For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Alluri Movie Review మాస్, యాక్షన్ డ్రామా.. శ్రీ విష్ణు సోలో ఫెర్ఫార్మెన్స్‌తో!

  |

  Rating: 2.5/5

  నటీనటులు: శ్రీ విష్ణు, కాయదు లోహర్, సుమన్, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శ్రీనివాసరావు, జయవాణి తదితరులు
  దర్శకత్వం: ప్రదీప్ వర్మ
  నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్
  సమర్పణ: బెక్కెం బబిత
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె
  ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
  మ్యూజిక్ డైరెక్టర్: హర్షవర్ధన్ రామేశ్వర్
  సినిమాటోగ్రఫి: రాజ్ తోట
  ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కోసనమ్
  ఫైట్స్: రామకృష్ణన్
  రిలీజ్ డేట్: 2022-09-23

  అల్లూరి సినిమా కథ..

  అల్లూరి సినిమా కథ..


  అల్లూరి సీతారామారాజు (శ్రీ విష్ణు) సిన్సియర్, సీరియస్ పోలీస్ ఆఫీసర్. అన్యాయం జరిగితే.. ఎవరైనా సరే సహించడు. తనదైన శైలిలో శిక్ష వేస్తుంటాడు. ఫలితంగా ఒకచోటి నుంచి మరో చోటికి ట్రాన్స్‌ఫర్ల రూపంలో అవార్డులు లభిస్తుంటాయి. జీవితంలో రామరాజు ఎలాంటి సమస్యలను అధిగమించాడు. ఖాకీ డ్రెస్సుకు ఎలాంటి న్యాయం చేశాడు? తాను ఇష్టపడి పెళ్లి చేసుకొన్న భార్య (కాయదు లోహర్)తో దాంపత్య జీవితం ఎలా సాగింది? అనే ప్రశ్నలకు సమాధానమే అల్లూరి సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?


  పోలీస్ కావాలనే పట్టుదలతో ఉన్న ఒక ముస్లిం రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ నజీర్ (తనికెళ్ల భరణి) కొడుకుకు ఎదురైన నిరుత్సాహ సంఘటనతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా చేసిన సాహసాలు, ప్రజల కోసం చేసిన సేవల గురించి పోలీసులు చెప్పడం ద్వారా అల్లూరి కథలోకి రంగ ప్రవేశం చేస్తాడు. ఫస్టాఫ్‌లో నక్సలైట్లతో ఎపిసోడ్, యువతిపై అత్యాచార ఘటన హైలెట్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు యాక్షన్ ఎపిసోడ్ మాస్ ప్రేక్షకులను కేక పెట్టించేలా ఉంటుంది.

   సెకండాఫ్‌ గురించి

  సెకండాఫ్‌ గురించి


  ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి అల్లూరిని హైదరాబాద్ పాతబస్తీకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అక్కడ జరిగే సంఘటనలు, ప్రజల ప్రేమను, అభిమానాన్ని సంపాదించే సీన్లు కొత్తగా ఉంటాయి. చివర్లో పాకిస్థాన్ ఉగ్రవాదుల ఎపిసోడ్ కాస్త సాగదీసినట్టు.. రొటిన్‌గా రెగ్యులర్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథను విపరీతంగా లాగదీయడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది.

  దర్శకుడు ప్రదీప్ వర్మ టేకింగ్

  దర్శకుడు ప్రదీప్ వర్మ టేకింగ్


  ప్రదీప్ వర్మ రాసుకొన్న పాయింట్.. కథను ఎపిసోడ్ వారీగా రాసుకొన్న విధానం బాగుంది. కాకపోతే కొత్తగా సన్నివేశాలు లేకపోవడం, కథ చెప్పే తీరు కొత్తగా లేకపోవడం ఇబ్బంది కలిగించే అంశం. అయితే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ విష్ణును చూపించిన విధానమే కాస్త కొత్తగా ఉంది. రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక దర్శకుడిపై ఆగడు, ఘర్షణ, సింగం చిత్రాల ప్రభావం ఎక్కువగానే ఉందనిపిస్తుంది. ప్రదీప్ వర్మ తనవంతుగా పొలీస్ కథను ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.

