twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది మారుతి చిత్రం కాదు....(కొత్త జంట రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    --సూర్య ప్రకాష్ జోశ్యుల

    బూతుని, కామెడీని ...లో బడ్జెట్ లో తెరకెక్కించి హిట్ కొట్టడుతున్నాడంటూ తనపై మీడియాలో వస్తున్న కథనాలను మారుతి తిరగకొట్టాలని గట్టిగా నిశ్చయించుకున్నట్లున్నారు. అందులో భాగంగా సాధ్యమైనంతవరకూ ఎక్కడా బూతూ లేకుండా సీన్స్ ని తెరకెక్కించారు. అయితే బూతు ముద్రని వదిలించుకునే ప్రాసెస్ లో మారుతి సినిమాల్లో కనపించి ఆకట్టుకునే కామెడీ, యూత్ ఆలోచనలు, సమస్యలు,జోష్ కూడా మిస్సైపోయాయి. దాంతో ఈ చిత్రం రెగ్యులర్ రొటీన్ స్టఫ్ గా బయిటకు వచ్చింది. ఖచ్చితంగా ఇది మారుతి చిత్రం కాదు అనిపిస్తుంది. ఫస్టాఫ్ ...సప్తగిరి కామెడీతో బాగానే అనిపించినా సెకండాఫ్ కథకు సంభంధం లేకుండా తిరుగుతూ ఫార్ములా క్లైమాక్స్ తో ముగింపుకు వచ్చింది. నటన విషయం వదిలేస్తే అల్లు శిరీష్ కు...గౌరవం సినిమాకన్నా బెటరే అనాలి. ఉన్నంతలో రెజీనా, సప్తగిరి బాగా చేసారు.

    టీవీ ఛానెల్ లో పనిచేసే శిరీష్(అల్లు శిరీష్) ,సువర్ణ(రెజీనా) ఇద్దరూ బాగా స్వార్ధపరులు...కానీ టాలెంటెడ్. వీళ్ళిద్దరూ టీఆర్పీలు లేక మూలన పడిన ఓ తెలుగు ఛానెల్ ని నిలబెట్టి నెంబర్ వన్ చేయటానికి కలిసి పనిచేయాల్సి వస్తుంది. అందులో భాగంగా కొత్త జంట అనే పోగ్రాం డిసి ఒకటి చేస్తారు. ఆ పోగ్రాం లక్ష్యం... కుల,మత,వర్ణ,వర్గ,పేదా,ధనిక తారతమ్యం తో పెళ్లిళ్లలకు ఇబ్బందులు ఎదరువుతున్న జంటలకు తమ ఛానెల్ లో లైవ్ పోగ్రాం తో పెళ్లిళ్లు చేయటం. అలా పెళ్ల్ళిళ్లు చేస్తే గొడవలు జరిగి, తమకు టీఆర్పీలు వస్తాయని ప్లాన్. అనుకున్నట్లుగానే ఆ పోగ్రాం సక్సెస్ అవుతుంది. అయితే ఊహించని విధంగా శత్రువులను తెచ్చి పెడుతుంది. మరో ప్రక్క బిజినెస్ మ్యాన్(పోసాని)కి సువర్ణ అంటే ఇష్టం. ఆమెతో గడపాలనుకునే అతను కొత్త ఛానెల్ లాంచ్ చేస్తానని శిరీష్ ని పిలిచి మంచి జీతంతో కెరీర్ ఆఫర్ ఇస్తాడు. అయితే సువర్ణని తీసుకురావాలని కండీషన్ పెడతాడు. అయితే పోసాని ఇంటెన్షన్ అర్దం చేసుకున్న సువర్ణ ...ఆ ప్రపొజల్ కు నో చెప్తుంది. కానీ అప్పటికే పోసాని ఇచ్చే డబ్బుతో ప్రేమలో ఉన్న శిరీష్....ఆమెను ఎలాగైనా ఒప్పించటానికి ఆమెని ప్రేమిస్తున్నానని నాటకం ఆడతాడు. అది నిజమని నమ్మిన శిరీష ...అతనితో ప్రేమలో నిజంగానే పడుతుంది. అప్పుడు ఏమైంది... నిజం ఆమె ఎప్పుడు తెలుసుకుంటుంది...చివరకు వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    రొమాంటిక్ కామెడీ జానర్ లో మొదలైన ఈ కథ రాను రాను...ఒన్ సైడ్ లవ్ స్టోరీ గా తయారైంది. దాంతో ఫన్ మెల్లిగా తగ్గిపోవనటం మొదలైంది. మొదట్లో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ స్వార్ధపరులు....కలిసి పనిచేస్తున్నారు..ప్రేమలో పడుతున్నారు...అన్నట్లు మొదలై......తర్వాత హీరోయిన్ మాత్రమే ప్రేమలో పడి...తూచ్ నేను స్వార్ధపరురాలిని కాదు నా క్యారెక్టర్ ఛేంజ్ అని డెసిషన్ తీసుకుని...హీరోని ఒంటిరిని చేసేసింది. పాపం హీరో..ఒక్కడే స్వార్ధపరుడుగా...హీరోయిన్ ప్రేమను అర్దం చేసుకోని వాడిగా...(అఫ్ కోర్స్ ఆ స్వార్ధం తో అతను సాధించాలనుకున్న సొంత ఛానెల్ పెట్టాలనే లక్ష్యం దిసగా కూడా ఏమీ చేయడనుకోండి) మిగిలిపోయి...హీరోయిన్ వైపు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేసాడు. దాంతో రొమాంటిక్ కామెడీ కాస్తా...సెంటిమెంట్ లవ్ స్టోరీగా తయారైంది. దానికి తోడు...హీరోయిన్ సూసైడ్ సీన్స్ ఎందుకు పెట్టారో అర్దం కాదు.లవ్ స్టోరీ కదా డెప్త్ తేవాలనకున్నారో ఏమో కానీ మోడ్రన్ గా ఉండి టీవీ క్రియోవిట్ హెడ్ ఉద్యోగం చేసే అమ్మాయి ఇలా సూసైడ్ డెసిషన్స్ తీసుకుంది అంటే ఆశ్చర్యం వేస్తుంది.

