Ugram Review: అల్లరోడి నట ఉగ్రరూపం.. హైలెట్ యాక్షన్ సీన్స్.. నరేష్ వన్ మ్యాన్ షో: 'ఉగ్రం' ఎలా ఉందంటే?
రేటింగ్: 2.75 /5
టైటిల్: ఉగ్రం
నటీనటులు: అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శతృ, శరత్ లోహితశ్వ తదితరులు
ప్రొడక్షన్ బ్యానర్: షైన్ స్క్రీన్ బ్యానర్
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
కథ: తూమ్ వెంకట్
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జే
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల
విడుదల తేది: నవంబర్ 18, 2022
కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ప్రత్యేకమైన పాపులారిటీ సంపాందించుకున్నాడు అల్లరి నరేష్. అయితే ఆయన ఇటీవల కాలంలో ఎక్కువగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ఆకట్టుకున్నారు. అందులో భాగంగానే నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు తాజాగా నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరోసారి అల్లరి నరేష్ నటించిన చిత్రమే ఉగ్రం (Ugram 2023). ఇంతకు ముందు కితకితలు మూవీలో కామెడీ పోలీసుగా చేసిన అల్లరి నరేష్ తాజాగా పవర్ ఫుల్ పోలీసు పాత్రలో నటించిన ఉగ్రం మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ: శివ కుమార్ (అల్లరి నరేష్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నేరస్థులను ఏమాత్రం విడిచిపెట్టని శివ కుమార్ తాను ప్రేమించిన అమ్మాయి అపర్ణ (మిర్నా మీనన్)ను పెళ్లి చేసుకుంటాడు. వారిద్దరికి పాప లక్కీ పుడుతుంది. అటు డ్యూటీ, ఇటు ఫ్యామిలీ మ్యానేజ్ చేసుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ కేసు విషయంలో ప్రత్యర్థుల కారణంగా భార్యా బిడ్డలను వాళ్ల తండ్రి (శరత్ లోహితశ్వ) ఇంట్లో డ్రాప్ చేసేందుకు కారులో వెళ్తుంటారు. అప్పుడే వీరికి యాక్సిడెంట్ అవుతుంది.

ట్విస్టులు: కారు యాక్సిడెంట్ లో నుంచి బయటపడిన శివ కుమార్ కు లేనిది ఉన్నట్లు ఊహించుకుంటాడు. మరోవైపు అతని భార్యా బిడ్డలు కూడా మిస్ అవుతారు. ఈలోపు నలుగురి చంపిన కారణంగా శివ కుమార్ ను హౌజ్ అరెస్ట్ చేస్తారు. ఇలాంటి పరిస్థితులో తన భార్యా బిడ్డలను శివ కుమార్ కాపాడుకున్నాడా? లేదా? వాళ్లతోపాటు సిటీలో వయసుతో సంబంధం లేకుండా మిస్ అవుతున్నవాళ్లకు కారణం ఎవరు? శివ కుమార్ ను హౌజ్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? తను ప్రేమించిన అమ్మాయితో తండ్రితో శివ కుమార్ కు ఉన్న వైరం ఏంటీ? అనే తదితర అంశాలను వెండితెరపైనే చూడాలి.
విశ్లేషణ: నాంది తర్వాత విజయ్ కనకమేడల-అల్లరి నరేష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఉగ్రంపై కాస్తా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను పూర్తి స్థాయిలో కాకుండా అబౌవ్ యావరేజ్ రీచ్ అయ్యారు. కారు యాక్సిడెంట్ తో సినిమాను ప్రారంభించి మంచి ఇంటెన్స్ క్రియేట్ చేశారు. తర్వాత యాక్సిడెంట్ కు కారణాలు, శివ కుమార్ మానసిక పరిస్థితి తెలుపుతూ కథలోకి వెళ్లారు.

