Allu Arjun's Review on Peddi: పెద్దిపై అల్లు అర్జున్ రివ్యూ.

Allu Arjun Review on Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ కథానాయికగా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పెద్ది'. 'ఆర్ఆర్ఆర్'తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన భారీ సినిమా కావడంతో 'పెద్ది'పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన అందుకుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.248.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంటుంది. నేటీతో రూ.250 కోట్ల మార్క్‌ను అందుకోబోతుంది. ఇలా భారీ విజయాన్ని అందుకున్న పెద్ది సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న వేళ, ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా చూసిన అనంతరం అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. "నిన్న రాత్రి 'పెద్ది' సినిమా చూశాను. నా ప్రియమైన రామ్ చరణ్ అద్భుతమైన నటనతో మెప్పించాడు. రఫ్ అండ్ రా పెర్ఫార్మెన్స్, అసాధారణమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో ప్రతి అంశంలోనూ తన బెస్ట్ ఇచ్చాడు. అతను అందుకుంటున్న ప్రశంసలకు పూర్తిగా అర్హుడు. నా బావ విజయాన్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను" అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

Allu Arjun Review on Ram Charan s Peddi  Calls His Performance Raw  Powerful and Brilliant

అంతేకాకుండా సీనియర్ నటుడు జగపతి బాబు నటనను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. "జగపతి బాబు గారి నటన అద్భుతంగా ఉంది. అలాగే సినిమాలో నటించిన ప్రతి కళాకారుడు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు" అని కొనియాడారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌కు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సినిమా సాంకేతిక నిపుణులు, నిర్మాతలు చేసిన కృషిని కూడా అల్లు అర్జున్ ప్రశంసించారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సానాను ఉద్దేశించి, "ప్రతి నటుడి నుంచి అత్యుత్తమ నటనను రాబట్టడంతో పాటు, రామ్ చరణ్‌ను మరింత ఉన్నత స్థాయిలో చూపించినందుకు బుచ్చిబాబు సానా గారికి నా అభినందనలు" అని పేర్కొన్నారు.

చివరగా 'పెద్ది' చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా మరింత పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. మూవీ మేకర్స్ ప్రకారం 'పెద్ది' కేవలం ఐదు రోజుల్లోనే రూ.315 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు సాధించి రామ్ చరణ్ సోలో కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ బహిరంగంగా చిత్రబృందాన్ని అభినందించడం మెగా అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. సోషల్ మీడియాలో బన్నీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారగా, అభిమానులు ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్-వరల్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాకా' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X