twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మసాలా రాముడు

    By Staff
    |

    Allari Ramudu
    - జలపతి
    చిత్రం: అల్లరి రాముడు
    నటీనటులు: ఎన్టీఆర్‌, ఆర్తి అగర్వాల్‌, గజాల, నగ్మా, కె.విశ్వనాథ్‌, నరేష్‌
    సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
    నిర్మాత: చంటి అడ్డాల
    దర్శకత్వం: బి.గోపాల్‌

    ఆది చిత్రం తర్వాత ఎన్నో అంచనాలతో విడుదలైన అల్లరి రాముడు పూర్తిగా నిరాశపర్చింది. గుండమ్మ కథ మాదిరిగా వినోదాత్మకంగా తీద్దామనుకొని మొదలుపెట్టి..బి.గోపాల్‌ మార్క్‌ కక్షలు, ప్రతీకారాలతో సినిమా ముగించడంతో ఇది 'అల్లరి రాముడు' చిత్రమో..'అగ్గి రాముడు' చిత్రమో ప్రేక్షకుడికి అర్థం కాదు. ఎన్టీఆర్‌ చేత యాస పెట్టించాలని ప్రయత్నించినా అతను సరిగా చేయలేకపోవడంతో..అది తొలి సీన్స్‌ కే పరిమితం అయింది. తొలి భాగమంతా...ఇవివి సత్యనారాయణ మార్క్‌ 'అత్త-అల్లుళ్ళ' బూతు కామెడీతో లాగిద్దామనుకున్నారు. కానీ జూనియర్‌ ఎన్టీఆర్‌ 'వినోదం' అందించడంలో విఫలమవడంతో..దర్శకుడు బి.గోపాల్‌ మనసు మార్చుకొని అతన్ని 'పిడికిలి రాముడు'గానే ప్రొజెక్ట్‌ చేద్దామని అనుకొని ఉంటాడు. ఈ కన్ఫ్యూజన్‌ లో సినిమా ఎటూ కాకుండా..నిస్తేజంగా తయారైంది. అతి సాధారణ మాల్‌ మాసాలా చిత్రం ఇది.

    అదీ కాకుండా...ఈ చిత్రంలో కొత్త పాయింట్‌ అనేది లేదు. కొత్త సీన్స్‌ లేవు. డైలాగ్స్‌ కూడా మరీ ముతక సంభాషణలే. అయితే...భారీ తారాగణం వల్ల సినిమా ఎక్కువగా బోర్‌ కొట్టదు. అందరూ దాదాపు బాగా నటించే వారే కావడంతో సినిమా కథలో 'పట్టు' లేకపోయినా ప్రేక్షకులు విసిగిపోరు. ఈ చిత్రంలో అందరికన్నా ఆకట్టుకొంది మాత్రం నగ్మానే. అందమైన, అహంకారి అత్త పాత్రలో నగ్మా చాలా బాగా చేసింది. హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌ కన్నా నగ్మానే అందంగా, స్లిమ్‌ గా ఉండడం విశేషం. ఆర్తి హీరో ఎన్టీఆర్‌ తో పోటీపడింది - లావులో. ఈ సినిమాలో వీరిద్దరూ మరీ లావుగా కనిపించారు.

    కథ ఏమిటంటే - నగ్మా, నరేష్‌ లకు ముద్దుల కూతురు ఆర్తి అగర్వాల్‌. వీళ్ళింట్లో పనివాడుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ చేరుతాడు. పనివాడైనా, మంచివాడనుకొని ఆర్తి ఎన్టీఆర్‌ ను ప్రేమిస్తుంది. వీరి ప్రేమను నగ్మా ఒప్పుకోదు. ఆర్తిని ఓ మంత్రి కొడుకు ఇవ్వాలని అనుకుంటుంది. హీరో అత్తకు ఛాలెంజ్‌ చేసి హీరోయిన్‌ వాళ్ళ ఊరికి తీసుకెళ్తాడు. మరి మన హీరో ఎవరో కాదు...ఆర్తికి బావ అవుతాడు. అదీ ఫ్లాష్‌ బ్యాక్‌. చివరికి అత్త అల్లుడిని అంగీకరించి..ఎలా పెళ్ళి చేస్తుందనేది కథ.

    ఏమిటీ? ఈ సినిమా ఎన్నో సార్లు చూసినట్లు అనిపిస్తుందా. అదేమరి, ఈ సినిమా. కథలో కొత్తదనం లేదు, కథనంలోనూ లేదు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం...కూడా పెద్దగా సూటవలేదు. రెండువేల రెండువరకు చూడలేదు ఇంతసరకు.... అనే పాట ఒక్కటి చూడడానికి బాగుంది. మిగతా పాటలన్ని పక్కా బూతు పాటలే. ఎన్టీఆర్‌ నటన చాలా ఇంప్రూవ్‌ అయింది. నగ్మా అందరికన్నా బెస్ట్‌. కె.విశ్వనాథ్‌ బాగా చేశాడని చెప్పలేం ఎందుకంటే..ఇప్పుడు ఆయన ఏ సినిమాలోనైనా ఒకే తరహా పాత్ర...ఒకే విధమైన నటన. మొత్తానికి ఇది పక్కా మాస్‌ మసాలా చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X