twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాంతారావు కాలం నాటి కథే గానీ...('కత్తి కాంతారావు' రివ్యూ)

    By Srikanya
    |
    Katti Kantha Rao
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్: బిగ్ బి ప్రొడక్షన్స్
    తారాగణం: అల్లరి నరేష్, కామ్న జట్మలానీ, కోట శ్రీనివాస్ రావు, అలీ, వేణు మాధవ్,
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతి రావు, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, ఎల్బి శ్రీరామ్, కొండవలస, రఘుబాబు
    కెమెరా: అడుసుమిల్లి విజయకుమార్
    మాటలు: ప్రసాద్ వర్మ
    సంగీతం: మల్లికార్జున్
    ఎడిటర్: గౌతం రాజు
    నిర్మాత: ఎడుపుగంటి పూర్ణచంద్రరావు, ఈదర శ్రీనివాస్
    కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇవివి సత్యనారాయణ

    కామిడి చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన ఇవివి సత్యనారాయణ ఆయన కుమారుడు అయిన కామిడీ హీరో అల్లరి నరేష్ తో సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ అనేది సగటు ప్రేక్షకుడు నమ్మకం. అందుకు తగ్గట్లుగానే కత్తులు కాంతారవు..శక్తి వంచన లేకుండా ప్రతీ సీన్ లోనీ నవ్వులు అయితే కురిపించాడు కానీ, సెకెండాప్ సగం దాకా కథ లోకి, సమస్యలోకి రాకపోవటం విసుగెత్తిస్తుంది. కథకు సంభంధంలేని జోక్స్ వచ్చి నవ్విస్తూ, అప్పటికప్పుడు ఎంగేజ్ చేసినా టోటల్ గా ఏమిటి మనం చూస్తున్నాము అని ఆలోచనలో పడేస్తుంది. అయితే కేవంల కాస్సేపు కాలక్షేపం కోసం వెళ్ళే వారికి మాత్రం మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం నిరాసపరచదు.

    కట్టుకున్న మొగుళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చందే అత్తింటికి వెళ్ళమని భీష్మించుకుని కూర్చున్న ఇద్దరు అక్కలు, ఎలాంటివాళ్ళని కట్టుకోవాలో అని ఊహించుకుంటూ కాలం గడిపే ఇద్దరు చెల్లెళ్ళు, తల్లి, తండ్రులను సాకాల్సిన భాధ్యత కొడుకుదే అని ఫిక్సైన తండ్రి. వంటావార్పు, అప్పుడప్పుడూ సెంటిమెంట్ ఆభరణంగా పెట్టుకున్న అమ్మ, వీళ్ళందరి కోరికలు తీరుస్తానని కమిటై కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న హీరో...ఇదీ కత్తుల కాంతారావు సెటప్. కత్తుల బోనులలాంటి ఇంట్లో వారందరి కోరికలు తీర్చటానికి ఈ కత్తి కాంతారావు(అల్లరి నరేష్) కరెప్టు(లంచావతారం) అవుతాడు. అందిన కాడికి నొక్కేస్తూ...ఇంట్లో అందరినీ తృప్తిపరచటానికి ప్రయత్నిస్తూంటాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి కూడా చేసుకోకుండా కుటుంబం కొవ్విత్తిలా కరిగిపోతూంటాడు. దానికి కారణం కుటుంబం పట్ల కాంతారావుకి సెంటిమెంట్ ఎక్కువ అవటం కాదు. అతని తండ్రికి రాసిచ్చిన ఎగ్రిమెంట్. ఏముందా ఎగ్రిమెంట్ లో అంటే...చేతకాని ఆ తండ్రి తనకు చేతనైనంతలో తెలివిని ఉపయోగించి ఉద్యోగాన్ని కొడుక్కి వాలంటరిగా ఇచ్చి రిటైరవుతూ...ఆ ఉద్యోగం ఇచ్చినందుకు ఎగ్రిమెంట్ క్రింద కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని, అప్పటి వరకూ కాంతారావు పెళ్ళి గొడవ ఎత్తకూడదని కండిషన్ పెడతాడు. అందుకే అలా కాంతారావు అందర్ని మడతెడుతూంటాడు. అయితే ఇతని జీవితంలో ప్లాష్ బ్యాకే కాక మరో యాంగిల్ కూడా ఉంటుంది. ఎగ్రిమెంట్ ని ప్రక్కన పెట్టి రత్నం(కామ్న జట్మలాని)ని ఇంతకుముందే ప్రేమించి..పెళ్ళాడేసాడు. దాంతో ఈ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేస్తూ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేసాడు. తన వివాహాన్ని అఫీషియల్ గా ఎలా చేసుకున్నాడనేది మిగతా కథ.

