For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల వైకుంఠపురంలో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, నివేతా పేతురాజ్
  Director: త్రివిక్రమ్

  ప్రతీ ఇల్లు ఓ స్వర్గం లాంటిది అంటారు. కానీ అలాంటి స్వర్గం లాంటి ఇంటికి కూడా కలతలు, కన్నీళ్లు, కలహాలు తప్పవు. ఏ ఇంటిలోనైనా తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఓ వ్యక్తి తప్పక ఉంటాడు. అల వైకుంఠపురం అనే ఇంటిలో తలెత్తిన సమస్యలను ఇంటికి బంధం ఉండి కూడా ఉన్నట్లు లేని వ్యక్తి ఎలా తీర్చారనే పాయింట్‌తో ప్రేక్షకులకు త్రివిక్రమ్ అందించిన సంక్రాంతి కానుక మెప్పించిందా అంటే కథలోకి వెళ్లాల్సిందే.

  అల వైకుంఠపురంలో కథ

  అల వైకుంఠపురంలో కథ

  వాల్మికీ (మురళీ శర్మ), రామచంద్ర (జయరాం) ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కాలం కలిసి వచ్చి జయరాం కంపెనీకి ఓనరైతే. వాల్మికీ మాత్రం సగటు ఉద్యోగిగానే మిగిలిపోతాడు. ఆ క్రమంలో జయరాం భార్య (టబు), వాల్మీకి సతీమణి (రోహిణి) ఒకే సమయంలో ఒకే హాస్పిటల్ పండంటి బిడ్డకు జన్మనిస్తారు. కానీ జయరాం బిడ్డ పుట్టగానే చనిపోయాడని తన బిడ్డను నర్సు సహాయంతో జయరాం బిడ్డగా మార్చేస్తాడు. ఆ తర్వాత జయరాం బిడ్డ బతకడంతో తానే బంటు (అల్లు అర్జున్) అని నామకరణం చేసి పెంచుతాడు. తన లాగా మధ్య తరగతి కుటుంబంలో పెరగకుండా తన బిడ్డ (రాజు) ఉన్నందుకు ఆనంద పడిపోతాడు. కానీ ఓ పరిస్థితిలో నర్సు బంటుకి అసలు విషయం చెప్పడంతో కథలో కొత్త మలుపు తిరుగుతుంది.

  అల వైకుంఠపురంలో ట్విస్టులు

  అల వైకుంఠపురంలో ట్విస్టులు

  వాల్మీకి బిడ్డను కాదని తెలుసుకొన్న బంటు ఆ తర్వాత ఏం చేశాడు. తన సొంత తల్లిదండ్రులకు బంటు ఎలాంటి పరిస్థితుల్లో చేరువయ్యాడు. ఆ సమయంలో తన తల్లిదండ్రులకు ఎదురైన సమస్యను ఎలా పరిష్కరించాడు. ఇక తన జీవిత ప్రయాణంలో ఎదురైన అమూల్య (పూజా హెగ్డే)తో ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది. రాజ్ (సుశాంత్)‌కు ఎదురైన సమస్యను బంటు ఎలా తీర్చాడు. ఇక కథలో అప్పలనాయుడు (సముద్రఖని), ప్రజాపతి (రాజేంద్ర ప్రసాద్), ఇంటి పెద్ద (సచిన్ ఖేల్కర్) పాత్ర ఏమిటి.. అనేక సమస్యల్లో కూరుకుపోయిన ఇంటిని స్వర్గంగా ఎలా మార్చాడు అనే ప్రశ్నలకు సమాధానమే అల వైకుంఠపురంలో..

