బ్రెయిన్ స్విచ్ఛాఫ్ చేసి.. సినిమా చూడండి.. జాతి రత్నాలపై అల్లు అర్జున్ రివ్యూ

మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో రిలీజైన శ్రీకారం, జాతి రత్నాలు చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌తో ముందుకెళ్తున్నాయి. శ్రీకారం చిత్రం ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కగా, కామెడీ ప్రధానంగా జాతి రత్నాలు సినిమా తెరకెక్కింది. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి. స్టైలిష్ స్టార్ ఏమని ట్వీట్ చేశారంటే..

 Allu Arjuns twitter review on Navin Polishetys Jathi Ratnalu movie

 నవీన్ పొలిశెట్టి పెర్ఫార్మెన్స్

నవీన్ పొలిశెట్టి పెర్ఫార్మెన్స్

గత రాత్రి (మార్చి 11) జాతి రత్నాలు సినిమా చూశాను. సినిమా యూనిట్‌కు కంగ్రాట్స్. సినిమా హిలేరియస్‌గా ఉంది. ఈ మధ్యకాలంలో కడుపుబ్బేలా నవ్వుకున్న సినిమా అని చెప్పగలను. నవీన్ పొలిశెట్టి తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. న్యూఏజ్‌లో నవీన్ స్టన్నింగ్ పెర్ఫార్మర్. రాహుల్ రామకృష్ణ బ్రిల్లియెంట్‌గా, సహజంగా నటించాడు అని అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 నాగ్ అశ్విన్‌కు అభినందనలు

నాగ్ అశ్విన్‌కు అభినందనలు

అలాగే జాతి రత్నాలు సినిమాలో నటించిన ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా నటన అద్బుతంగా ఉంది. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నిషియన్లందరికి కంగ్రాట్స్. రాధాన్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాను అద్భుతమైన కన్విక్షన్‌తో తెరకెక్కించిన నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక దత్, అశ్వినీదత్త్ గారికి అభినందనలు అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

దర్శకుడు అనుదీప్‌ గురించి

దర్శకుడు అనుదీప్‌ గురించి

తన సినిమాతో అందరికీ వినోదాన్ని పంచిన దర్శకుడు అనుదీప్ కేవీ ప్రతిభను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. సినిమా చూసిన తర్వాత ఆయనపై అత్యంత గౌరవం పెరిగింది. ప్రతీ ఒక్కరు మీ బ్రెయిన్స్ స్విచ్ఛాఫ్‌ చేసి సినిమా చూస్తే ఎంజాయ్, ఫన్ పుష్కలంగా లభిస్తుంది అని అల్లు అర్జున్ తన మూడో ట్వీట్‌లో పేర్కొన్నారు.

నవీన్, ప్రియదర్శి రియాక్షన్

నవీన్, ప్రియదర్శి రియాక్షన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్లపై నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి తదితరులు స్పందించారు. థ్యాంక్యూ రాక్‌స్టార్ అల్లు అర్జున్ గారు.. మీకు వినోదాన్ని అందించినందుకు మేము చాలా హ్యపీగా ఉన్నాం. మీ రియాక్షన్ మాకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇది టైప్ చేస్తున్నప్పుడు నేను మార్ఫా డ్యాన్స్ చేస్తున్నాను అంటూ నవీన్ పోలిశెట్టి రిప్లై ఇచ్చారు.

తొలి రోజు భారీ ఓపెనింగ్స్

తొలి రోజు భారీ ఓపెనింగ్స్

ఇదిలా ఉండగా, జాతి రత్నాలు చిత్రానికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన కనిపిస్తున్నది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో భారీగా ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తొలి రోజే రూ.4 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X