    ఇవివి సూపర్ హిట్ అప్పులు అప్పారావుని దగ్గరపెట్టుకుని చేసినట్లుండే ఈ చిత్రం ఆయన రెగ్యులర్ స్టైల్ లోనే ఎక్కువ పంచ్ డైలాగులు, సెటర్స్(అవసరమున్నా లేకపోయినా), స్లాప్ స్టిక్ కామిడిపై ఆధారపడి చేసారు. అయితే జోక్స్ పేర్చటం మీద పెట్టిన శ్రద్ద కాస్త కథనం మీద కూడా పెట్టి ఉంటే మంచి విజయం సాధించేది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాప్ మొత్తం అక్కలు, చెల్లెళ్ళు వారి సమస్యలు తీర్చటానకి హీరో పడే పాట్లు, సెకండాఫ్ లో జరిగిపోయిన పెళ్ళిని మళ్లీ చేసుకోవటంలో పుట్టే కామిడీపై కాన్సర్టేట్ చేసారు. దాంతో ఈ చిత్రం ఒకే టిక్కెట్టుపై రెండు సినిమాలు అన్న ఫీల్ ఇస్తుంది. అలాగే హీరోయిన్ పాత్రని ఏదో వ్యభిచారి అన్నట్లు ట్రీట్ చేసి చివరలో ఓ చిన్న ట్విస్ట్ తో మీరంతా చూసి ఊహించుకుంది తప్పు అని రివిల్ చేయటం ఎంతవరకూ సబబు అనిపిస్తుంది. ఇక నటీనటుల్లో జీవా, కోట, ఆహుతి ప్రసాద్, అల్లరి నరేష్ బాగా చేసారు. ఇవివి ఎప్పటిలాగే పల్లె ఎపిసోడ్ తన దైన మార్కుతో కొంచెం బూతు కలిసినా బాగా చేసారు. ఇక పాటలు ఈ సినిమాలో అనవరసం అని సంగీత దర్శకుడు ఫిక్సై చేసినట్లు ఆసక్తి కలిగించవు. అలాగే మిగతా టెక్నికల్ డిపార్టమెంట్స్ ఇవివి దర్శకత్వంకు తగినట్లే ఉన్నాయి. నిర్మాణ విలువలు నామమాత్రంగా ఉన్నాయి.

    కధతో పనేముంది కాస్సేపు నవ్వుకుందాం అని ముందే నిర్ణయించుకుని ఈ సినిమాకెళ్ళితే ఈ సినిమా గ్యారెంటీగా నచ్చుతుంది. అంతేగాని సినిమా అంటే ఇలా ఉండాలి. అలా చెయ్యాలి అని ఆశించి చూస్తే మాత్రం ఈ చిత్రం అంత నరకం మరొకటి ఉండదు. భాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ చిత్రంగా నిలిచే ఈ చిత్రం అల్లరి నరేష్ కెరీర్ కు, ఇవివి దర్శకత్వ ప్రతిభ ప్రదర్శనకు కొద్దిగా కూడా ఉపయోగపడకపోయినా కొనుక్కున్న (టిక్కెట్టుని, సినిమాని) వారిని నిరాసపరచదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X