  అల వైకుంఠపురంలో ఫస్టాఫ్ అనాలిసిస్

  అల వైకుంఠపురంలో ఫస్టాఫ్ అనాలిసిస్

  మధ్య తరగతి జీవితాన్ని ఈసడించుకొనే వాల్మీకి.. పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను హాస్పిటల్‌‌లో చేర్పించడం.. అదే సమయంలో జయరాం భార్య కూడా బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆస్పత్రికి రావడం అనే సీన్లతో తొలి భాగం మొదలవుతుంది. ఓ ఎమోషనల్ సన్నివేశంలో పుట్టిన బిడ్డలను మార్చడం, నర్సును వాల్మీకి మేడ మీద నుంచి కిందకు తోసేయడం.. ఆమె కోమాలోకి చేరుకోవడం లాంటి సీన్లను చకచకా ముగించి.. అసలు కథలోకి వెళ్లడం జరుగుతుంది. బంటుగా అల్లు అర్జున్, రాజుగా (సుశాంత్) కారెక్టర్లు ఎంట్రీ.. పూజా హెగ్డేను చూసి బంటు ప్రేమలో పడటం లాంటి సీన్లు వినోదాత్మకంగా మారిపోతాయి. నవదీప్, రాహుల్ రామకృష్ణ లాంటి సపోర్ట్‌తో సీన్లు మంచి కామెడీతో ముందుకెళ్తాయి. జయరాం కంపెనీలో ఓ సమస్య రావడంతో కథ సీరియస్ నోట్‌లోకి మారుతుంది. ఇక ఇంటర్వెల్ సమయానికి నర్సు కోమా నుంచి బయటకు వచ్చి బంటుకి అసలు విషయం చెప్పడం, ఆ తర్వాత పెంపుడు తండ్రి వాల్మీకిని బంటు నిలదీయడంతో తొలి భాగం ముగుస్తుంది.

  అల వైకుంఠపురంలో సెకండాఫ్ ఎనాలిసిస్

  అల వైకుంఠపురంలో సెకండాఫ్ ఎనాలిసిస్

  ఇక రెండో భాగమంత ఎమోషనల్ కంటెంట్‌తో నిండిపోవడంతో బంటు తన సొంత ఇంటిలోకి అడుగుపెట్టడం ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకొంటూ ముందుకెళ్లడంతో బంటు క్యారెక్టర్ మరింత బలంగా మారుతుంది. రెండో భాగంలో జయరాం, టబు మధ్య జరిగే ఎపిసోడ్‌ను బంటుతో డీల్ చేసిన విధానం సినిమాకు హైలెట్‌గా మారుతుంది. ఇక చివర్ల అల వైకుంఠపురానికి వారసుడనే విషయాన్ని రివీల్ చేసే అంశం మరింత భావోద్వేగంగా మారింది. ఇదంతా ఓ ఎత్తైయితే సినిమా పాటలపై అల్లు అర్జున్ చేసిన మాస్, కమర్షియల్ హంగామా సినిమాను మరో మెట్టు ఎక్కించిందని చెప్పవచ్చు. సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, రౌడీ అల్లుడు, రాజు పేద లాంటి సినిమాల ప్రభావంతో రొటీన్‌గా అనిపించే కథకు కొత్తగా ట్రీట్ మెంట్ ఇవ్వడంతో సినిమా ఫీల్‌గుడ్‌గా మారిపోయిందని చెప్పవచ్చు.

  త్రివిక్రమ్ మరోసారి పదునైన కలంతో

  త్రివిక్రమ్ మరోసారి పదునైన కలంతో

  అల వైకుంఠపురంలో హోల్ అండ్ సోల్‌గా డైరెక్టర్ మూవీగా మార్చడంలో దర్శకుడు త్రివిక్రమ్ మరోసారి తన కలానికి మరింత పదునుపెట్టాడు. తాను బలంగా నమ్మే ఇల్లు, ఇంటిలోని వ్యక్తులు, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ఈర్ష్యాద్వేషాలను కలగలిపి చక్కటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా మార్చాడు. కొన్ని సీన్లలో ఎమోషనత్ ఆకట్టుకొంటే.. మరికొన్ని సీన్లలో మాటలతో గారడి చేశాడు. ఇక అల్లు అర్జున్ ఎనర్జినీ పూర్తిగా యుటిలైజ్ చేసుకొని మాస్ అంశాలతో మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో సరైన విధంగా సినిమాలు రూపొందించడంలో తడబాటుకు గురవుతున్నాడని, తనపై పెరిగిన అంచనాలను అధిగమించలేకపోతున్నాడనే విమర్శలకు అలా వైకుంఠపురంలో మూవీతో చక్కటి సమాధానం చెప్పారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  గ్యాప్‌ను అధిగమించి.. అల్లు అర్జున్

