Akkineni Nagarjuna Review On Biker: బైకర్ మూవీపై కింగ్ నాగార్జున రివ్యూ

యంగ్ హీరో శర్వానంద్, టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన మూవీ బైకర్. బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో, స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై తొలి నుంచి మంజి బజ్ నెలకొంది. టాలీవుడ్ నుంచి ఈ తరహా మూవీ రావడం ఇదే తొలిసారి కావడంతో ఆడియన్స్ కూడా ఆసక్తి చూపించారు. గుడ్ ఫ్రైడ్ కానుకగా ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. బైకర్ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు.

Also Read
చచ్చిపోతానని ఇంట్లో బెదిరించా... ప్రవీణ్‌తో పెళ్లి అప్పుడే... పటాస్ ఫైమా
చచ్చిపోతానని ఇంట్లో బెదిరించా... ప్రవీణ్‌తో పెళ్లి అప్పుడే... పటాస్ ఫైమా

బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా బైకర్ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ సంగీత దర్శకత్వం వహించగా.. జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను వీక్షించిన సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా కింగ్ అక్కినేని నాగార్జున ఈ సినిమాను చూసి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

Akkineni Nagarjuna Review On Biker  King Praises Sharwanand and Rajasekhar   s Emotional Racing Drama

తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, తను సాధించలేకపోయిన లక్ష్యాన్ని కొడుకుతో చేయించాలని తండ్రి తాపత్రయపడటం, బైక్ రేసింగ్ చుట్టూ జరిగే కథలో బైకర్ మూవీని తెరకెక్కించారు. టెక్నికల్‌గా ఈ సినిమా స్టాండర్డ్స్ బాగున్నాయని చూసినవారు రివ్యూ ఇస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి రేసింగ్ ఎపిసోడ్స్ చూడలేదని కొందరు అభిప్రాయపడుతూ పోస్టులు పెడుతున్నారు. డాక్టర్ రాజశేఖర్- శర్వానంద్ మధ్య బాండింగ్ బాగుందని, వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉందని చెబుతున్నారు. తండ్రి, భార్య, కొడుకు అనుబంధాలు.. లక్ష్యం కోసం క్రీడాకారులు ఎలాంటి త్యాగాలు చేస్తారో ఈ చిత్రం చూపించిందని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

Recommended For You
'అమ్మాయిలతో నిర్మాతకి కమిట్మెంట్... ఆ డైరెక్టర్ వల నుంచి అలా తప్పించుకున్నా’
'అమ్మాయిలతో నిర్మాతకి కమిట్మెంట్... ఆ డైరెక్టర్ వల నుంచి అలా తప్పించుకున్నా’

టాలీవుడ్‌తో పాటు కొత్తగా ఏ సినిమా వచ్చినా? అది చిన్నదైనా? పెద్దదైనా ఖచ్చితంగా దానిని వీక్షించి ప్రోత్సహించడంలో కింగ్ అక్కినేని నాగార్జున ముందుంటారు. ఇటీవల రణ్‌వీర్ సింగ్ - ఆదిత్య ధర్‌ల ధురంధర్ 2 చిత్రాన్ని వీక్షించిన నాగార్జున.. చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా మేకింగ్ ప్రమాణాలను ధురంధర్ 2 మరో స్థాయికి తీసుకెళ్లిందని తెలిపారు. తాజాగా శర్వానంద్- రాజశేఖర్ నటించిన బైకర్‌ మూవీని చూసిన నాగార్జున ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

You May Also Like
'నన్ను అనుభవించాలని పనివాడు అలా ట్రాప్... బిల్డింగ్‌పై నుంచి దూకేశా’
'నన్ను అనుభవించాలని పనివాడు అలా ట్రాప్... బిల్డింగ్‌పై నుంచి దూకేశా’

బైకర్ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్, బంధాలను అత్యంత అందంగా ఆవిష్కరించే అద్భుతమైన సినిమాల. ఇందులో రేసింగ్ సన్నివేశాలు, క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంకేతికంగా ఈ సినిమా ఎంతో ఉన్నతంగా ఉంది. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పూర్వ విద్యార్ధి అయినా దర్శకుడు అభిలాష్ కంకర ఈ కథను ఎంతో మెచ్యూర్డ్‌గా తెరకెక్కించడం పట్ల గర్వంగా ఉంది. బైకర్ చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలూ అంటూ నాగార్జున రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ ద్వారా దర్శకుడు అభిలాష్ తన స్కూల్ నుంచి వచ్చిన విద్యార్ధి అని బయటపెట్టారు నాగ్. ప్రస్తుతం నాగార్జున ట్వీట్ వైరల్ అవుతుండగా.. ఆయన రివ్యూ నేపథ్యంలో బైకర్‌పై ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X