Akhanda Movie Review: అఖండ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, సాయికుమార్, పూర్ణ, శరత్ లోహితస్వ, సుబ్బరాజు, చమ్మక్ చంద్ర తదితరులు
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
సంగీతం: ఎస్ తమన్
సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
రిలీజ్: 2021-12-02
ఫ్యాక్షన్ వ్యవహారాలతో రగిలిపోయే అనంతపురం జిల్లాకు చెందిన రైతు మురళీకృష్ణ (బాలకృష్ణ) తోటి రైతులకు ఎలాంటి ఆపద వచ్చినా ప్రాణాలు అడ్డేసి ఆదుకొంటాడు. అదే జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన శరణ్య (ప్రగ్యా జైస్వాల్) మురళీకృష్ణలోని ధైర్యం, సేవాగుణం చూసి ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవడం... అనంతరం వారికి ఓ కూతురు కూడా పుడుతుంది. అదే ప్రాంతంలో అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన వరదరాజన్ (శ్రీకాంత్)త వైరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఓ కేసులో ఇరికించి మురళీకృష్ణను అరెస్ట్ చేస్తారు. శరణ్యను సస్పెండ్ చేస్తారు. మురళీకృష్ణ కూతురును చంపడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలోనే అఘోరా రూపంలో అఖండ (బాలకృష్ణ) వచ్చి ఆ పాపను కాపాడేందుకు ప్రయత్నిస్తారు.

మురళీకృష్ణ, శరణ్య ప్రేమ వ్యవహారం ఎలా సాగింది. శరణ్యతో దాంపత్య జీవితం ఎలా కొనసాగింది? ఏ కేసులో మురళీకృష్ణను జైలుకు పంపారు? మురళీకృష్ణను ఎందుకు చంపాలని అనుకొన్నారు? అఖండ రంగ ప్రవేశం ఎలా జరిగింది? అఖండ జీవితం వెనుక కథ ఏమిటి? వరదరాజన్‌ను అఖండ శిక్షించడానికి కారణం ఏమిటి? మురళీకృష్ణ, శరణ్య జీవితం మళ్లీ మమూలు స్థాయికి చేరుకొన్నాదా? వరద రాజన్ అరచకాలకు అఖండ ఇచ్చిన ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే అఖండ సినిమా కథ.
రైతుల సమస్యలతో అఖండ చిత్రం సాఫీగా, ఎమోషనల్‌గా సాగుతుంది. ఫస్టాఫ్‌లో మురళీకృష్ణ, శరణ్య లవ్ ట్రాక్ కమర్షియల్ అంశాలతో కథను ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పాటుగా ఉంటుంది. వరదరాజన్ విలనిజం, దానిని అడ్డుకొనేందుకు హీరో ప్రయత్నించడం రెగ్యులర్ ఫార్మాట్‌లో సాగిపోతుంది. ఇక అఖండ ఎంట్రితీ కథాస్వరూపమే మారిపోతుంది. సెకండాఫ్‌లో పూర్ణపై వరదరాజన్ చేసే మానభంగం అంశం సినిమాను మలుపుతిప్పే అంశంగా మారుతుంది. అఖండగా బాలకృష్ణ విశ్వరూపంతో సినిమా సూపర్ హిట్ కావాల్సిన హంగులు ఆర్బాటలతో ముగుస్తుంది.
అఖండ సినిమాకు సాంకేతిక విభాగాలే కొండంత బలం. ముఖ్యంగా తమన్ ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా రేంజ్‌ను పెంచింది. పాటలు కూడా ఈ సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇక సీ రాంప్రసాద్ కెమెరా వర్క్, యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ ఈ సినిమాకు మరో హైలెట్. మిర్యాల రవీందర్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
అఖండగా బాలకృష్ణ కొత్త రూపం, గెటప్ తగినట్టుగా డైలాగ్స్ అన్నీ చక్కగా కుదిరాయి. బాలకృష్ణ అభిమానులకు ఏం కావాలో అలా దర్శకుడు బోయపాటి పళ్లెంలో పంచభక్ష పరమాన్నంలా పేర్చి పెట్టారు. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. శ్రీకాంత్ విలనిజంతో ఇరుగదీశాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా అఖండ 2 గా సీక్వెల్‌గా రూపొందింది. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అఖండ 2 సినిమా విశేషాలు, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











