twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అల్లుడు అదుర్స్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.0/5
    Star Cast: బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాష్ రాజ్, సోనూ సూద్, నభా నటేష్, అను ఇమాన్యుయేల్
    Director: సంతోష్ శ్రీనివాస్

    రాక్షసుడు సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ దారిలో పడ్డాడని అందరూ అనుకున్నారు. కథలు ఎంచుకోవడం రాటుదేలాడు.. ఇకపై బెల్లకొండ శ్రీనివాస్ నుంచి కొత్త కథలు ఆశించవచ్చని ప్రేక్షకులు భావించారు. అలాంటి సమయంలో బెల్లంకొండ సంతోష్ శ్రీనివాస్ వంటి ఫక్తు కమర్షియల్ మీటర్‌లో తెరకెక్కించే దర్శకుడితో అల్లుడు అదుర్స్ అనే సినిమాతో సంక్రాంతి బరిలో నేడు (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి నిజంగానే ప్రేక్షకుల చేత అల్లుడు అదుర్స్ అనిపించుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం.

    అల్లుడు అదుర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్: స్టైలిష్ లుక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫోటోలు)

     కథ..

    కథ..

    సాయి శ్రీనివాస్ (బెల్లంకొండ శ్రీనివాస్) చిన్నప్పుడే స్కూల్ ఏజ్‌లో ప్రేమలో పడతాడు. అలా వసుంధర (అను ఇమాన్యుయేల్) శ్రీను ఫస్ట్ లవ్ అయిపోతుంది. కానీ వసుంధర అలా చిన్నతనంలో దూరమవుతుంది. అప్పటి నుంచి ఆడవాళ్లకు, ప్రేమకు శ్రీను దూరంగా ఉంటాడు. అలాంటి శ్రీను తొలిచూపులోనే కౌముది (నభా నటేష్) ప్రేమలో పడతాడు. ఆ తరువాత కౌముది, వసుందర, శ్రీను కథలు ఎలా ముగిశాయన్నదే అల్లుడు అదుర్స్.

    కథలో ట్విస్టులు..

    కథలో ట్విస్టులు..

    నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)కు ప్రేమ అంటే ఎందుకు అంత ద్వేషం? అతని పెద్ద కూతురు వసుంధర ఎందుకు దూరమవుతుంది? అసలు జైపాల్ రెడ్డికి గజ(సోనూ సూద్)కు ఉన్న వైరం ఏంటి? ఈ ఇద్దరి పగలోకి శ్రీను వచ్చాక కథలు ఎలా మలుపు తిరుగుతుంది? చివరకు గజ, శ్రీనుల కథలు ఎలా ముగిశాయి? ఇందులో కౌముది, వసుంధరల పాత్రకు ఎండ్ కార్డ్ ఎలా పడుతుందనే ఆసక్తికర అంశాలతో అల్లుడు అదుర్స్ అల్లుకుంది.

    ఫస్టాఫ్‌ అనాలిసిస్..

    ఫస్టాఫ్‌ అనాలిసిస్..

    శ్రీను చిన్నతనంలోనే ప్రేమలో పడటం, అలా ఫస్ట్ లవ్ మధ్యలో ముగిసిపోతుంది. ఆ తరువాత ఓ సంఘటన మూలాన శ్రీను కౌముదిని చూస్తాడు. అలా చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇలా సీన్స్ ముందుకు సాగుతూ ఉంటాయి. కానీ కథలో ప్రేక్షకుడు మాత్రం అంతగా లీనమైనట్టు కనిపించదు. ఓ పాట, ఫైట్, కామెడీ సీన్, లవ్ సీన్ అన్నట్టుగా ఫస్టాఫ్ మొత్తాన్ని మలిచాడు. అప్పటి వరకు జైపాల్ రెడ్డి, శ్రీను, కౌముది మధ్యలోనే కథ జరుగుతుంది. సోనూ సూద్ ఎంట్రీతో ఫస్టాఫ్ ముగుస్తుంది. కమర్షియల్ ఫార్మాట్, వాటి లెక్కలను వేసుకుంటూ ఒక్కో సీన్‌ను పేర్చినట్టుగా అలా ఫస్టాఫ్‌ను చుట్టేసినట్టు కనిపిస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్..

    సెకండాఫ్ అనాలిసిస్..

    ఏ మాత్రం ఆసక్తికరంగా సాగని కథలో గజ ఎంట్రీతో అయినా మలుపు తిరుగుతుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుందని చెప్పవచ్చు. ఎంతో క్రూరుడైనట్టుగా చూపించిన గజను కమెడియన్‌గా మార్చేసినట్టు అనిపిస్తుంది. విలన్ గ్యాంగ్, హీరో పిచ్చి వేషాలు వేస్తూ వారిని వెర్రివాళ్లను చేసే సీన్లతో సెకండాఫ్‌ను లాక్కొచ్చాడు. మధ్యలో జైపాల్ రెడ్డిని రోగం పేరుతో ఓ మాయలో పెట్టేయడం, మధ్యలో హీరోయిన్‌తో రొమాన్స్, పాటలు ఇలా సరిగ్గా లెక్క చూసుకుని సీన్లను పేర్చినట్టే అనిపిస్తుంది. చివరకు ఏదో చేద్దామని అనుకుని మొత్తానికి ఏమీ చేయలేక అందరి అంచనాలను అనుగుణంగా ఎండ్ కార్డ్ వేసినట్టు అనిపిస్తుంది.

    నటీనటులు..

    నటీనటులు..

