Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Most Eligible Bachelor Review : కన్ఫ్యూజన్ లో పడేసిన బ్యాచిలర్.. ఎలా ఉందంటే?
Rating: 2.75/5
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టే టీజర్, ట్రైలర్ అలాగే ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేశాయి. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడు అనేది సమీక్షలో తెలుసుకుందాం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కథ ఏమిటంటే
బాగా చదువుకుని అమెరికాలో సెటిల్ అయ్యి ఉద్యోగం చేస్తున్న హర్షకు(అఖిల్) మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరిక.. తమ ఉమ్మడి కుటుంబంలో చూస్తూ పెరిగిన దాని ప్రకారం పెళ్లి చేసుకునే అమ్మాయి సర్దుకుపోయే వ్యక్తి అయితే జీవితం అంతా సంతోషంగా గడిచి పోతుంది అనే ఆలోచనతో ఉంటాడు. అదే ఆలోచనతో 20 రోజులు సెలవు దొరకడంతో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసుకుని 20 మంది అమ్మాయిలను చూసి ఒకరిని ఫైనల్ చేసి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వస్తాడు.
అలా వచ్చిన హర్ష జాతకాలు కలవలేదని హర్ష తల్లిదండ్రులు రిజెక్ట్ చేసిన విభా(పూజా హెగ్డే) మాటలతో ముందు కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ తర్వాత ఆమె మాటలు అర్థమయ్యాక ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే పరిస్థితులు తారుమారయ్యాయి, ఈ వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. పోలీసు కేసులు కూడా అయ్యాక హర్ష తల్లిదండ్రులు హర్షను అమెరికా పంపించేస్తారు. చివరికి హర్ష, విభాలు ఎలా కలిశారు అనేది సినిమా కథ.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో ట్విస్టులు
తనకు సూటయ్యే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న హర్ష మనసును విభా ఎలా మార్చింది? ముందు విభా మాటలు విని కన్ ఫ్యూజన్ లో పడిన హర్ష చివరికి ఎలా ప్రేమలో పడతాడు? తన మాటలు తప్పు అని తెలుసుకున్న విభా? అందుకు ఎం చేసింది? ఆమె పెళ్లికి ఎందుకు దూరమైంది? విభాను మళ్ళీ హర్ష ఎలా కలిశాడు? ఎలా ప్రేమలో పడేశాడు ? హర్ష తల్లిదండ్రులను, విభా తల్లిదండ్రులను వారి ప్రేమ విషయంలో ఎలా ఒప్పించారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వ ప్రతిభ
భాస్కర్ ఎప్పటిలాగే ఒక చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ బలమైన కథనంతో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పటిలాగే అయినా చిన్న లైన్ ని పట్టుకుని సినిమా మొత్తం పూర్తి చేశాడు. కథ కంటే కథనాన్ని ఎక్కువ నమ్ముకున్నాడు కానీ ఇది ఇప్పటికే కన్ఫ్యూజన్ లో ఉన్న వారిని మరింత గందరగోళానికి గురయ్యే ప్రయత్నంలా కనిపించింది.
ప్రేమలో ఉండే కన్ఫ్యూజన్ గురించి ఆరెంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు కాస్త ముందుకు వెళ్లి పెళ్లి చేసుకోబోయే వారి మీద కథ రాసుకున్నాడు. పెళ్లంటే సర్దుకు పోయేది కాదు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నిలబడాల్సిన విషయం అనే పాయింట్ చెప్పడానికి ఫిక్స్ అయ్యాడు కానీ చెప్పడంలో మళ్లీ కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది.
ఈ కన్ఫ్యూజన్ కారణంగా సెకండాఫ్ చాలా స్లోగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. చివరికి క్లైమాక్స్ కంక్లూజన్ ఇచ్చినా ప్రేక్షకులను కనిపించని కన్ఫ్యూజన్ లో పడేశాడు ఏమో అనిపిస్తుంది. ప్రేమ, రొమాన్స్ కి తేడా ఏమిటి ? ప్రేమలో రొమాన్స్ ఉండదా ? రొమాన్స్ లో ప్రేమ ఉండదా ? అంటూ కొత్త రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. అయితే సినిమాలో బొమ్మరిల్లు గుర్తులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. పాత్రలు-పాత్రధారులు, కథ నెరేషన్ ఇచ్చే విధానం అన్నీ కూడా బొమ్మరిల్లుని గుర్తుకు తీసుకొచ్చాయి.

అఖిల్ నటన విషయానికి వస్తే
అఖిల్ అక్కినేని సినిమా సినిమాకు తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. గత సినిమాల కంటే చాలా బాగా నటించాడు అని చెప్పవచ్చు. అయితే అఖిల్ నటన బాగానే ఉన్నా లుక్స్ పరంగా చాలా షేడ్స్ తో కనిపించడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించే విషయం. అఖిల్ ఇతరుల అభిప్రాయాలనే తన అభిప్రాయంగా మార్చుకుని దానిని నిజమని నమ్మే యువకుడిలా ఆ తర్వాత పూజ హెగ్డే మాటలతో తెలివిగా మారిపోయిన యువకుడిగా రెండు విభిన్న పార్శ్యాలను బాగానే పోషించాడు.

