twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్షర మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    రేటింగ్: 2.25/5
    నటీనటులు: నందితా శ్వేత, సంజయ్ స్వరూప్, శకలక శంకర్, సత్య, మధునందన్, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, శ్రీతేజ్, శత్రు తదితరులు
    కథ, దర్శకత్వం: బీ చిన్నికృష్ణ
    నిర్మాత: అల్లూరి సురేశ్ వర్మ
    మ్యూజిక్: సురేశ్ బొబ్బిలి
    సినిమాటోగ్రఫి: నగేష్ బానెల్
    ఎడిటింగ్: జీ సత్య
    బ్యానర్: సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్
    రిలీజ్ డేట్: 2021-02-26

    అక్షర కథ

    అక్షర కథ

    విద్యా విధాన్ కార్పోరేట్ కాలేజీ యాజమాని (సంజయ్ స్వరూప్) సంస్థలో అక్షర లెక్చరర్. అదే కాలేజీలో పనిచేసే శ్రీతేజ్ (శ్రీతేజ్) అనే ఉద్యోగి అక్షర‌ను చూసి ప్రేమలో పడుతాడు. తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించగా శ్రీతేజ్‌ను అక్షర కాల్చి చంపుతుంది. ఆ తర్వాత పోలీస్ అధికారిని కూడా కాల్చి చంపుతుంది.

    అక్షర మూవీలో ట్విస్టులు

    అక్షర మూవీలో ట్విస్టులు

    తనను ప్రేమించిన శ్రీతేజ్‌ను, పోలీస్ ఆఫీసర్‌ను అక్షర ఎందుకు కాల్చి చంపింది? అక్షరకు హత్యలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది? అసలు అక్షర ఫ్యాష్ బ్యాక్ ఏమిటి? విద్యా విధాన్ విద్యా సంస్థలో లెక్చరర్‌గా ఎందుకు చేరింది? షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ పాత్రలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం అక్షర.

    అక్షర మూవీ ఎనాలిసిస్

    అక్షర మూవీ ఎనాలిసిస్

    మార్కులు, ర్యాంకుల అంటూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసే కార్పోరేట్ కాలేజీలపై సంధించిన విమర్శనాస్త్రం అక్షర చిత్రం. బేసిక్ పాయింట్‌ బాగున్నప్పటికీ.. దానిని వెండితెర మీద ఫీల్‌గుడ్ పాయింట్‌గా, వ్యవస్థను ఆలోచింప చేసేలా చేయడంలో తడబాటు కనిపిస్తుంది. వ్యవస్థలోని ఓ సీరియస్ అంశంపై దృష్టిపెట్టకుండా కమర్షియల్ హంగుల కోసం నాసిరకమైన కామెడీని జొప్పించడంతో భావోద్వేగమైన కథ తేలిపోయినట్టు అనిపిస్తుంది.

    దర్శకుడు అనుసరించిన విధానం

    దర్శకుడు అనుసరించిన విధానం

    తొలి భాగంలో షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్‌తో నాసిరకమైన కామెడీ నమ్ముకున్న దర్శకుడు రెండో భాగం చివర్లో అసలు కథను చెప్పడంతో అప్పటికే సమయం మించిపోయింది. తొలి భాగంలో ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని భావించిన ప్రేక్షకులకు మళ్లీ నాసిరకమైన ఇన్వెస్టిగేషన్‌ కథను నీరు గార్చాడనే ఫీలింగ్ కలుగుతుంది.

    ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు

    ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు

    అక్షర మూవీలో చివరి అర్ధగంట సినిమాకు బలమైన పాయింట్‌గా మారింది. ప్రీ క్లైమాక్స్‌లో హర్షవర్ధన్ ఎపిసోడ్, అక్షర బాల్యంలోని ఎమోషనల్ సంఘటనలు సినిమాను భావోద్వేగంగా మారుస్తాయి. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడంతో సగటు ప్రేక్షకుడు ఆలోచింప చేసేలా మారుతాయి. ఓవరాల్‌గా దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ భేష్‌గా ఉన్నప్పటికీ.. తెర మీదకు సరిగా తీసుకురాలేకపోయాడనే విషయం అర్ధం అవుతుంది.

    నందిత శ్వేత యాక్టింగ్

    నందిత శ్వేత యాక్టింగ్

    అక్షర మూవీలో నందిత శ్వేత సినిమాకు హైలెట్‌గా మారింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా రాణించారు. సంజయ్ స్వరూప్ తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. హర్షవర్ధన్ నటన బాగుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల ప్రాధాన్యత గురించి చెప్పిన విధానం సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. మిగిత నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

    ప్రొడక్షన్ వాల్యూస్

    ప్రొడక్షన్ వాల్యూస్

    నిర్మాత సురేశ్ వర్మ మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ పాటించారు కానీ.. కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే మెరుగైన ఫలితం రాబట్టే చాన్స్ ఉండేది. సామాజిక బాధ్యత అంశంగా వచ్చే సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు అక్షర సినిమా తప్పకుండా నచ్చుతుంది. బీ, సీ సెంటర్లలో సినిమా ప్రేక్షకులకు చేరువైతే మంచి విజయాన్ని అందుకొనే అవకాశం ఉంది.

    English summary
    Akshara is crime thriller film written and directed by B. Chinni Krishna, produced by Alluri Suresh Varma and Bellamkonda Ahiteja through Cinema Hall Entertainments. The film has an ensemble cast of Nandita Swetha, Shakalaka Shankar, Ajay Ghosh, Satya and Madhunandan. This movie hits the screen on February 26, 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X