Akhanda 2 First Review: అఖండ 2 మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగు ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్, నటరత్న నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సందర్బంగా ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ప్రతినిధులు, అధికారులు రివ్యూ చేశారు. వారు ఈ సినిమాపై ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? వారు జారీ చేసిన సర్టిఫికెట్ ఏంటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Akhanda 2 Censor Review

అఖండ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అఖండ 2పై ారీ అంచనాలు ఉండటంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నాం అని చెప్పారు. ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ చూసిన తర్వాత భారత దేశానికి ఆత్మగా మారిన సనాతన ధర్మం బ్యాక్ డ్రాప్‌లో ప్రపంచస్థాయిలో భక్తులు తరలివచ్చిన కుంభమేళా జనజాతర కీలక అంశంగా ఈ సినిమాను శివతత్వాన్ని కడుపు నిండా నింపుకొనే సినిమా అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

అఖండ 2 తాండవం సినిమాను చూసిన తర్వాత కొన్ని సీన్లు, హింసాత్మక సన్నివేశాలను తీవ్రతను తగ్గించాలి. ఎక్కువ సెకన్లు ఉండే వయోలెన్స్ సీన్ల నిడివి ట్రిమ్ చేయాలి. కొన్ని డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసి సలహాలు, సూచనలు అందించారు.సెన్సార్ అధికారుల సూచనలు, సలహాలకు తగినట్టుగా బోయపాటితోపాటు చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకొన్నది. దాంతో సెన్సార్ బోర్డు ప్రతినిధులు కూడా సంత‌‌ృప్తిని వ్యక్తం చేయడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా సర్టిఫికెట్ క్లియర్ అయింది.

బాలక‌ృష్ణ అఘోరాగా కనిపించే ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సెన్సార్ గైడ్‌లైన్స్ ప్రకారం.. ఈ సినిమాను 16 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకు తక్కువ వయసు ఉన్న వారు తమ తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా కథ స్వభావం, ధర్మం, అధర్మానికి మధ్య నడిచే యుద్దం, ఇండియా, పాక్ వార్ బ్యాక్ డ్రాప్ సాగే చాలా సన్నివేశాలు కీలకం కావడంతో ఈ మూవీ డిమాండ్ చేసినంత మేరకు నిడివిని పెంచారు. ఈ సినిమా తుదిగా 2 గంటల 45 నిమిషాలు నిడివి అంటే.. 165 మినిట్స్‌ను రన్‌టైమ్‌గా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా గురించిన స్పెషల్, ఎక్స్‌క్లూజివ్ వార్తలు, రివ్యూ కోసం ఫిలింబీట్ (Filmibeat.com) ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X