    అలాగే...ఓ బిజినెస్ మ్యాన్(పోసాని)పాత్ర వచ్చి...నీతో పనిచేసే అమ్మాయిని తీసుకురా...నీకు మంచి ఉద్యోగం ఇస్తాను అంటే... హీరో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే అంటాడు...అంటే పోసాని ఏ ఉద్దేశ్యంలో మనస్సులో పెట్టుకుని ఆమెను తీసుకుని రమ్మన్నాడు అనేది వయస్సులో ఉన్న అతనికి అర్దం కాలేదా అని డౌట్ వస్తుంది. పోనీ తన స్వార్ధం కోసమే అలాంటి ప్రపోజల్ కి ఓకే చేసాడు అనుకున్నా జస్టిపికేషన్ కనపడదు. ఎందుకంటే తర్వాత అదే పోసాని మంచి వాడు కాదు...అంటూ ఆమెకు పాఠాలు చెప్పబోతాడు. ఇక హీరోయిన్ అసూయపడాలని, ఓ ఐటం గర్ల్ ని తేవటం, అది వర్కవుట్ కాకపోవటం వంటి అంశాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ పాత్రలు రెండింటినీ డిజైన్ చేయటంలో దర్శక,రచయిత మారుతి తడబడినట్లు కనపడుతుంది. మొదట ఎత్తుకున్న ఇద్దరి స్వార్ధపరులు...ప్రేమలో పడటం అనే అంశం చుట్టూనే కథ అల్లి ఉంటే మంచి రొమాంటిక్ కామెడీ దక్కేది అనటం లో సందేహం లేదు.

    స్లైడ్ షోలో...మిగతా రివ్యూ

    ఆమే ప్లస్ ...మైనస్

    ఆమే ప్లస్ ...మైనస్

    సినిమాలో పెద్ద ప్లస్..రెజీనా....ఆమె సినిమాని దాదాపు తన భుజాలపై లాక్కెళ్ళే ప్రయత్నం చేసింది. అయితే అదే మైనస్ కూడా అయ్యింది. అల్లు శిరీష్ ఆమె సరసన తేలిపోయారు..

    కామెడీ

    కామెడీ

    మారుతి సినిమాలు అంటే కామెడీ ప్రధానంగా ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. ముఖ్యంగా ప్రేమ కధా చిత్రంలో కామెడీని చూపిన వాళ్లు ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంటే అది వారి తప్పు కాదు. అయితే తన బలం ను మారుతి ఇందులో వదిలేసారు. కామెడీని చిన్న చూపు చూసారు.

    సప్తగరి

    సప్తగరి

    ప్రేమ కధా చిత్రం సినిమాని నిలబెట్టిన వారిలో ప్రధానమైనది సప్తగిరి కామెడీ. ఈ సినిమాలోనూ అదే వర్కవుట్ అవుతుందని భావించారు. అయితే ఫస్టాఫ్ లో సప్తగిరి పై పెట్టిన కామెడీ బాగానే పేలింది. అయితే సెకండాఫ్ లో సప్తగిరిని వాడుకోలేదు.

    గుండె జారి గల్లంతైంది తరహాలో....

    గుండె జారి గల్లంతైంది తరహాలో....

    గుండెజారి గల్లంతైంది సినిమాలో రవి ...గే కామెడీ బాగా జనాలుకు పట్టింది. అదే మ్యాజిక్ రిపీట్ చేద్దామనుకుని ఈ సిినిమాలోనూ అదే తరహా సీన్స్ పెట్టారు. కానీ అవి కామెడీ జారి గల్లంతయ్యాయి.

    పోసాని, తాగుబోతు రమేష్

    పోసాని, తాగుబోతు రమేష్

    రాజా అంటూ విభిన్నమైన మ్యానరింజస్ తో అదరకొట్టే పోసాని ఈ సినిమాలోనూ తన ప్రతిభను చూపించారు కానీ...అనుకున్నంతగా అవి పేలలేదు.తాగుబోతు రమేష్ ఉన్నంతసేపు బాగానే చేసారు కానీ ...అతని పాత్ర పరిధి చాలా చాలా తక్కువ.

