twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వద్దు బాబు ( 'లడ్డూబాబు' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.0/5
    ఏం కామెడీ సినిమా అంటే నవ్వించాలని రూలేమన్నా ఉందా అనుకున్నాడో ఏమో కానీ రవిబాబు తన తాజా చిత్రంతో దాన్ని బ్రేక్ చేయటానికి మాత్రం శతవిధాల ప్రయత్నించాడు. చిత్రమైన మేకప్, అల్లరి నరేష్ హీరో , హాస్య రస ప్రధానమైన సినిమా అన్న ప్రమోషన్ తో ఖచ్చితంగా కొబ్బరి బొండాం, భామనే సత్యభామనే, వినాయకుడు, షాలోహాల్ తరహా మరో మంచి కామెడీ చూడబోతున్నాం అనే అంచనాలు పెరిగిపోతాయి. అయితే దర్శకుడు అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు. కామెడీ తో చూడబోతున్నారు అని ప్రిపేర్ చేసి సెంటిమెంట్ తో ఓవర్ డోస్ కథ చెప్పే ప్రయత్నం చేసి, నీరసపరిచాడు. భారీ మేకప్ తో అల్లరి నరేష్ పడ్డ కష్టం అడుగడుగునా..గునగునా కనపడుతూనే ఉంటుంది కానీ...దాంతో ప్రత్యేకంగా సాధించిందేమీ కనపించదు. కేవలం లావుగా ఉన్న క్యారెక్టర్ పెట్టుకుంటే కామెడీ పుట్టదు...దాన్ని అడ్డం పెట్టుకుని నడిపే సన్నివేశాలతో ఫన్ జనరేట్ అవుతుందనే విషయం ఎందుకనో రవిబాబు మర్చిపోయాడు.

    Allari Naresh - Ravi Babu Laddu Babu review

    268 కిలోలు బరువుతో బాధపడుతున్న లడ్డుబాబు (అల్లరి నరేష్‌) కి ఎలాగైనా పెళ్లి చేయాలని అతని తండ్రి కిట్టయ్య(కోట శ్రీనివాసరావు) విశ్వ ప్రయత్నాలు చేస్తూంటాడు. ఎందుకంటే లడ్డుబాబుకి పెళ్లైతేనే కిట్టయ్య తన ఆస్తిని అమ్ముకోగలడు. ఇదిలా ఉంటే లడ్డూబాబుతో మూర్తి(అతులిత్) అనే పిల్లాడు స్నేహం చేయమని రోజూ అతన్ని విసిగిస్తూంటాడు. ఆ పిల్లాడి తల్లి(భూమిక). మరో ప్రక్క లడ్డూ బాబు తనకూ ఓ గాళ్‌ ఫ్రెండ్‌ ఉండాలని కలలు కని, మాయ(పూర్ణ)తో ప్రేమలో పడి వెంటబడతాడు. అంతేగాక తండ్రి తెచ్చే సంభంధాలు అన్నీ రిజక్ట్ చేస్తాడు. అయితే కొంతకాలానికి ఆమెకు తనలాంటి వాడిని పెళ్లి చేసుకోవటం ఇంటరస్ట్ లేదని తెలుసుకుంటాడు. దాంతో తన సమస్యకు పరిష్కారం ఒళ్లు తగ్గటమే అని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏమైంది. లడ్డూబాబు పెళ్లైందా..ప్రేమ ఫలించిందా...మూర్తి అనే పిల్లాడు ఎందుకు లడ్డూబాబు వెనక పడుతున్నాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    సాధారణంగా అల్లరి నరేష్ సినిమాలు...అల్లరి నరేష్ సినిమాలలాగే నవ్విస్తూ ఉండటాన్ని ఎక్సపెక్ట్ చేస్తాం..చేస్తున్నాం..అందుకే నరేష్ ఎప్పుడైనా సీరియస్ గా ట్రై చేస్తే దాన్ని కామెడీ గా చూసేసి బాగోలేదని ప్రక్కన పెట్టేస్తున్నారు. ఈ సినిమాకూ అదే పరిస్ధితి ఎదురైందనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు దర్శకుడు కామెడీ సినిమా అనుకున్నారో లేక ఫీల్ గుడ్ సినిమా అని భావించి తీసారా లేక మరేదన్నా జనర్ అని ఫిక్సై తీసారా అనే డౌట్ వచ్చేస్తుంది. అంతేగాక కథగా చాలా థిన్ లైన్ ఇది. కథనంగానా పెద్ద ఆసక్తి లేకుండా... క్లాసిక్ నేరేషన్ లో స్ట్రైయిట్ గానే నడిపారు. ట్విస్ట్ లు, టర్న్ లు సైతం చాలా ప్రెడిక్టుబుల్ గా ఉండేవే తీసుకున్నారు. దాంతో లడ్డూ బాబు పాత్ర తప్ప మరేది పెద్దగా వర్కవుట్ అవలేదనిపిస్తుంది.

