For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Laxmii మూవీ రివ్యూ అండ్ రేటింగ్: లారెన్స్ రాఘవ, అక్షయ్ కాంబినేషన్ ఎలా ఉందంటే

  |

  Rating:
  2.5/5
  Star Cast: అక్షయ్ కుమార్, కియారా అద్వాని, రిషి చద్దా, అశ్విని కాలేస్కర్, ఆయేషా రజా మిశ్రా
  Director: రాఘవ లారెన్స్

  దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఘన విజయం సాధించిన కాంచన చిత్రం ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీబాంబ్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కొన్ని వివాదాలు ముందుకు రావడంతో లక్ష్మీ బాంబ్ కాస్త... లక్ష్మిగా మారింది. లారెన్స్ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ కియారా అద్వానీ జంటగా నటించారు. నవంబర్ 9న డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించిందనే విషయాన్ని తెలుసుకొందాం..

  లక్ష్మి కథ ఏమిటంటే

  లక్ష్మి కథ ఏమిటంటే

  ఆసిఫ్ (అక్షయ్ కుమార్), రష్మి (కియారా అద్వాని) ప్రేమించుకొని మతాంతర వివాహం చేసుకొంటారు. అయితే ముస్లిం మతానికి చెందిన వాడనే కారణంతో పెళ్లిని రష్మి తల్లిదండ్రులు వ్యతిరేకించి వారిని దూరంగా పెడుతారు. అయితే తమ తల్లిదండ్రుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆసిఫ్, రష్మి దంపతులు తమ డామన్‌కు చేరుకొంటారు. ఆ క్రమంలో లక్ష్మి అనే ట్రాన్స్‌జెండర్ ఆత్మ ఆసిఫ్ దేహంలో ప్రవేశిస్తుంది.

  లక్ష్మి మూవీలో ట్విస్టులు

  లక్ష్మి మూవీలో ట్విస్టులు

  ఆసిఫ్‌తో పెళ్లిని రష్మి తమ తల్లిదండ్రులు చివరకు అంగీకరించారా? ఆసిఫ్ దేహంలోకి లక్ష్మి ఆత్మ ఎలా ప్రవేశించింది? లక్ష్మి ఆత్మ ఆసిఫ్‌లోకి ప్రవేశించడానికి కారణం ఏమిటి? లక్ష్మి లక్ష్యాన్ని ఆసిఫ్ నెరవేర్చాడా? లక్ష్మి కోరికను తీర్చడానికి ఆసిఫ్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్మి సినిమా కథ.

  లక్ష్మి మూవీ అనాలిసిస్

  లక్ష్మి మూవీ అనాలిసిస్

  కాంచన సినిమాను పరిగణనలోకి తీసుకొంటే పెద్దగా మార్పులేమి చేయకుండానే లక్ష్మి చిత్రాన్ని దర్శకుడు లారెన్స్ రాఘవ తెరకెక్కించాడు. కేవలం అక్షయ్ కుమార్, కియారా అద్వానీ పెళ్లి చేసుకోవడమే కథలో కొత్తగా మార్పు కనిపిస్తుంది. మిగితా అంతా సేమ్ టూ సేమ్. అయితే తెలుగు, తమిళంలో ఉన్న మాదిరిగా హిల్లేరియస్ కామెడి ఎక్కడా కనిపించదు. కాంచన విజయానికి కామెడీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కోవై సరళ, ఇతర నటీనటులు పెర్ఫార్మెన్స్ కారణమనేది అందరికి తెలిసిందే.

  అయితే అలాంటి పెర్ఫార్మెన్స్ హిందీలో కనిపించకపోవడం దక్షిణాది ప్రేక్షకులకు కాస్త నిరాశగానే అనిపిస్తుంది. ఇక ఉత్తరాది ప్రేక్షకులు ఈ కథ కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ చిత్రానికి కొంత ఆదరణ లభించే అవకాశం ఉంది. ఆరంభంలో కొన్ని సీన్లు.. క్లైమాక్స్‌లో కొన్ని సీన్లు మాత్రమే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. కాంచన చిత్రంలో మాదిరిగా ఇంటర్వెల్‌ ముందు, ఆ తర్వాత ఉండే హిల్లేరియస్ కామెడీ ఎక్కడ కనిపించకపోవడం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.

