Alanaati Ramachandrudu Review: అలనాటి రామచంద్రుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: అలనాటి రామచంద్రుడు
నటీనటులు: కృష్ణవంశీ, మోక్ష, బ్రహ్మజీ, వెంకటేష్ కాకుమాను, సుధ, శివన్నారాయణ, ప్రమోదిని, హరీష్ కోయలగుండ్ల తదితరులు
రచన, దర్శకత్వం: చిలుకూరి ఆకాశ్ రెడ్డి
నిర్మాతలు: హైమావతి జే, జగదీశ్వర్ రెడ్డి, శ్రీరామ్ జే
మ్యూజిక్: శశాంక్ తిరుపతి
సినిమాటోగ్రఫి: ప్రేమ్ సాగర్
ఎడిటింగ్: జయ్ సీ శ్రీకర్
రిలీజ్ డేట్: 2024-08-02.
ధరణి (మోక్ష) చిన్నతనంలో ఆర్మీలో సైనికుడిగా సేవలు అందించే జవాన్ అయిన తండ్రి (బ్రహ్మజీ)ని కోల్పోతుంది. తండ్రి మరణంతో ఒంటరితనంతో బాధపడుతుంటుంది. కాలేజీలో మోక్షను చూసిన సిద్దూ (కృష్ణవంశీ) మౌనంగా ప్రేమిస్తుంటాడు. తనలోని ప్రేమను చెప్పలేకపోవడంతో ఓ కారణంగా సిద్దూని మోక్ష దూరం పెడుతుంది. అదే సమయంలో విక్రమ్ అనే తోటి స్టూడెంట్‌ను ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ ఆమెను మోసగించే ప్రయత్నం చేస్తాడు.

తండ్రితో మోక్షకు ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఏమిటి? తండ్రి మరణంతో ఎలాంటి బాధలో ఉండిపోయింది. మోక్షను తొలిచూపులోనే ప్రేమించిన సిద్దూ తన ప్రేమను ఎందుకు వ్యక్తీకరించలేకపోయాడు? విక్రమ్‌ను మోక్ష ఎందుకు ప్రేమించింది? మోక్షను విక్రమ్ ఎలా మోసం చేయాలనుకొన్నాడు? మోక్ష తన గతాన్ని ఎందుకు మరిచిపోయింది. గతం మరిచిపోయిన మోక్షకు సిద్దూ ఎలా అండగా ఉన్నాడు? మోక్ష ప్రేమను సిద్దూ గెలుచుకొన్నాడా? సిద్దూ ప్రేమను మోక్ష అర్ధం చేసుకొన్నదా? అనే ప్రశ్నలకు సమాధానమే అలనాటి రామచంద్రుడు సినిమా కథ.
సినిమా రంగంలో ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీలంటే లిప్‌లాక్స్, శృంగార సన్నివేశాలు, అర్ధపర్థం లేని ద్వందర్ధాలతో కూడిన డైలాగ్స్ లాంటి విషయాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటికి అతీతంగా క్లీన్ అండ్ ఫీల్ గుడ్ కంటెంట్‌తో మూవీని రూపొందించడంలో ఆకాశ్ రెడ్డి ప్రతిభకు పదునుపెట్టి.. హద్దులు మీరకుండా చక్కటి ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కంటెంట్‌ను, సినిమా లెంగ్త్‌ను నియంత్రించడంలో తడబాటుకు గురయ్యాడనే చెప్పాలి.
తొలి భాగంలో ముక్కోణపు ప్రేమకథలో భావోద్వేగాలు, ఎమోషన్స్‌ను చక్కగా చూపించారు. మోక్ష, బ్రహ్మజీ మధ్యన ఉండే సన్నివేశాలు కొంత ఎమోషనల్‌గా మారాయి. మోక్ష, కృష్ణవంశీ మధ్య సన్నివేశాలు ఆహ్లదకరంగా ఉన్నాయనిపించడానికి శశాంక్ తిరుపతి మ్యూజిక్ బాగా పనిచేసింది. ఏదిఏమైనప్పటికీ కమర్షియల్ హంగులకు పోకుండా దర్శకుడు సినిమాను నిజాయితీగా అందించే ప్రయత్నం బాగుంది.

మోక్ష, కృష్ణవంశీ ఇద్దరు కొత్తవాళ్లైనా ప్రేక్షకులను సీట్లో కూర్చొబెట్టేలా తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. చాలా ఈజ్‌తో నటించడమే కాకుండా ఎక్స్‌ప్రెషన్‌తో ప్రేమ కథను పండించే ప్రయత్నం చేశారు. విక్రమ్ పాత్ర చిన్నదైనప్పటికీ కథను మలుపుతిప్పే పాత్రగా కనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ అభి, కాలేజీ స్టూడెంట్‌గా వెంకటేష్ కాకుమాను కామెడీని పండించారు.
అలనాటి రామచంద్రుడు సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు అదనపు బలంగా మారింది. మనాలి ప్రాంతంలో చిత్రీకరించిన సీన్ల విషయంలో సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ సాగర్ తన మార్క్‌ను చాటుకొన్నారు. మూవీని ఫీల్‌గుడ్‌గా మార్చడంలో బీజీఎం చాలా సహకరించింది. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త కఠినంగా వ్యవహరించాల్సింది. హైమావతి జే, జగదీశ్వర్ రెడ్డి, శ్రీరామ్ జే పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ కొత్తదేమీ కాకున్నప్పటికీ.. కథనం, పాత్రల డిజైన్ బాగుంది. స్క్రీన్ ప్లే ఇంకా కొంత వేగంగా ఉంటే బెటర్ ఫీల్, ఫలితం ఉండేదనిపిస్తుంది. ట్రాయంగిల్ లవ్, స్వచ్ఛమైన ప్రేమ కథలను ఇష్టపడే వారు ఈ సినిమాపై ఈ వారాంతంలో ఓ లుక్ వేయొచ్చు.


Click it and Unblock the Notifications