పూజా హెగ్డే నటన విషయానికి వస్తే
ఎప్పటిలాగే పూజా హెగ్డే తనదైన శైలిలో నటించి సినిమాకి చాలా పెద్ద అసెట్ అయింది. చాలా ఈజ్ తో పూజ నటించినట్లు కనిపించింది. కాకపోతే ఆమె పాత్ర క్రియేట్ చేసినప్పుడు భాస్కర్ మళ్లీ కన్ఫ్యూజ్ అయ్యారు ఏమో అనిపించింది.. ఎందుకంటే ఒక స్టాండప్ కమెడియన్గా మొదటి నుంచి బలమైన అభిప్రాయాలు కలిగిన మహిళగా చాలా స్ట్రాంగ్ లేడీ అన్నట్లుగా చూపించగా, ఆమె సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న విషయాలకు కూడా భయపడి పోయి హడలిపోతున్నట్లుగా చూపించడంలో భాస్కర్ ఆంతర్యం ఏమిటో తెలియదు.. పూజా హెగ్డే నటన విషయంలో ఎక్కడా వేలెత్తి చూపాల్సిన పని లేదు.

ఇతర నటీనటుల విషయానికి వస్తే
సాధారణంగా ఈ సినిమాలో చాలా మంది నటీనటులు కనిపించారు.. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఎలా ఉండాలో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఉండాల్సినట్టుగా ఉమ్మడి కుటుంబం కాన్సెప్టుతో రంగంలోకి దించారు. భారీ క్యాస్టింగ్ తో స్క్రీన్ మొత్తాన్ని నింపేశారు. వారంతా ఎవరికి వారు తమదైన శైలిలో నటించి ఆకట్టుకున్నారు. ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, శాన్వి మేఘన, సాయి కామాక్షి లాంటి హీరోయిన్ మెటీరియల్స్ ని కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ ల కోసం వాడేశారు బొమ్మరిల్లు భాస్కర్. ఇక మురళీశర్మ ప్రగతి, జయ ప్రకాష్, ఆమని, సత్య, అజయ్, వెన్నెల కిషోర్, సుడిగాలి సుదీర్, అభయ్, గెటప్ శ్రీను ఎవరికి వారు తమదైన శైలిలో నటించి మెప్పించారు.

టెక్నికల్ విషయానికి వస్తే
దాదాపు అన్ని టెక్నికల్ విభాగాల పనితీరు కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫీ గురించి. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ని సెట్ ని కూడా అమెరికాలో ఉన్నట్టు ఫీలింగ్ కలిగించేలా ఆయన తన పనితనం చూపించాడు. సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీతం మరీ ముఖ్యంగా లెహరాయి సాంగ్ అయితే సినిమాకి మంచి ప్లస్ అయింది..
ఇక నేపథ్య సంగీతం కూడా సినిమాలో లీనమై పోయే విధంగా రూపొందించారు. సెకండ్ హాఫ్ బాగా లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ కట్ చేసే అవకాశం లేకుండానే దాన్ని బాగా రెడీ చేశారు మార్తాండ్.కె.వెంకటేష్. గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వస్తున్న సినిమా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఇంకా చెప్పే అవసరం ఏముంటుంది, ఎప్పటిలాగానే ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

ఇక ఫైనల్ గా
పెళ్లికి ముందు ఆడ మగ కలిసి మాట్లాడుకుని తమ జీవితాలు ఎలా ఉండబోతున్నాయి ? ఎలా మారబోతున్నాయి అనే విషయం మీద క్లారిటీ తెచ్చుకోవాలి, పెళ్లంటే సర్దుకు పోవడం కాదు పెళ్లంటే జీవితాంతం మనతో గడిపే సరైన వ్యక్తులను ఎన్నుకోవడం అనే విషయాన్ని చాలా లైటర్ నోట్ లో చెప్పిన సినిమా ఇది. సెకండ్ హాఫ్ కాస్త లాగ్ అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా సినిమా పరంగా బాగుంది. ఫ్యామిలీతో కలిసి ఆనందంగా దసరాకి చూడగలిగిన సినిమా ఇది. అయితే రొమాన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నా హద్దు దాటినట్లు మాత్రం ఎక్కడా అనిపించకపోవడం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
Recommended Video

నటీనటులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, అమిత్ తివారీ, పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్
దర్శకుడు: బొమ్మరిల్లు భాస్కర్
బ్యానర్: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ
సంగీత దర్శకుడు: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: ప్రదీష్ వర్మ
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకట్