twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నో రి‘యాక్షన్' ... ( రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    సాధారణంగా అల్లరి నరేష్ సినిమా అంటే ఫుల్ కామెడీ ఉంటుంది..నవ్వుకోవచ్చు...రిలాక్స్ అవ్వొచ్చు...అని ఫిక్స్ అయ్యి థియోటర్ కి వెళ్తూంటాం. దాంతో అతని సినిమాలు హిట్,ప్లాప్ లతో సంభంధం లేకుండా మినిమం ఆడేస్తూంటాయి. అయితే అప్పుడప్పుడూ మనఅంచనాలను తలక్రిందులు చేయాలని నరేష్ కు అనిపిస్తూంటుంది...అలాంటప్పుడు ఇలాంటి 'యాక్షన్' సినిమాలు వచ్చిపడుతూంటూయి. హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం The Hangover (2009) ఫ్రీమేక్ గా ఈ చిత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా తయారైంది. దశ,దిశలేని కథ,కథనంతో సినిమా దారి తప్పి నవ్వించలేక నవ్వుల పాలైంది.

    బావ(అల్లరి నరేష్), శివ(వైభవ్), పురుష్‌(రాజు సుందరం), అజయ్‌(కిక్ శ్యామ్) చిన్నప్పటి నుంచి క్లోజ్ ప్రెండ్స్. పెద్దయ్యాక ఎవరి లైఫ్ ల్లో వారు సెటిలయ్యాక అజయ్ కి పెళ్లి కుదురుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్యాచులర్ పార్టీ ని ఎంజాయ్ చేయటానికి ఈ ప్రెండ్స్ నలుగురూ గోవా కి టూర్ వెళ్తారు. అక్కడ ఆ రాత్రి ఫుల్ గా త్రాగి దొర్లిన తెల్లారి...ఆ హ్యాగోవర్ లో లేచి చూసుకుంటే అంతా అస్తవస్తంగా మారిపోయి ఉంటుంది. పెళ్లి కొడుకు అజయ్ మిస్సవుతాడు...తాము దిగిన రూమ్ లో ఓ బాబు, పులి ఉంటాయి.. శివ..పన్ను ఊడి ఉంటుంది...ఏమీ అర్దం కానీ వారు అసలు ఆ రాత్రకి ఏం జరిగింది...తమ ప్రెండ్ ఏమయ్యాడు వంటి విషయాలు తెలుసుకునే క్రమమే మిగతా సినిమా.

    హాలీవుడ్ లో సూపర్ హిట్టై ..మూడు సీక్వెల్స్ వచ్చిన హ్యాంగోవర్ సినిమా మొదట భాగం ప్రేరణగా ఈ సినిమా వచ్చింది. కానీ ఆ కథలో ఉన్న బ్యూటీని పట్టుకోలేకపోయారు. ముఖ్యంగా సెకండాఫ్ నుంచి హ్యాంగోవర్ ని పేస్ట్ చేయటం ప్రారంభించారు. దాంతో ఫస్టాఫ్ మొత్తం ఎక్కడో గతంలో విన్న,చూసిన డైలాగులతో నింపేసారు. పోనీ ఫస్టాఫ్ ని క్షమించేసి..సెకండాఫ్ ని ఎంజాయ్ చేద్దాం అంటే...ఆ ఎపిసోడ్స్ పండలేదు. దానికి తోడు వెరైటీ కోసం క్లైమాక్స్ తరహా ఫైట్ అయ్యిపోయాక...సీన్స్, పాట పెట్టారు. చివరి దాకా దర్శకుడు తన దైన శైలిలో క్రియేటివిటీని చూపిస్తూనే వచ్చాడు.

    నిజానికి ఇది హీరో సెంట్రల్ స్టోరీ కాదు. కానీ అల్లరి నరేష్ ని హీరోగా ఫిక్స్ అయ్యాక.. అతని చుట్టూ కథ ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేస్తారు... అయితే అలాంటిందేం లేదు..నలుగురులో నారాయణలా ఏదో అతని వంతు వచ్చినప్పుడు డైలాగులు చెప్పుకుంటూ పోవటం జరిగింది. . దానికి తోడు అల్లరి నరేష్ కి నేటివిటి అనుకున్నారేమో...ఓ లవ్ స్టోరీ పెట్టారు...కానీ ఆ లవ్ స్టోరీ ని కొనసాగించలేకపోయారు. హీరోకు లవ్ స్టోరీ పెట్టినప్పుడు...ఆ ప్రేమించిన అమ్మాయికోసమో, ప్రేమ కోసమో...మరొకటో...అన్నట్లు కొంత కథైనా ఉంటుంది. అలాంటిది హ్యాగోవర్ కథనంలో పడి..ఈ కథలో ఇమడ్చడం పెట్టడం మర్చిపోయారు.

    ఇక సీనియర్స్ ...బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ వంటివారు ఉన్నా సినిమాకు ఏమీ ప్లస్ కాలేదు. అలాగే దూకుడు సినిమాలో ఎమ్మెస్ నారాయణ పాత్ర బొక్కా వెంకట్రావు పాత్రను కొనసాగించే ప్రయత్నం చేసి నవ్వించాలని చూసారు. కానీ...రిపీట్ అయిన ఫీలింగ్ వచ్చిందే కానీ..పండలేదు. మహేష్ బాబు ని సైతం అప్పుడప్పుడూ (మహేష్ కొత్త చిత్రం 1 ట్రైలర్ ని సైతం) చూపటం,గబ్బర్ సింగ్ లో పాట వేసి విజిల్స్ వేయించటం వంటివి చేయగలిగారు కానీ...తమ దగ్గరున్న ఒరిజనల్ సినీ కంటెంట్ తో ఫన్ తేలేకపోయారు.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో..

    నో రి‘యాక్షన్' ... ( రివ్యూ)

    ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఈ సినిమా ని 3డిలో తీయాల్సినంత అవసరమేంటో అర్దం కాదు.

    నో రి‘యాక్షన్' ... ( రివ్యూ)

    పులి, చింపాంజీ కూడా కథలో కీలక పాత్ర పోషించాయి. కానీ...పెద్దగా ఒరిగిందేమీ లేదు.

    నో రి‘యాక్షన్' ... ( రివ్యూ)

    ఈ సినిమాకు సంగీతం పెద్ద మైనస్. రాఘవేంద్రరావు గారు తీసినట్లు ఓ పాటని తీసారు కానీ కిక్ లేదు. అలాగే 'స్వాతి ముత్యపు జల్లులలో...' పాట రీమిక్స్ కూడా ఎక్సపెక్టేషన్ కి తగినట్లు లేదు.

    నో రి‘యాక్షన్' ... ( రివ్యూ)

    హ్యాంగోవర్ సినిమా చూసిన వాళ్లకు ఈ సినిమా...ఇంత మంచి సినిమాని పాడు చేసారేంటా అనే ఫీలింగ్ కలుగుతుంది.

    నో రి‘యాక్షన్' ... ( రివ్యూ)

    ఫస్టాఫ్ లో అనుకున్న సీన్స్ మరీ సిల్లీగా ఉండటంతో అల్లరి నరేష్ వంటి కమిడియన్ ఉన్నా నవ్వించలేకపోయాడు.

    నో రి‘యాక్షన్' ... ( రివ్యూ)

    ఉన్నంతలో సినిమాలో కంటెంట్ కన్నా త్రీడీలో చూడటం బాగుంది. ఒబామాగా సునీల్‌ ఓకే. అయితే సునీల్ నేరేషన్ లో కథ చెప్పటం కూడా బోర్ తప్ప ఉపయోగం లేదు.

    నో రి‘యాక్షన్' ... ( రివ్యూ)

    హీరోయిన్స్...నీలమ్‌ ఉపాధ్యాయ, స్నేహా ఉల్లాల్‌, రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ లలో అంతా ఒకరికొకరు పోటీ అన్నట్లు నటన లో ఒక్క ఎక్సప్రెషన్ కూడా చూపకుండా జాగ్రత్తలు తీసుకుని చేసారు.

    నో రి‘యాక్షన్' ... ( రివ్యూ)

    సంస్థ: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.
    నటీనటులు: అల్లరి నరేష్‌, వైభవ్‌, కిక్‌ శ్యామ్‌, రాజు సుందరం, నీలమ్‌ ఉపాధ్యాయ, స్నేహా ఉల్లాల్‌, సునీల్‌, సుదీప్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు
    కెమెరా : సర్వేష్ మురారి,
    3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్,
    సంగీతం: బప్పా-బప్పీలహరి,
    ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
    సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర,
    మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల,
    పాటలు: భువనచంద్ర, రామజోగయ్య శాస్త్రి, సిరాశ్రీ, కేదార్‌నాథ్,
    సహనిర్మాత: కిషోర్ గరికిపాటి,
    నిర్మాత: సుంకర రామబ్రహ్మం,
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.
    విడుదల: 21,జూన్ 2013

    ఇప్పటికే హ్యాంగోవర్ చిత్రం చూసేసిన వారు...ఈ సినిమా చూడకుండా ఉంటే ఆ కామెడీ కిక్ హ్యాంగోవర్..హ్యాపీగా మనస్సులో భధ్రంగా ఉంటుంది. అలాగే అల్లరి నరేష్ సినిమాక కదా కామెడీ అనుకుని బయిలుదేరినా బుక్కైపోతారు.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Allari Naresh's Action 3D released today with negative talk.The story of the movie revolves around four friends and the incidents that occur involving them. Anil Sunkara who is the one of the co-producer of Dookudu movie is debuting as director through this movie. Bappi Lahari and his son Bappa Lahari scored music for this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X