  గ్యాప్‌ను అధిగమించి.. అల్లు అర్జున్

  ఇక బంటుగా అల్లు అర్జున్ ఇంచు గ్యాప్‌ లేకుండా దూరిపోయాడు. వచ్చిన గ్యాప్‌కు అనేక రెట్ల సంతృప్తిని ప్రేక్షకులకు అందించడంలో అల్లు అర్జున్ మరోసారి విశ్వరూపం చూపించాడు. మాస్, క్లాస్ అంశాలను జోడించి ప్రతీ సన్నివేశంలో చెలరేగిపోయాడు. గ్యాప్‌ వచ్చిందనే అసహనంపై కసి తీర్చుకొన్నాడా అనే రేంజ్‌లో ఫెర్ఫార్మెన్స్‌తో దున్నేశాడు. రొమాంటిక్ సీన్లలో పూజా హెగ్డేతో కలిసి ఇరుగదీశాడు. ఇక కామెడీలో కొత్త మార్కును రుచి చూపించాడు.

  పూజా హెగ్డే, నివేదా పేతురాజ్

  పూజా హెగ్డే, నివేదా పేతురాజ్

  అమూల్యగా పూజా హెగ్గే గ్లామర్ పంటను పండించింది. కొన్ని సన్నివేశాల్లో హాట్‌ హాట్‌గా తన అందాలను ప్రదర్శించింది. అంతేకాకుండా కీలక సన్నివేశాల్లో బాగా నటించింది. అల్లు అర్జున్‌తో కెమిస్ట్రీ తెరపైన పండించింది. తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది. ఇక నివేదా పేతురాజ్ కు పెద్దగా ప్రాముఖ్యత లేదనే చెప్పవచ్చు. తెర మీద గ్లామర్ కోసమే అలా కనిపించింది. దాంతో ఆమె పెద్దగా రాణించడానికి అవకాశ లేకపోయింది.

  టబు ఎమోషనల్‌గా

  టబు ఎమోషనల్‌గా

  ఇక టుబు ఓ ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. మలయాళ నటుడు జయరాంతో పోటాపోటిగా నటించింది. సెకండాఫ్‌లో ఆమె పలికించిన హావభావాలు హృదయాన్ని టచ్ చేశాయని చెప్పవచ్చు. అలాగే క్లైమాక్స్‌లో ఆమె చెప్పిన డైలాగ్స్, పలికించిన ఎమోషన్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. రోహిణి కూడా కొన్నిసీన్లలో ఆకట్టుకొన్నారు. ఇక మిగితా క్యారెక్టర్లో జయరాం, సచిన్ ఖేల్కర్, సముద్ర ఖని పాత్రలు సినిమాకు బలంగా మారాయి. సినిమా మొత్తంగా కామ్‌గా ఉన్న సుశాంత్ చివరి సీన్లలో ఆకట్టుకొన్నాడు. నవదీప్, రాహుల్ రామకృష్ణ, సునీల్ అతిథి పాత్రలకే పరిమితమయ్యారు.

