twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Alipiriki Allantha Dooramlo review డిఫరెంట్ కాన్సెప్ట్‌తో.. ఇంట్రెస్టింగ్‌గా రాబరీ డ్రామా!

    |

    నటీనటులు: రావణ్ నిట్టూరు, శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ, వేణుగోపాల్ తదితరులు
    దర్శకత్వం: ఆనంద్ జే
    నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పీ
    బ్యానర్: కాస్కేడ్ పిక్చర్స్
    డీవోపీ: డీజీకే
    సంగీతం: ఫణి కళ్యాణ్
    ఎడిటర్: సత్య గిడుతూరి
    పీఆర్వో: తేజస్వి సజ్జా
    రిలీజ్ డేట్: 2022-11-18

    Alipiriki Allantha Dooramlo

    తిరుపతికి చెందిన మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారధి (రావణ్ నిట్టూరు) ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటాడు. జీవనాధారం కోసం చిన్న చిన్న మోసాలకు పాల్పడుతుంటాడు. అంతేకాకుండా తిరుపతిలో వెంకటేశ్వరస్వామి పటాలు అమ్ముకొంటూ బతుకుతుంటాడు. ఈ క్రమంలో సంపన్న కుటుంబానికి చెందిన కీర్తి (శ్రీ నిఖిత)ను ప్రేమిస్తాడు. డబ్బు విషయంలో తమ స్థాయికి తగిన వాడు కాధని భావించిన కీర్తీ తండ్రి.. తన కూతురు జోలికి రావొద్దని వారధికి వార్నింగ్ ఇస్తాడు. దాంతో బాగా డబ్బు సంపాదించి కీర్తిని పెళ్లి చేసుకోవాలని అనుకొంటాడు. ఆ క్రమంలో తిరుపతిలో శ్రీవారి హుండిలో 2 కోట్ల ముడుపులు చెల్లించడానికి వచ్చిన యాత్రికుడి నుంచి డబ్బు కాజేయాలని ప్లాన్ చేస్తాడు.

    యాత్రికుడి నుంచి 2 కోట్ల రూపాయలు దొంగిలించాడా? యాత్రికుడు స్వామి వారికి ముడుపులు చెల్లించుకొన్నాడా? డబ్బు బాగా సంపాదించి కీర్తీ తండ్రిని మెప్పించాడా? కీర్తిని పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయ్యాడా? దోపిడి డ్రామాలో వారధికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ సమస్యల నుంచి వారధి ఎలా గట్టెక్కాడు అనే ప్రశ్నలకు సమాధానమే అలిపిరికి అల్లంత దూరంలో సినిమా కథ.

    ప్రేమికుడిగా, మోసాలకు పాల్పడే యువకుడిగా రావణ్ తన పాత్రకు న్యాయం చేశాడు. నటనపరంగా ఎలాంటి అనుభవం లేకున్నా.. తొలి చిత్రంలోనే ఫీల్‌గుడ్ పాత్రతో మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశాడు. శ్రీ నిఖిత కూడా గ్లామర్ పరంగా, ఫెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. హీరో తండ్రిగా వేణుగోపాల్, మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

    ప్రేమ, ఎమోషన్స్ బేస్‌గా దర్శకుడు ఆనంద్ జే రాసుకొన్న కథ బాగుంది. అయితే తెర మీద కథ చెప్పడంలో కాస్త తడబాటు కనిపించింది. అయితే కొత్త వారితో నటన రాబట్టుకొన్న విధానం దర్శకుడి ప్రతిభ ఎంటో తెలియజెప్పింది. ఫణి కల్యాణ్ మ్యూజిక్ బాగుంది. డీజీకే అందించిన సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్‌. తిరుపతి పరిసర ప్రాంతాలను అందంగా చూపించారు. కిట్టువిస్సాప్రగాడ సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ విషయంలో సత్య గిడుతూరి ఇంకాస్త పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

    ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. రమేష్ గొట్టు, రెడ్డి రాజేంద్ర అనుసరించిన ప్రమాణాలు సినిమాను రిచ్‌గా మార్చాయి. కొత్తవారైనా సినిమా క్వాలిటీగా తీసేందుకు ఖర్చుకు వెనుకాడ లేదనే విషయం తెర మీద కనిపిస్తుంది.

    డిఫరెంట్ కాన్సెప్ట్‌తో లవ్, ఎమోషన్స్, రాబరీ డ్రామాగా అలిపిరి అల్లంత దూరంలో తెరకెక్కింది. అయితే స్లో నేరేషన్, కథను సాగదీసినట్టు ఉండటం కొంత ప్రతికూలంగా ఉంది. అయితే దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు ఆ లోపాలను కప్పిపుచ్చేలా చేశాయి. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే.. డిఫినెట్‌గా మంచి థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది. లవ్, ఎమోషన్స్, డ్రామా అంశాలు ఉండే సినిమాలను నచ్చే వారికి అలిపిరి అల్లంత దూరంలో తప్పకుండా నచ్చుతుంది.

    English summary
    Alipiriki Allantha Dooramlo is released on November 18th. Anand J is director, Ramesh D, Rajendra P are the producer. Here is the Telugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X