    అల్లుడు అదుర్స్ అని పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా మొత్తం బెల్లంకొండ శ్రీనివాసే కనిపిస్తాడు. ఎనర్జీ, యాక్టింగ్, డ్యాన్స్‌లు ఇలా అన్నింట్లోనూ బెల్లంకొండ బాగానే చేశాడు. ఈ సినిమా కోసం కొత్త మాడ్యులేషన్ ట్రై చేసినట్టు కనిపించింది. ఇక ప్రకాష్ రాజ్‌కు తనకు ఎంతో అలవాటైనా పాత్రలే కావడంతో ఈజీగా భయపెట్టేశాడు.. అలానే నవ్వించేశాడు. అను ఇమాన్యుయేల్, నభా అందాలతో ఆకట్టుకున్నారు. అయితే నభాకు మాత్రం నటించే స్కోప్ వచ్చినట్టుంది. ఇక సోనూ సూద్ పాత్రను ఎలా అనుకున్నారో.. చివరకు ఎలా మలిచారో కూడా తెలిసిపోతోంది. సోనూ సూద్‌కు వచ్చిన ఇమేజ్‌తో చేసిన మార్పులు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కానీ సోనూ సూద్‌ పాత్ర అంత కొత్తగా ఏమీ లేదు. ఇక వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డి, గెటప్ శ్రీను, మహేష్ విట్టా ఇలా అందరూ నవ్వించే ప్రయత్నం చేశారు.

    దర్శకుడి పనితీరు..

    దర్శకుడి పనితీరు..

    సంతోష్ శ్రీనివాస్ సినిమాలు అంటే ఓ ఫార్మూలా ఉంటుంది. అదే ఫార్మాట్‌ను నమ్ముకుని సినిమాలు తీస్తుంటాడు. అలా ఆయనకు కందిరీగ సినిమాతో ఓ ఫార్మూలా కలిసి వచ్చింది. దానికి కొనసాగింపుగానో లేదా వాటిని అనుసరించాడో ఏమో గానీ అల్లుడు అదుర్స్ కూడా అలానే అనిపిస్తుంది. కొత్త సీన్ అని చెప్పడానికి ఒక్కటి కూడా కనిపించదు. అదే కామెడీ, అదే స్క్రీన్ ప్లే, అదే ఫార్మూలాతో విసిగించినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు కట్టిపడేసే సీన్ ఒక్కటైనా తగులుతుందా? అని ఎదురుచూసేవారికి కచ్చితంగా నిరాశే మిగులుతుంది. ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు రౌడీలు, వారిని బక్రాలను చేయడం వంటి రొడ్డ కాన్సెప్ట్‌లతో ఎన్నో సినిమాలు వచ్చినా కూడా మళ్లీ మళ్లీ అలాంటి చిత్రాలు వస్తుంటాయని చెప్పడంలో అల్లుడు అదుర్స్ మరో ఉదాహరణ. సంతోష్ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాతో మ్యాజిక్ చేయలేకపోయాడనే చెప్పవచ్చు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    అల్లుడు అదుర్స్ సినిమా విషయంలో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొత్తగా కొట్టలేదని చెప్పవచ్చు. ఇక చోటా కే నాయుడు కెమెరా పనితనం మాత్రం బాగానే కనిపిస్తుంది. హీరోయిన్ల అందాలు, విజువల్స్ అన్నీ కూడా బాగానే చూపించాడు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. డైలాగ్‌లు మరీ అంత గుర్తు పెట్టుకునే రేంజ్‌లో లేవు. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి.

    ప్లస్, మైనస్ పాయింట్స్..

    ప్లస్, మైనస్ పాయింట్స్..

    ఇక అల్లుడు అదుర్స్ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ వెతకడం కూడా చాలా పెద్ద సమస్యే. అదే నెగెటివ్ పాయింట్స్ చెప్పమంటే మాత్రం ఆ లిస్ట్ మాత్రం చాంతాడంత ఉంటుంది. కథ, కథనం
    రొటీన్ సీన్స్, దర్శకత్వం, నవ్వు తెప్పించలేని కామెడీ, అనవసరపు పాటలు ఇలా ఎన్నెన్నో నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి.

    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    అల్లుడు అదుర్స్ ఏమో గానీ.. కథ,కథనాన్ని, దర్శకుడి ప్రతిభను చూసి ప్రేక్షకులు మాత్రం బెదుర్స్ అనేలానే ఉంది. ఎప్పుడో అరిగిపోయిన ఫార్మూలాను పట్టుకొచ్చి ప్రేక్షకుల చేత 'అల్లుడు అదుర్స్‌' అనిపించాలని ప్రయత్నించారు. కానీ అది వర్కవుట్ కానట్టు కనిపిస్తోంది.

    నటీనటులు

    నటీనటులు

    బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాష్ రాజ్, సోనూ సూద్, నభా నటేష్, అను ఇమాన్యుయేల్ తదితరులు
    దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
    నిర్మాత : గొర్రెల సుబ్రహ్మణ్యం
    మ్యూజిక్ : దేవీ శ్రీప్రసాద్
    సినిమాటోగ్రఫి : చోటా కే నాయుడు
    ఎడిటింగ్ : తమ్మిరాజు
    రిలీజ్ డేట్ : 2021-01-14

    English summary
    Alludu Adhurs is an Telugu language mass action And Emotional Drama written and directed by Santhosh Srinivas. The film stars Bellamkonda Sreenivas, Nabha Natesh, Anu Emmanuel, Sonu Sood,. This movie released on January 14th 2021
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X