   శ్రీ విష్ణు మాస్.. మసాలా

  శ్రీ విష్ణు మాస్.. మసాలా


  ఇక అల్లూరి సినిమా గురించి ఏమైనా చెప్పుకోవాలంటే.. శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ గురించే చెప్పాలి. ఇప్పటివరకు సెన్సిటివ్ రోల్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్న శ్రీ విష్ణు.. అల్లూరి సినిమాలో మాస్ హీరోగా చెలరేగిపోయారు. లుక్, గెటప్‌కు తగినట్గుగా బాడీ లాంగ్వేజ్ సూపర్బ్‌గా కుదిరింది. యాక్షన్ సీన్లలో ఇక చెప్పాల్సిన పనలేదు. ఇప్పటి వరకు చూసిన శ్రీ విష్ణు వేరు.. అల్లూరి తర్వాత వేరు అనే రేంజ్‌లో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పటికే చూసిన రొటీన్ కథ, సంఘటనలు ఉన్నప్పటికీ.. తనదైన శైలిలో నటించి మరో రేంజ్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ఇక కాయదు లోహర్‌తో రొమాన్స్‌ విషయంలో ఇరగదీశాడు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో విష్ణు అదరగొట్టాడు.

  రొమాన్స్‌తో హీరోయిన్

  రొమాన్స్‌తో హీరోయిన్


  మిగితా నటీనటులు విషయానికి వస్తే.. హీరోయిన్‌గా కాయదు లోహర్ గ్లామర్ పరంగా విపరీతంగా ఆకట్టుకొన్నది. రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా సహజంగా పెర్ఫార్మ్ చేసింది. ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు.

   సినిమాటోగ్రఫి, బీజీఎం హైలెట్‌గా

  సినిమాటోగ్రఫి, బీజీఎం హైలెట్‌గా


  సాంకేతిక నిపుణుల గురించిన వివరాల్లోకి వెళితే... మాస్, రొమాంటిక్, ఎమోషనల్ అంశాలను సినిమాటోగ్రాఫర్ రాజు తోట ఫర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించారు. కొన్ని ఎపిసోడ్స్‌లో ముఖ్యంగా ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్‌తో సన్నివేశాల్లో లైటింగ్‌ను వాడుకొన్న తీరు సినిమాను ఫీల్‌గుడ్‌గా మారింది. హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎం, పాటలు బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల సీన్లలో ఉండే డెప్త్‌కు మించి బీజీఎంను ఇచ్చారనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ధర్మేంద్ర కాకరాలకు ఇంకా బోలెడ్ పని ఉందనిపిస్తుంది. బెక్కెం వేణుగోపాల్ అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

   ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?


  పోలీస్ కథతో వచ్చే సినిమాల్లో లవ్, యాక్షన్, సీరియస్ ఎలిమెంట్స్ చక్కగా కుదిరితే ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. అయితే ఈ సినిమాలో అలాంటి అంశాలకు కొదువేమి ఉండదు. కానీ కొత్తగా, ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు బీ, సీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చే అంశాలు బాగున్నాయి. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించగలిగితే సినిమా కమర్షియల్‌గా భారీగా వర్కవుట్ అవుతుంది. పోలీస్ కథలను, శ్రీ విష్ణు నటనను ఆస్వాదించడానికి థియేటర్లలో ఈ సినిమా ఓసారి చూడొచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  ప్లస్ పాయింట్స్
  శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్
  కాయతు లోహర్ గ్లామర్
  యాక్షన్ ఎపిసోడ్స్

  మైనస్ పాయింట్స్
  రొటీన్ కథ
  సినిమా నిడివి

  English summary
  Alluri Movie Review and Rating: Sree Vishnu's solo action and police cop story
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X