Pushpa Critics Review: పుష్పరాజ్ ఊరమాస్.. సమంత ఐటెమ్ సాంగ్ సూపర్ హాట్
అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకొన్న అల్లు అర్జున్.. అలాగే రంగస్థలం సినిమాతో హిట్ అందుకొన్న దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వస్తున్నది. అయితే ఈ సినిమా గురించి ప్రముఖ క్రిటిక్ ఉమేర్ సంధూ రివ్యూ మీ కోసం..

పుష్ప మూవీ కథ ఏమిటంటే..
పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో గంధం చెక్కల కూలీగా, ట్రాన్స్‌పోర్టర్, స్మగ్లర్ జీవితానికి సంబంధించిన కథ. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించారు. పుష్ప ప్రియురాలిగా శ్రీవల్లిగా రష్మిక నటించారు. ఇంకా ఫాహెద్ ఫాజిల్, సునీల్ లాంటి ప్రముఖ నటులు ఇందులో భాగం పంచుకొన్నారు.

దుబాయ్ క్రిటిక్ ఉమేర్ సంధూ రివ్యూ
అయితే దుబాయ్ సెన్సార్ బోర్డులో సభ్యుుడు, సినీ క్రిటిక్ ఉమేర్ సంధూ పుష్ప గురించి ముందే తన రివ్యూను వెల్లడించారు. గతంలో కూడా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన భారీ బడ్జెట్ చిత్రాలకు, అలాగే టాప్ హీరోల సినిమాలకు రిలీజ్‌కు ముందే తన రివ్యూను, కామెంట్స్‌ను, తన రేటింగ్‌ను ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా ఉమేర్ సంధూ ఇచ్చిన రివ్యూ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో సంతోషంలో మునిగేలా చేస్తున్నది.

బన్నీ యాక్టింగ్ మైంబ్ బ్లోయింగ్
ఉమేర్ సంధూ ఇచ్చిన రివ్యూ ప్రకారం.. పుష్ప సినిమాకు వెన్నుమక అల్లు అర్జున్. ఆయన నటన మైండ్ బ్లోయింగ్. పుష్పగా బన్నీ పెర్పార్మెన్స్ హైలెట్. ఇక రష్మిక అందం, అభినయం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. గ్లామర్‌తో రష్మిక ఆకట్టుకొన్నది అని తన రివ్యూలో తెలిపారు.

స్టంట్స్, యాక్షన్ ఊరమాస్
పుష్ప కథ, కథనాల విషయానికి వస్తే.. స్టోరి నడిచే విధానం చాలా వేగంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే అద్బుతంగా ఉంది. యాక్షన్, స్టంట్స్ ఊరమాస్. కథ, కథనాలు ఊహించని రీతిలో ఉంటాయి అని ఉమేర్ సంధూ తన రివ్యూలో హైలెట్స్‌గా పేర్కొన్నారు.

సమంత ఐటమ్ సాంగ్ గురించి
ఇక పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే సమంత పాట గురించి ఉమేర్ సంధూ తెలియజేస్తూ.. హాట్ ఐటెమ్ సాంగ్. ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. మీరు వెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. శీతాకాలంలో పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ అంటూ తన రివ్యూను ముగించారు.


Click it and Unblock the Notifications