    డైలాగ్స్....

    డైలాగ్స్....

    మారుతి సినిమాల్లో డైలాగులు..ఫన్నీగా ఉండటం చూస్తూనే ఉంటాం. అయితే బూతు తగ్గించాలనుకుని రాయటం వల్లనే ఏమో కానీ ఫన్ అంతలా లేకుండాపోయింది. ఆడా మొగ కలిస్తే భోగం రా...మగా మగా కలిస్తే రోగం రా వంటి వి రాసారు.

    అలాగే వెయ్యి కోట్లు ఇస్తానన్నా లొంగని ఒక అమ్మాయి నీ ప్రేమకు లొంగింది అంటే ఎంత ప్రేమించిందో అర్దం చేసుకో, లక్ష రూపాయలు ఇస్తే కన్న తల్లిని కూడా అమ్మ కాదు అని చెప్తావా...వంటి డైలాగులు మరీ పాతకాలంలగా అనిపిస్తాయి.

    ఐటం సాంగ్

    ఐటం సాంగ్

    అటు అమలా పురం...ఇటు పెద్దా పురం అంటూ సాగే... ఈ రీమిక్స్ సాంగ్ లో అల్లు శిరీష్ ని పెద్దగా లేకుండా చిత్రీకరించారు.మధురిమ..గ్రామీణ స్త్రీగా బాగా ఆ డ్రస్ లో మాస్ స్టెప్స్ వేస్తూ పాటకు కొత్త లుక్ తెచ్చింది. ధియేటర్స్ లోనూ ఈ పాటకు మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే ఇది సినిమాకు ఎంతవరకూ మైలేజ్ తెస్తుందో చూడాలి.

    ప్రెడిక్ట్ బుల్...

    ప్రెడిక్ట్ బుల్...

    ఇంటర్వెల్ నుంచి కధ మరీ ప్రెడిక్టుబుల్ గా మారటం మొదలైంది. క్లైమాక్స్ కు వచ్చేస్తున్నాం...ఇక ఎలోగోలా ముగించాలన్నట్లు గా సీన్స్ సాగాయి.

    దర్శకత్వం, నిర్మాణ విలువలు

    దర్శకత్వం, నిర్మాణ విలువలు

    దర్శకుడుగా మారుతి చిత్రాలు ఎక్కువగా స్క్రిప్టు వర్క్ మీదే ఆధారపడి సక్సెస్ అవుతూ వచ్చాయి. అయితే ఈ సారి ఆ విభాగమే ఫెయిలైంది. అలాగే అల్లు శిరీష్ నుంచి బెటర్ అవుట్ పుట్ తేలకపోయారు. కామెడీ సీన్స్ మీద ఉన్న గ్రిప్ మీద మిగతా చోట్ల తేలిపోయింది.

     ఎడిటింగ్, కెమెరా

    ఎడిటింగ్, కెమెరా

    ఎడిటర్ మనస్సు పెడితే సెకండాఫ్ లో ఈజీగా ఓ ఇరవై నిముషాలు పాటు తీసేయచ్చు అనిపించే విధంగా ఉంది. కెమెరా వర్కు మాత్రం సినిమాకు హైలెట్స్ లో ఒకటి అని చెప్పవచ్చు.

    సంగీతం

    సంగీతం

    లవ్ స్టోరీకి తగిన పాటలను బాగా డిజైన్ చేసి,ట్యూన్ చేసారు...అయితే వాటి ప్లేస్ మెంటే బాగోలేదు. పాటల్లో ఓసి ప్రేమ రాక్షసి పాట బాగుంది. అలాగే గుండెల్లో పాట కూడా బాగా తీసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అన్నట్లు ఉంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    నటీనటుల: అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు.
    సంగీతం: జేబి
    ఎడిటింగ్: ఉద్ధవ్
    ఆర్ట్: రమణ
    యాక్షన్: విజయ్
    డాన్స్: గణేష్
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్
    పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను
    సమర్పణ: అల్లు అరవింద్
    సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
    నిర్మాత: బన్నీ వాసు
    కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి

    ఫైనల్ గా...టైటిల్ తప్ప ఎక్కడా కొత్త అనిపించని ఈ చిత్రాన్ని ...ఈ సారి అల్లు శిరీష్ రెండో సినిమాకు ఎలా చేసాడు..అనే ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు . అలాగే సప్తగిరి కామెడీ ఎపిసోడ్ ని టీవీల్లో వచ్చేదాకా ఎక్కడ ఆగుతాం అనుకున్న వారు కూడా వెళ్లవచ్చు. రెజీనా వీరాభిమానులకు కూడా ఈ సినిమా మంచి ఆప్షనే.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Maruthi back with another romantic entertainer titled Kotha Janta,relesed today with divide talk. Decent first half and very bad second half. Sirish need to improve a lot. Regina is good and saptagiri is okay. produced by Bunny Vasu under the banner of Geetha Arts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X