twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జండుబామెక్కడ

    By Staff
    |

    Akka Bavekkada
    చిత్రం: అక్కా!బావెక్కడ
    నటీనటులు: చక్రవర్తి, రాశి, ఆశాషైనీ, కోవైసరళ, బ్రహ్మనందం, గిరిబాబు.
    సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌.
    నిర్మాత: తరంగ సుబ్రమణ్యం
    దర్శకత్వం: రాజావన్నెంరెడ్డి.

    క్షేమంగా వెళ్ళి లాభంగా రండితో దర్శకుడిగా అడుగుపెట్టిన రాజావన్నెంరెడ్డి మరోసారి తన 'నిజమైన ప్రతిభ'ను నిరూపించుకున్నాడు. రాజావన్నెంరెడ్డికి తలనొప్పి తెచ్చి పెట్టే చిత్రాలను రూపొందించే సత్తా తప్ప నిజంగా సినిమాలు నిర్మించే ప్రతిభలేదని అక్కాబావెక్కడ చిత్రం రుజువుచేసింది. చూసొద్దాం..రండి చిత్రం తర్వాత తీసిన ఈ సినిమా తెలుగు టీవీ సీరియల్‌ కన్నా అధ్వాన్నంగా ఉంది. రోటీన్‌ కథకు రోటీన్‌ స్క్రీన్‌ ప్లే.

    కొవైసరళ కొడుకు చక్రవర్తి. కొడుకును కోటీశ్వరుడి కూతురుకిచ్చి పెళ్ళిచేయాలని ఆశయం. గిరిబాబుకు ఇద్దరు కూతుళ్ళు- రాశి, ఆశాషైనీ. హీమాన్‌ లాంటివాణ్ణి పెళ్ళిచేసుకోవాలనేది ఆశా ఆశ. ఒకసారి చక్రవర్తి ఫైటింగ్‌ చేస్తుంటే చూసి ఆశా ప్రేమిస్తుంది. మరో సందర్భంలో రాశి, చక్రవర్తి తటస్థపడుతారు. ఇద్దరూ స్నేహితులవుతారు. ఆ తర్వాత ప్రేమికులు అవుతారు. గిరిబాబు మాత్రం వీరి పెళ్ళికి ఒప్పుకోడు. చక్రవర్తి అంటే గుండా అని ముద్ర పడుతుంది గిరిబాబు మనసులో. కోటీశ్వరుడి సంబంధం వదులుకోవద్దని కోవైసరళ ఓ అబద్దమాడుతుంది. తనకు మరో కొడుకు ఉన్నాడని, వాడు పక్కా రౌడి అని చెప్పుతుంది.

    మరోవైపు చక్రవర్తి అంటే తనకు ప్రాణమని, తనే పెళ్ళి చేసుకుంటానని ఆశ అంటుంది. ఇద్దరి చక్రవర్తులు వస్తే పెళ్ళి చేస్తానని గిరిబాబు చెప్పుతాడు. నిజంగానే మరో చక్రవర్తి ఉంటాడని తర్వాత తెలుస్తుంది. వాడు జైలునుంచి బయటికి వస్తాడు. ఫ్లాష్‌ బ్యాక్‌ లో...బ్రహ్మానందం వీరప్పన్‌ టైప్‌ లో సూరప్పన్‌ తరహా బందిపోటు. డ్యాన్స్‌ చేస్తున్న కోవై సరళను ప్రేమిస్తాడు. వీరికి పుట్టినవాడే చక్రవర్తి. మళ్ళీ ఈ సూరప్పన్‌ ఇన్నాళ్ళ తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షమవుతాడు సర్ధారుగా. చివరికి బ్రహ్మనందం, కోవై సరళ కలవడం, ఇద్దరు చక్రవర్తులు పెళ్ళి చేసుకోవడంతో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటపడుతారు.

    బ్రహ్మనందం పాత్రకు అంత బిల్డప్‌ ఎందుకో అర్థం కాదు. రాజా వన్నెం రెడ్డి తను నటించేందుకే మెహబుబా..మెహబూబా అనే పాటను పెట్టినట్లు ఉంది. నటన గురించి చెప్పడం శుద్దదండగ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X