Akhanda 2: Thaandavam Twitter Review: అఖండ 2 ట్విట్టర్ రివ్యూ

నందమూరి బాలకృష్ణ హీరోగా నాలుగేళ్ల క్రితం వచ్చిన అఖండ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. కరోనా కారణంగా సినిమా థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించింది ఈ చిత్రం. తాజాగా అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా అఖండ 2. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

Akhanda 2  Thaandavam Twitter Review in Telugu  will Nandamuri Balakrishna hits the bulls eye

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న సినిమా కావడంతో పాటు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో అఖండ 2 సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. డిసెంబర్ 12వ తేదీన అఖండ 2 సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్లు డిసెంబర్ 11వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

కొన్ని యాక్షన్ సీన్స్ బాలకృష్ణ మాత్రమే చేయగలరని అఖండ 2 మరోసారి రుజువు చేస్తుంది. ఆయన ఫైటింగ్ స్టైల్‌కు సొంత గుర్తింపు ఉంది. ఇతరులు దానిని అనుకరించడం అసాధ్యం. ఇంటెన్సిటి, స్క్రీన్ ప్రెజెన్స్, ప్రతి పంచ్‌లో బాలయ్య తీసుకొచ్చే నమ్మకం.. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను కేవలం మాస్ ఆస్వాదించే క్షణాలుగా కాకుండా.. బాలయ్య మాత్రమే అందించగల ఓ గుర్తుగా చేస్తాయి.

నందమూరి బాలకృష్ణ మరోసారి అఘోరాగా గర్జించాడు. అతని ఉనికి, ఆరా, డైలాగ్ డెలివరీ ఉత్తేజకరంగా ఉన్నాయి. ప్రతి సీన్ మాస్‌కి పండుగలా అనిపిస్తుంది. దర్శకుడు బోయపాటి శ్రీను .. అభిమానులు ఆశించే దానిని ఖచ్చితంగా అందిస్తాడు. హై ఓల్టేజ్ యాక్షన్, పౌరాణిక అంశాల లోతు, డివోషనల్ డ్రామా, పాత్రల ఎలివేషన్‌కు మార్కులు వేయాల్సిందే. ఈసారి బోయపాటి ఎమోషన్స్‌కు డ్రామాను జోడించాడు. మొదటి భాగాన్ని మించి అఖండ 2ను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాడు.

ఫస్టాఫ్‌ అలా కథతో పాటుగా సాగిపోతుంటుంది. పాత్రల మధ్య సంఘర్షణ, విలన్ ఆధిపత్యం, ఆధ్యాత్మిక అంశాలను పరిచయం చేశారు. కంట్రోల్‌గా కథ చెబుతూ సెకండాఫ్‌పై ఉత్కంఠను పెంచారు. నాన్‌స్టాప్ యాక్షన్, ఎలివేషన్స్, తీవ్రమైన ఘర్షణ, ఉరుముల లాంటి థమన్ బీజీఎం, మాస్ + పౌరాణిక అంశాల కలయిక తారాస్థాయిలో ఉంది. క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. విజువల్‌పరంగా గ్రాండ్‌గా, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక అంశాల సమ్మేళనంగా నింపారు. అఖండ ఫైనల్ ఫైట్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది.

బాలకృష్ణ సింహం లాంటి పర్ఫార్మెన్స్, ఆయన దూకుడు, ప్రశాంతత, ఆధ్యాత్మిక పరివర్తనలకు వంక పెట్టడానికి వీల్లేదు. విలన్, ఇతర సపోర్టింగ్ పాత్రలు పోషించిన వారు కథనానికి బలమైన మద్ధతు ఇచ్చారు. బీజీఎం నెక్ట్స్‌ లెవల్‌లో ఉంది. సినిమాటోగ్రఫి.. మనలో ఆధ్యాత్మిక స్థితిని మరింత పెంచుతుంది. యాక్షన్ కొరియోగ్రఫి హింసాత్మకంగా ఉన్నప్పటికీ స్టైలీష్‌గా ఉంది. మొత్తంగా అభిమానులు కోరుకునే ప్రతి అంశాన్ని అఖండ 2 అందిస్తుంది. మాస్ ప్రేక్షకులు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. దీనికి నా రేటింగ్ 4.5/5 అని బాలయ్య అభిమాని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చారు.

అఖండ 2లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఎంట్రీ నుంచి టైటిల్ కార్డ్ వరకు ట్రాన్స్‌మోడ్‌లోకి వెళ్లిపోయాం. నందమూరి థమన్ అన్న మాస్ డ్యూటీ మోడ్‌లో బ్లాస్టింగ్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

బోయపాటి శ్రీను డైలాగ్స్ నెక్ట్స్ లెవల్. ఫ్రేమ్స్ = ప్యూర్ ఎలివేషన్, మ్యూజిక్ = ఫుల్ మాస్ వైబ్స్, బాలయ్య = ఫైర్ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

మురళీ కృష్ణ ఇంట్రో, బాలయ్య డైలాగ్స్, ఫైట్స్ అయితే ఫైరే. జాజికాయ సాంగ్, చివరిలో సర్‌ప్రైజ్... కుంభమేళా సీన్ బాగున్నాయి. బోయపాటి రేంజ్ ఇంటర్వెల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓవరాల్‌గా ఫస్టాఫ్ రివ్యూ చెప్పాలంటే సుదర్శన్ షేక్ అవుతోంది అని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు.

అఖండ 2 ఫస్టాఫ్ = మాస్ కార్నేజ్. బోయపాటి బ్లాస్‌తో బ్యాక్ అయ్యాడు. బాలయ్య ఇంట్రో, ఇంటర్వెల్ బ్లాక్ = ప్యూర్ ర్యాంపేజ్. థమన్ సౌండ్ ట్రాక్‌కి స్పీకర్లకు ఏడుపు తెప్పించాడు. గూస్ బంప్స్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

ఫస్టాఫ్ ఇప్పుడే పూర్తయ్యింది. ఇది అఖండ క్యారెక్టర్‌కు సంబంధించినది, ఇది ఆధ్యాత్మికతో కూడిన బోయపాటి- బాలయ్యల స్టైల్‌ మాస్ ఫిల్మ్. మురళి పాత్ర యాక్షన్, వినోదాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు మాస్ ఎలిమెంట్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఫుల్ మాస్‌తో చాలా బాగుంది అని ప్రముఖ క్రిటిక్ జీవీ ట్వీట్ చేశారు.

20 నిమిషాల ఇంటర్వెల్ ఎపిసోడ్, అఖండ ఎంట్రీ బాగుంది. శివుడు తాండవం సీన్, 5 భూతాలతో ఫైట్, సెకండాఫ్ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లింది. క్లైమాక్స్‌కి చప్పట్లు కొట్టాల్సిందే. అఖండ 2కి నా రేటింగ్ 3.5/5 అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X