ్‌గా ఉంటాయి. ఆయన ఆకాశానికి ఎత్తిన సినిమాలు కొన్ని దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మరికొన్ని ఆయన ఫ్లాప్ అన్న సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా గురించి ఇచ్చే ఎక్స్‌క్లూజివ్ రివ్యూ గురించి ఫిలింబీట్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