ఫస్టాఫ్ అలా..: ఫస్టాఫ్ అంతా శివ కుమార్ క్యారెక్టరైజేషన్, లవ్, ఫ్యామిలీ బాండింగ్, రొమాంటిక్ సన్నివేశాలతో నిండిపోయి ఉంటుంది. అల్లరి నరేష్ పోలీసుగా ఎంట్రీ ఇచ్చే సీన్ ఆకట్టుకుంటుంది. దీని తర్వాత అక్కడక్కడ తప్పితే చాలా వరకు బోరింగ్ గా అనిపిస్తుంది. ఊహించే స్థాయిలో సన్నివేశాలు ఉండటం మైనస్ గా మారింది. ఇంటర్వెల్ పర్వాలేదనిపిస్తుంది. దీనికి ముందు కిడ్నాప్ కు సంబంధించి హింట్ సీన్స్ ను కాస్తా అటు ఇటుగా మార్చితే ఇంటర్వెల్ ఇంకాస్తా బాగా పేలేది.
సెకండాఫ్ ఎలా ఉందంటే?: సెకండాఫ్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. అనవసరం అనిపించే పాట తప్పితే మిగతాదంతా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హిజ్రాలతో, క్లైమాక్స్ లో అల్లరోడు చేసే ఫైట్ విజిల్స్ కొట్టించేలా ఉండటమే కాదు సినిమాకే ప్రధాన హైలెట్ గా నిలిచాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్ కు వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సన్నివేశాల్లో అల్లరి నరేష్ ఉగ్రరూపం చూడొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని షాట్స్ చూపించిన విధానం బాగుంది. అనవసరపు సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండేది.

కనెక్ట్ కానీ ఎమోషన్: అయితే కథలో డెప్త్ చూపించేందుకు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేందుకు ఆ సన్నివేశాలు ఉంచినట్లు అనిపించాయి. కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకుంటే స్లో నెరేషన్ బాధ తప్పేది. సంగీతం పర్వాలేదు. కొన్ని సీన్లలో బీజీఎమ్, అల్లరి నరేష్ ఎలివేషన్ సీన్స్ అదిరిపోయాయి. కథ పరంగా దర్శకుడు విజయ్ కనకమేడల న్యాయం చేశాడనే చెప్పొచ్చు. మిగతా సాంకేతిక వర్గం, నిర్మాణ విలువలు అంతా బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే?:పవర్ ఫుల్ పోలీసోడుగా అల్లరోడి యాక్టింగ్ అదుర్స్. యాక్షన్ సీక్వెన్స్ లో ఇరగదీశాడు. నరేష్ లో కామెడీయే కాదు యాక్షన్ హీరో కూడా ఉన్నాడు అనేలా పర్ఫామెన్స్ ఇచ్చి ఉగ్రరూపం చూపించాడు. అయితే కొన్ని సీరియస్ సన్నివేశాల్లో ఒక్క డైలాగ్ డెలివరీలోనే సమ్ థింగ్ ఇంటెన్సిటీ మిస్ అయినట్లుగా అనిపించింది. హీరోయిన్ మిర్నా పర్వాలేదు. తన పాత్ర పరిధి వరకు బాగానే చేసింది. ఇంద్రజతోపాటు మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా సెట్ అయి ఓకే అనిపించారు.

ఫైనల్ గా చెప్పాలంటే?:ఇక నుంచి అల్లరి నరేష్ కాదు.. యాంగ్రీ యంగ్ మ్యాన్ నరేష్ అనిపించేలా తన నట ఉగ్ర రూపాన్ని చూపించాడు నరేష్. సినిమా అంతా తానే కనిపించి వన్ మ్యాన్ షో చేశాడు. స్లో నెరేషన్ ఓపిక పడితే నరేష్ నట విశ్వరూపం చూడొచ్చు. యాక్షన్ ప్రియులకు ఫుల్ ట్రీట్ అయిన ఈ అల్లరోడి ఉగ్రం సినిమాను చూడొచ్చు.


Click it and Unblock the Notifications