  అక్షయ్ కుమార్, కియారా అద్వానీ

  అక్షయ్ కుమార్, కియారా అద్వానీ

  అక్షయ్ కుమార్ తన పాత్ర పరిధి మేరకు మెప్పించారు. దెయ్యాలు లేవని, ఇతర మూఢ నమ్మకాలను ఎదురించే ముస్లిం యువకుడిగా ప్రథమార్థంలో కనిపిస్తాడు. అయితే అలాంటి వ్యక్తి ఆత్మలు ఉంటాయని నమ్మి మారిన తర్వాత అక్షయ్ కుమార్ నటన భిన్నంగా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అక్షయ్ నటన హైలట్ అని చెప్పవచ్చు. ఇక కియారా అద్వానీ గ్లామర పరంగా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది. పాత్రను పూర్తిగా పండించడంలో విఫలమైందని చెప్పవచ్చు. బుర్జ్ ఖలీఫా పాటలో జోష్‌గా కనిపించింది.

  టెక్నికల్‌ అంశాలు ఇలా..

  టెక్నికల్‌ అంశాలు ఇలా..

  లక్ష్మి మూవీకి సంబంధించి సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలంగా మారిందని చెప్పవచ్చు. అలాగే వీఎఫెఎక్స్ విభాగం పనితీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలో గ్రాఫిక్ వర్క్ చాలా బాగుంది. ఇక అక్షయ్ కుమార్‌ను పూర్తిగా ట్రాన్స్‌జెండర్‌‌గా మార్చివేసి కొత్త అనుభూతిని పంచడంలో మేకప్ ఆర్టిస్టుల ప్రతిభను ప్రశంసించాల్సిందే.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  కాంచన మూవీ చూడని వారికి లక్ష్మి డెఫినెట్‌గా కొత్త అనుభూతిని పంచుతుంది. కథలో ఉండే ఎమోషనల్ పాయింట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. దీపావళి సమయంలో హారర్, కామెడీ చిత్రాలను ఆదరించే వారికి లక్ష్మి మంచి వినోదభరిత చిత్రంగా అనుభూతిని మిగుల్చుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుల ఎంపిక, పాత్రధారుల కారణంగా లక్ష్మి మరో లెవెల్‌కు వెళ్లలేకపోయిందనే చెప్పవచ్చు.

   తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: అక్షయ్ కుమార్, కియారా అద్వాని, రిషి చద్దా, అశ్విని కాలేస్కర్, ఆయేషా రజా మిశ్రా, రాజేష్ శర్మ తదితరులు
  కథ, రచన, దర్శకత్వం: రాఘవ లారెన్స్
  నిర్మాత: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్, తుషార్ ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్
  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: అమర్ మొహైల్
  మ్యూజిక్: తనిష్క్ బగ్చి, షాహీ డీజే కుషి, అనూప్ కుమార్, ఉల్లుమనతి
  సినిమాటోగ్రఫి: వెట్రి పళనిస్వామి, కుష్ చాబ్రియా
  ఎడిటింగ్:రాజేశ్ జీ పాండే
  ఓటీటీ రిలీజ్: 2020-11-09
  ఓటీటీ: డిస్నీ+ హాట్‌స్టార్

  English summary
  Laxmii is a Bollywoods comedy horror film written and directed by Raghava Lawrence in his Hindi directorial debut. It is a remake of the 2011 Tamil film Kanchana and stars Akshay Kumar and Kiara Advani in the lead roles. It was the first big budget film which was streamed digitally on Disney+Hotstar on 9 November 2020 and was not released theatrically due to the COVID-19 Pandemic.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X