Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రొటిన్ కథతోనే వస్తూ...(అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు' రివ్యూ)
గౌరవం, కొత్తజంట అంటూ రెండు సినిమాలు ఇచ్చినా,మెగా కుటుంబం నుంచి వచ్చినా అల్లు శిరీష్ కు పెద్ద క్రేజ్ రాలేదనే చెప్పాలి. అయితే ఈ మూడో ప్రయత్నంతో ఖచ్చితంగా హిట్ కొడతాను అంటూ ప్రోమోలు,పోస్టర్స్ తో నమ్మకం కలిగించాడు శిరీష్. అయితే ప్రోమోలలో క్రియేట్ చేసినంత క్యూరియాసిటీకు తగినట్లు గా చిత్రం లేదు కానీ , అల్లు శిరీష్ గత రెండు చిత్రాల కన్నా బెస్ట్ అనిపించింది. పరమ రొటీన్ కథ,కథనంతో పరుశరామ్ చేసిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ అయితే నటనలో మెచ్యూరిటి కనపరిచాడు. సినిమాలో బోర్ పెద్దగా లేదు కాబట్టి.. అల్లు అరవింద్ ఇలాంటి సినిమాలను లేపటంలో సరైనోడు కాబట్టి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్లే అవకాసం ఉంది.
బిజినెస్ పనిమీద కాశ్మీర్ వేలికు వెళ్లిన శిరీష్ (అల్లు శిరీష్) టెక్కింగ్ ఏక్సిడెంట్ లో ఇరుక్కున్న అనన్య(లావణ్య త్రిపాఠి)ని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను హాస్పటిల్ లో జాయిన్ చేస్తూ...ఆమెతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆమె బిటెక్ ఫైనలియర్..వైజాగ్ గీతమ్స్ కాలేజీలో చదువుతోందని తెలుసుకుని, వెంబడిస్తారు. అంతేకాకుండా తన ప్రేమ విషయం తన తండ్రి(ప్రకాష్ రాజ్) కు చెప్తాడు.
అయితే అప్పటికే శిరీష్ అన్నయ్య ఓ మిడిల్ క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటంతో అప్ సెట్ అయి ఉన్న ప్రకాష్ రాజ్ నో చెప్తాడు. దాంతో శిరీష్ తను తమ కుటుంబ నేపధ్యం చెప్పకుండా ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిలా ఆమెను ఒప్పిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఈలోగా ఓ ట్విస్ట్. అను తండ్రి రావు రమేష్ ఆమెకు ఓ సంభంధం సెటిల్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది...ఎలా ఆమె తండ్రిని సైతం ఒప్పించి,తన ప్రేమను గెలిపించుకున్నాడు అనేది మిగతా కథ.
స్లైడ్ షోలో మిగతా రివ్యూ...
ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏమిటి అంటే ఫ్యామిలీ వ్యాల్యూస్ కు ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేయటం, అందులో పరుశరామ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకు లావణ్య త్రిపాఠి నటన కలిసివచ్చింది. మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రకు ప్రాణం పోసింది. కేవలం ఫన్నీ సీన్స్ లోనే కాక ఎమోషన్ సీన్స్ లోనూ తన సత్తా ఏంటో చూపెట్టింది. అలీ,సుబ్బరాజు మధ్య నడిచే ట్రాక్ సెకండాఫ్ ని నిలబెడితే, ఫస్టాఫ్ ని ప్రభాస్ సీన్ ..తనదైన శైలి కామెడీతో లాగేసాడు అయితే దర్శకుడు అంతా బాగానే రాసాడు తీసాడు కానీ హీరోయిన్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు, ఆమెలో ఉన్న ప్రేమను బయిటకు తీసుకురావటానికి చేసే ప్రయత్నం సీన్స్ అన్నీ ఇల్లాజికల్ గా సాగాయి. ఆ విషయంలో జాగ్రత్త వహిస్తే బాగుండేది. పరుశరామ్ కు తను మోజుబడి రాసుకున్న కథ బాగా లేదు కానీ, డైలాగులు మాత్రం బలంగా ఉన్నాయి. సినిమాలో పెద్ద మైనస్ ఏమిటీ అంటే అప్పటిదాకా బాగా తీసుకువచ్చిన సినిమాని క్లైమాక్స్ లో వదిలేసాడని చెప్పాలి. తేలిపోయింది. ధమన్ రెగ్యులర్ ట్యూన్స్ కాకుండా సినిమాకు డిఫెరెంట్ గా ఫీల్ గుడ్ సినిమాల తరహాలో ప్రయత్నం చేసాడు కానీ పెద్ద గొప్పగా అయితే లేదు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేది. అలాగే మణికంధన్ సినిమాటోగ్రఫీ కూడా ప్రతీ లొకేషన్ ని విజువల్ ట్రీట్ లాగ చూపించే ప్రయత్నం చేసింది. ఎప్పటిలాగే అల్లు అరవింద్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను ఎక్కడికో తీసుకువెళ్లాయి. బాగా రిచ్ గా ఉండి సినిమాను మరో మెట్టు పైకెక్కించాయి. బ్యానర్: గీతా ఆర్ట్స్ ఫైనల్ గా ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ సినిమా అల్లు శిరీష్ ని వారి గుమ్మాలదాకా తీసుకువెళ్తుంది కానీ వారి హృదయాల్లోకి తీసుకెళ్లలేదు. అసభ్యత, అశ్లీలం లేని ఈ సినిమా కాలక్షేపాణికి ఓ సారి చూడవచ్చు.మిక్స్ చేయటం
కలిసొచ్చింది
కామెడీ
ఇల్లాజకల్
పరుశరామ్ బలం
పెద్ద మైనస్
ధమన్ ప్లస్
టెక్నికల్ గా
అదిరింది
ఎవరెవరు...
దర్శకత్వం : పరశురామ్, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర తదితరులు
సంగీతం: తమన్.యస్.యస్,
యాక్షన్: రామ్, లక్ష్మణ్,
ఆర్ట్ : రామాంజనేయులు,
సినిమాటోగ్రాఫి : మని కంఠన్,
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: నాగరాజు,
ఎడిటర్: మార్తాడ్ కె.వెంకటేష్,
నిర్మాత : అల్లు అరవింద్, బన్నీ వాసు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పరశురామ్.
విడుదల తేదీ : 5 ఆగష్టు 2016