twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సరికొత్త 'అల్లరి'

    By Staff
    |

    Allari
    - జలపతి
    చిత్రం: అల్లరి
    నటీనటులు: నరేష్‌, శ్వేత, నీలాంబరి
    సంగీతం: పౌల్‌.జె
    ఫోటోగ్రఫీ: లోక్‌ నాథ్‌
    మాటలు: నివాస్‌
    నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.టి

    కొత్త ప్రయోగాలు చేయడం తెలుగులో తక్కువ. ప్రముఖ నటుడు చలపతి రావు కుమారుడు టి.రవిబాబు ఒక అడుగు ముందుకేసి..సినిమాను కొత్తగా ప్రెజెంట్‌ చేయడంలో తెలుగు సంబంధించినంతవరకు ఓ పెద్ద ప్రయోగమే చేశాడు. అల్లరి అనే ఈ చిత్రం ఏ రకంగా చూసినా మంచి ప్రయోగం. తప్పులు బోల్డన్ని ఉన్నా, ఒక కొత్త రకమైన సినిమాను రవిబాబు అల్లరి ద్వారా అందించాడు. దిల్‌ చాహతా హై మాదిరిగా అల్లరి కొత్త తరహాలో ఉంది. అయితే, ఆ సినిమా స్థాయిలో ఈ చిత్రం లేదు.

    తెలుగుకు సంబంధించినంతవరకు...మోడ్రన్‌ టెక్నిక్స్‌ తో తీసిన ట్రెండీ సినిమా ఇది అని చెప్పాలి. అల్లరి పూర్తిగా డైరక్టర్‌ రవిబాబు, ఫోటోగ్రాఫర్‌ లోక్‌ నాథ్‌ ల చిత్రం. టిల్ట్‌ అప్‌, టిల్డ్‌ డౌన్‌ యాంగిల్స్‌ తో, ఓవర్‌ ది కెమెరా, త్రీషాట్‌...షాట్స్‌ తో చిత్రాన్ని పూర్తిగా ట్రెండీ లుక్‌ తీసుకొచ్చారు. కథ చాలా సింపుల్‌. అందుకని పూర్తిగా కథనాన్ని కొత్త పద్దతిలో చెప్పేందుకు దర్శకుడు రవిబాబు ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌ లను ఆయుధంగా వాడుకున్నాడు.

    నరేష్‌ టీనేజ్‌ అబ్బాయి. డిగ్రీలోకి ఎంటర్‌ అవుతాడు. ఆ ఏజ్‌ లో కలిగే 'సెక్స్‌ వల్‌ ఎవెర్‌ నెస్‌' వల్ల అమ్మాయిలతో ప్రేమలో పడుతుంటాడు. కానీ తన క్లోజ్‌ ఫ్రెండ్‌ శ్వేతను మాత్రం ప్రేమించడు. ఎదిరింట్లో దిగిన నీలాంబరిని చూడగానే '. 'పడిపోతాడు'. ఆ అమ్మాయిని ప్రేమలో పడేసేందుకు, శ్వేత సాయం తీసుకుంటాడు.

    శ్వేత నరేష్‌ ను ప్రేమిస్తున్నా, బయటికి చెప్పకుండా, ఫ్రెండ్‌ షిప్‌ కోసం...వీడికి సాయం చేస్తుంది. శ్వేత నరేష్‌ ను సెక్స్‌ కోసం ఉపయోగించుకోవాలనుకుంటుంది. వీడేమో..తీరా సమయానికి 'నీరుగారి పోయి'...ఏది మంచో, ఏదీ చెడో తెలుసుకుంటాడు. కథ సింపుల్‌ కానీ, కథనం అంతా ఆద్యంతం పన్నీగా సాగుతుంది. హాయిగా చూడదగ్గ చిత్రం ఇది.

    సాధారణంగా ఇప్పుడు అందరూ 70 ఎం.ఎం విడ్త్‌ (సినిమా స్కోప్‌)లోనే సినిమా తీస్తున్నారు. డాక్యుమెంటరీ స్టైల్‌ లో తీయాలనుకున్నప్పుడు లేదా ఎమోషనల్‌ హ్యూమన్‌ స్టోరీస్‌ ను చక్కగా ప్రోజెక్ట్‌ చేయాలనుకున్నప్పుడే 35 ఎం.ఎం. వాడుతున్నారు. కానీ రవిబాబు అల్లరిగా సాగే చిత్రానికి 35ఎం.ఎం. ఫార్మాట్‌ ఎన్నుకున్నాడు. ఇది వినూత్నంగా ఉంటుంది అనుకున్నాడేమోగానీ, అంత అప్పీలింగ్‌ గా లేదు. అయితే, సినిమాలో ఎక్కువగా ఓవర్‌ ది కెమెరా, టిల్ట్‌ షాట్స్‌ కాబట్టి...35 ఎం.ఎం విడ్త్‌ లోనే సినిమాలో దృశ్యాలు ఎలివేట్‌ అయ్యాయి.

    ఇక పౌల్‌.జె సంగీతం కూడా చక్కగా ఉంది. అన్ని పాటలు బాగున్నాయి. ఆర్పీ తరహా సంగీతానికి భిన్నంగా ఉండడం పెద్ద రిలీఫ్‌. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా చాలా బాగుంది.

    కొత్త హీరో నరేష్‌(ఇవివి సత్యనారయణ రెండో కుమారుడు) టీనేజ్‌ పాత్రకు చక్కగా కుదిరాడు. నటన ఫర్వాలేదు. హీరోయిన్లద్దరూ బాగా చేశారు. నివాస్‌ డైలాగ్స్‌ కామెడీగా ఉన్నాయి.

    కానీ ఈ చిత్రంలోనూ బోల్డన్ని లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా...హీరో డిగ్రీకి వచ్చాక నాన్న నాకు ఫ్యాంట్స్‌ కావాలని అనడం మరీ అతిగా అనిపిస్తుంది. ట్రెండీలో పాతకాలపు సీన్స్‌ కూడా చాలా ఉన్నాయి. అవే ఈ సినిమాలో ప్రధానలోపాలు. మొత్తమ్మీద రవిబాబు చేసిన ప్రయోగం బాగుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X