For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Alanti Sitralu Movie Review: నాలుగు విభిన్న జీవితాల కలయిక.. ఎలా ఉందంటే?

  |

  ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో పెద్ద సినిమాలు అనే లేకుండా ప్రేక్షకులు నచ్చిన అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే కరోనా కారణంగా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న తరుణంలో కొన్ని చిన్న సినిమాలు డిజిటల్ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. అలా రిలీజ్ అయిన తాజా చిత్రం అలాంటి సిత్రాలు, జే5 యాప్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ దగ్గర గతంలో రైటింగ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా పనిచేసిన సుప్రీత్ సి కృష్ణ దర్శకుడిగా మారి చేసిన సినిమా అలాంటి సిత్రాలు. ఈ సినిమా టీజర్ నుంచి ట్రైలర్ వరకు ఆసక్తికరంగా మారింది. మరి ఆ ఆసక్తి సినిమా చూస్తున్నంతసేపు కలుగుతుందా ? ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది సమీక్ష లో తెలుసుకుందాం.

  అలాంటి సిత్రాలు కథ ఏమిటంటే

  అలాంటి సిత్రాలు కథ ఏమిటంటే

  ఇది నలుగురు వేరువేరు వ్యక్తులు జీవితాలకు సంబంధించిన కథ.. అందులో యష్ (అజయ్ కథుర్వార్) బాక్సింగ్ చేసి ఎప్పటికైనా ఛాంపియన్గా నిలవాలనే కోరికతో తపన పడుతూ ఉంటాడు, క్రిస్టియన్ అయిన అతను ఒక బ్రాహ్మణ అమ్మాయి(యామిని (తన్వి ఆకాంక్ష)తో ప్రేమలో పడతాడు. ఒకప్పుడు మాఫియా లో పనిచేసిన దిలీప్ (ప్రవీణ్ యండమూరి) తన భార్య ప్రసవం జరిగినప్పుడు ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం మాఫియా దూరమవుతాడు, తనకు పుట్టిన కూతుర్ని ఎలా అయినా బాగా చదివించి కోవాలనే కోరిక తో తపన పడుతూ ఉంటాడు. కుటుంబం గడవడం కోసం వేశ్యగా మారిన పల్లవి (శ్వేత పరాశర్) జీవితం మరొకటి, ఎప్పటికైనా తనను మంచిగా చూసుకునే ఒక భర్త వస్తే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని కలలు కంటూ ఉంటుంది. మరొకరు రాగ్ (యష్ పూరి) 23 ఏళ్ల గిటార్ ప్లేయర్, గిటార్ వాయిస్తూ ఎప్పటికైనా మంచి సంగీత కళాకారుడు అనిపించుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటాడు. ఈ నలుగురి జీవితాలు ఎలా ముడిపడ్డాయి ఒకరితో ఒకరికి లింకేంటి? అనేది సినిమా కథ

  సినిమాలో ట్విస్టులు

  సినిమాలో ట్విస్టులు

  ఈ సినిమా మొదటి నుంచి కాస్త కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. ఇది నాలుగు జీవితాలకు సంబంధించిన కథ అని చెప్పడంతో ఎవరి లైఫ్ స్టైల్ ఏమిటి అనే పరిచయం చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. పల్లవితో రాగ్ కి ఎలా పరిచయం జరిగింది? రాగ్ తో యష్ కి ఎలా పరిచయం జరిగింది? అసలు దిలీప్ కి పల్లవి కి సంబంధం ఏంటి? దిలీప్ మళ్లీ మాఫియా వెంట ఎందుకు పడతాడు? ఈ నలుగురు జీవితాలలో ఒకరితో ఒకరికి ఎలా సంబంధం ఏర్పడింది అనేది ఇది ఈ మొత్తం చూస్తే గానీ అర్థం కాదు. ప్రపంచం చాలా చిన్నది అనే మాటను ఆదర్శంగా తీసుకున్న దర్శకుడు ఈ నాలుగు పాత్రలను చాలా దగ్గరగా లింకయ్యే విధంగా రాసుకున్నాడు.