  మ్యూజిక్‌తో తమన్ మ్యాజిక్

  మ్యూజిక్‌తో తమన్ మ్యాజిక్

  టెక్నికల్ విభాగంలో ప్రధానంగా మ్యూజిక్‌తో తమన్ పూర్తిస్థాయి మార్కులను కొట్టేశాడు. రిలీజ్‌కు బ్లాక్ బస్టర్ ఆడియోను అందించిన తమన్.. తెరపైన రీరికార్డింగ్‌తో కేక పెట్టించాడు. ఎమోషనల్ సీన్లలో బీజీఎం మరో లెవెల్ అనిచెప్పవచ్చు. ఇక తమన్ అందించిన పాటలకు పీఎస్ వినోద్ అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే ప్రతీ సన్నివేశాన్ని కన్నుల పండువగా రూపొందించారు.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  మానవ సంబంధాలు, కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, ఈర్ష్యద్వేషాలతోపాటు మాస్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేసిన చిత్రం అల వైకుంఠపురంలో. త్రివిక్రమ్‌ తన మాటలతో మరోసారి సూపర్ మ్యాజిక్ చేయడం, దానికి అల్లు అర్జున్ హై ఎనర్జీ తోడవ్వడంతో నిజమైన సంక్రాంతి కానుకగా మారిందని చెప్పవచ్చు. టుబు, సచిన్ ఖేల్కర్, సముద్రఖని లాంటి ప్రతిభావంతులైన నటులు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. పండగ సమయంలో మంచి విందు లాంటి భోజనం అల వైకుంఠపురంలో అని చెప్పవచ్చు. సంక్రాంతి రేసులో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉంది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  అల వైకుంఠపురంలో మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్,,పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. స్క్రిప్టుకు తగిన నటీనటుల ఎంపిక ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. పలు భాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సీనియర్ నటులను ఎంపిక చేసిన తీరు నిర్మాణ రంగంపై వారికి ఉన్న అభిరుచిని తెలియజేశాయి. సౌత్ ప్రేక్షకుల కోసం జయరాం, సముద్రఖని, శాటిలైట్ బిజినెస్ కోసం టబు, సచిన్ ఖేడ్కర్‌ను ఎంపిక చేసుకోవడం వారి బిజినెస్ విజన్‌ను తెలియజేసింది. ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ఫ్రేమ్‌ను ఈ రెండు బ్యానర్లు రిచ్‌గా తెరకెక్కించాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  మానవ సంబంధాలు, కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, ఈర్ష్యద్వేషాలతోపాటు మాస్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేసిన చిత్రం అల వైకుంఠపురంలో. త్రివిక్రమ్‌ తన మాటలతో మరోసారి సూపర్ మ్యాజిక్ చేయడం, దానికి అల్లు అర్జున్ హై ఎనర్జీ తోడవ్వడంతో నిజమైన సంక్రాంతి కానుకగా మారిందని చెప్పవచ్చు. టుబు, సచిన్ ఖేల్కర్, సముద్రఖని లాంటి ప్రతిభావంతులైన నటులు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. పండగ సమయంలో మంచి విందు లాంటి భోజనం అల వైకుంఠపురంలో అని చెప్పవచ్చు. సంక్రాంతి రేసులో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్

  త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు, మాటలు, స్రీన్ ప్లే

  పూజా హెగ్డే గ్లామర్

  టబు, జయరాం, సచిన్ యాక్టింగ్

  మ్యూజిక్, సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్స్

  రొటీన్ కథ

  నటీనటులు

  నటీనటులు

  నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, నివేతా పేతురాజ్ తదితరులు

  దర్శకత్వం : త్రివిక్రమ్

  నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్

  బ్యానర్ : హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్

  మ్యూజిక్ : తమన్

  సినిమాటోగ్రఫి : పీ.ఎస్. వినోద్

  ఎడిటింగ్ : నవీన్ నూలీ

  రిలీజ్ డేట్ : 2020-01-12

  Allu Arjun Emotional Speech || Ala Vaikuntapuramu Loo Movie Musical Concert
  రేటింగ్ :

  రేటింగ్ :

  మానవ సంబంధాలు, కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, ఈర్ష్యద్వేషాలతోపాటు మాస్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేసిన చిత్రం అల వైకుంఠపురంలో. త్రివిక్రమ్‌ తన మాటలతో మరోసారి సూపర్ మ్యాజిక్ చేయడం, దానికి అల్లు అర్జున్ హై ఎనర్జీ తోడవ్వడంతో నిజమైన సంక్రాంతి కానుకగా మారిందని చెప్పవచ్చు.

  3/5

  English summary
  Allu Arjun, Trivikram Srinivas hands combined together for Ala vaikunthapurramuloo. This movie released on January 12, 2020.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X