    ఫిల్మ్ మేకర్ గా డైరక్షన్స్ స్కిల్స్ లో ఎప్పుడూ రవిబాబు ఫెయిలవలేదు. ఆయన ఎన్నుకనే కథా,కథనాలే ఆయన్ని చాలా సార్లు దెబ్బ తీస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ తరహా థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీలు ఆయన బాగా తీయగలుగుతున్నారు కానీ నేటివిటీతో వాటిని పండించలేకపోతున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఈ సినిమాని చావు దెబ్బ కొట్టిందనే చెప్పాలి. ఇంటర్వెల్ వరకూ ఓకే అనుకున్నా... సెకండాఫ్ చాలా దారుణంగా మారిపోయింది. సినిమాకి సరిపోయే కథ లేకపోవటంతో దాన్నే సాగతీస్తూ సీన్స్, స్లో చేస్తూ, డ్రాగ్ చేసుకూంటూ విసుగెత్తించే స్క్రీన్ ప్లే వేసుకుంటూ వెళ్లిపోయారు. దానికి తోడు అల్లరి నరేష్ ఉన్నాడు కదా అని అవసరం లేకపోయినా నవ్వించాలనే ప్రయత్నం చేసి విసిగించారు. సెకండాఫ్ లో కోట, నరేష్ మధ్య వచ్చే సీన్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి.

    Allari Naresh - Ravi Babu

    అయితే కొన్ని సీన్స్ లో రవిబాబు స్టైల్ లో ఉండే స్లాప్ స్టిక్ కామెడీ నవ్విస్తుంది. ఎప్పటిలాగే అందరి దగ్గరనుంచీ మంచి ఫెరఫార్మెన్స్ తీసుకున్నాడు. డైలాగ్స్ సైతం కొన్ని నవ్వించగలిగాయి. అయితే అక్కడక్కడా వచ్చే మెరుపులు రెండు గంటల సినిమాను నిలబెట్టలేవు కదా. అప్పటికే విసుగెత్తి పోయిన జనం నిజంగా మంచి జోక్ ఉన్నా స్ధితిని దాటి పోయారు. ఎడిటింగ్ పరంగానూ సెకండాప్ లో కొంత ట్రిమ్ చేస్తే బాగుండేదనిపించింది. సంగీతం సోసోగా ఉంది. డైలాగులు కూడా సిట్యువేషన్స్ బాగా లేకపోవటంతో సరైనవి పడలేదు...పండలేదు.

    ఏదైమైనా లడ్డుబాబు చిత్రం వద్దురా బాబు అనిపించేలా రవిబాబు తీర్చిదిద్దారు. కామెడీ సినిమా అని పొరబడి వెళ్ళితే దాని ఫలితం అనుభవిస్తారు. నరేష్ మేకప్ ఎలా చేసారు...భూమిక చాలా గ్యాప్ తర్వాత కనిపించింది...రవిబాబు సినిమాల్లో మంచి కెమెరా వర్క్ ఉంటుంది వంటి అంశాలు కోసం అయితే వెంటనే వెళ్లవచ్చు.

    చిత్రం: లడ్డుబాబు
    నటీనటులు: అల్లరి నరేష్‌, భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణబాబు, కొండవలస, ఎల్బీ శ్రీరాం, ఏవీయస్, గిరిబాబు, రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల తదితరులు
    సంగీతం: చక్రి,
    కెమెరా: సుధాకర్ రెడ్డి,
    స్క్రీన్ ప్లే: సత్యానంద్,
    మాటలు: నివాస్,
    పాటలు: భాస్కరభట్ల,
    ఆర్ట్: నారాయణరెడ్డి
    ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
    నిర్మాత: త్రిపురనేని రాజేంద్రప్రసాద్‌,
    రచన - దర్శకత్వం: రవిబాబు
    విడుదల: 18, ఏప్రియల్, 2014 (శుక్రవారం)

    English summary
    Allari Naresh’s ‘Laddu Babu’ directed by Ravi Babu released today with negitive talk. Actress Poorna is playing lead role in the movie and actress Bhumika is playing special role in the film. Produced by Tripuraneni Rajendra under the banner Maharadhi films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X