  అలాంటి సిత్రాలు ఎలా ఉందంటే

  అలాంటి సిత్రాలు ఎలా ఉందంటే

  మతం ఏదైనా సరే ప్రేమించాక అతడిని ఎలాగైనా దక్కించుకోవాలని తాపత్రయపడే ఒక యువతి, ప్రేమ కంటే లక్ష్యం గొప్పది అని ఆ లక్ష్యం దిశగా వెళ్లే ఒక యువకుడు, తన సంగీతానికి ఇన్స్పిరేషన్ కావాలని వేశ్యలో ఇన్స్పిరేషన్ వెతుక్కుంటూ మరో యువకుడు, తన కూతుర్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎంతకైనా తెగించేద్దాం అని అనుకునే ఒక తండ్రి, ఎలా అయినా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్న ఒక వేశ్య కథల సమాహారమే ఈ అలాంటి సిత్రాలు. ఈ సినిమాతో దర్శకుడు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే పాత్రల పరిచయానికి ఎక్కువ సేపు తీసుకోవడంతో పాటు సినిమా సాగదీసిన భావన కలుగుతుంది. నలుగురు వ్యక్తులు తమ గమ్యాన్ని ఎలా తెలుసుకుంటారు ... వారు తమ కెరీర్‌ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎదురయ్యే పరిణామాలు ఏమిటి అనేది కథలో కీలకం. సినిమా కాస్త అడల్ట్ కంటెంట్‌ను కలిగి ఉంది. సినిమా ముందు నుంచీ గందరగోళ పరిచే విధంగానే ఉంటుంది. సినిమాలో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించ లేరు.

  నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే

  నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే

  ఈ సినిమాలో నటీనటులు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్లు కనిపించారు. ఈ మధ్యకాలంలో నెగిటివ్ పాత్రలు ఎక్కువగా వేస్తున్న ప్రవీణ్ యండమూరి, అలాగే గుణ పాత్రలో నటించిన దయానంద్ రెడ్డి, కోచ్ పాత్రలో నటించిన రవి తప్ప మిగతావన్నీ కొత్త ముఖాలు అని చెప్పవచ్చు. అజయ్ కుమార్ కథుర్వార్ (యష్), శ్వేతా పరాశర్ (పల్లవి), యష్ పూరి (రాగ్), పాత్రలలో నటించారు. అయితే ప్రతి ఒక్కరు కూడా బాగా ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు.. శ్వేతా పరాశర్ కూడా వేశ్య పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగతా మిగతా నటీనటులు కూడా బాగానే నటించి తమ పాత్రల పరిధి మేరకు ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్లారు.

  సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే

  సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే


  సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకునే విధంగా లేకపోయినా సంగీత దర్శకుడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునేలా సాగింది. అలాగే ఎక్కువగా నైట్ లొకేషన్ షూట్ ఉండడం వల్ల సినిమాటోగ్రఫీ కూడా మంచి స్కోప్ దొరికింది అని చెప్పవచ్చు. అలాగే ఓంకార్ సంతు అందించిన నేపథ్య సంగీతం సినిమాకి హైలైట్‌. ఇక దర్శకుడే స్వయంగా కథ రాసుకోవడంతో పాటు డైలాగులు కూడా అందించడంతో కాస్త ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు అని చెప్పొచ్చు. అందుకే డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

   ఫైనల్ గా అలాంటి సిత్రాలు విషయానికి వస్తే

  ఫైనల్ గా అలాంటి సిత్రాలు విషయానికి వస్తే

  ఒక నాలుగు విభిన్న మనస్తత్వాలు ఉన్న మనుషులు ఒకానొక చోట కలిసి మళ్ళీ ఎలా విడిపోతారు అనే కథాంశంతో రూపొందిన ఈ సినిమా కచ్చితంగా ఒకసారి చూడదగ్గ సినిమా అని చెప్పవచ్చు. ప్రేమ, శారీరక సుఖం లాంటి అనేక విషయాలు వెంట పడుతూ యువత ఇప్పుడు మనసు పాడు చేసుకుంటున్న తరుణంలో ఎలాంటి విషయాల మీద మనస్సు కేంద్రీకరించాలి ఎలాంటి విషయాలను లైట్ తీసుకోవాలి అనే విషయాన్ని ఈ సినిమా డిస్కస్ చేసింది. జి ఫైవ్ యాప్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా పిల్లలతో కలిసి చూడదగ్గ సినిమా కాదు కానీ ఒకసారి మాత్రం తప్పక చూడాల్సిన సినిమా.

  ప్రియురాలు నటీనటులు, సాంకేతిక నిపుణులు

  ప్రియురాలు నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: శ్వేత పరాషార్‌, ప్రవీణ్‌ యండమూరి, యష్‌ పూరి, తన్వీ ఆకాంక్ష, అజయ్‌ కతువార్‌ తదితరులు
  దర్శకత్వం: సుప్రీత్‌ సి కృష్ణ
  నిర్మాతలు: సుప్రీత్ సి కృష్ణ, లోక్కు శ్రీవారుణ్, డి రాహుల్ రెడ్డి
  సౌండ్ డిజైన్: అశ్వత్ శివ కుమార్
  సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయి కుమార్
  సంగీతం: సంత్ ఓంకార్
  ప్రొడక్షన్ డిజైన్: రోహన్ సింగ్
  కథ: సుప్రీత్‌ సి కృష్ణ
  ఓటీటీ రిలీజ్: జీ 5
  ఓటీటీ రిలీజ్ డేట్: 2021-09-24

  English summary
  Supreeth C Krishna, Omkar, Karthik Sai Kumar, Ajay Kumar Kathurvar, Yash, Shwetta Parashar, Pallavi, Yash Puri, Raag, Prawin Yendamuri, Dilip,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X