Alpha Movie First Review: అల్ఫా హిందీ మూవీ ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అల్ఫా. హీరో, నిర్మాత ఉదయ్ చోప్రా కథను అందించగా. ఈ సినిమాకు శివ్ రవైల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్, శర్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్, దివ్యేందు భట్టాచార్య నటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: రుబియాస్, ఎడిటింగ్: ఆరిఫ్ షేక్, మ్యూజిక్: రోహన్ష్, అబీర్ పండిట్, బ్యాక్ గ్రౌైండ్ స్కోర్: సంచిత్ అం్ అంకిత్ బెహ్రా తమ బాధ్యతలను వ్యవహరించారు. ఈ చిత్రం జూలై 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రిపోర్ట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? ఈ చిత్రానికి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Alpha Movie Review by Censor Board

అల్ఫా కథ విషయానికి వస్తే.. సీత (ఆలియాభట్)ను ఆమె పెంపుడు తండ్రి ఫతే సింగ్ లకావత్ (బాబీ డియోల్) ట్రైనింగ్ ఇచ్చి కరుడు గట్టిన షూటర్‌గా, హంతకురాలిగా మార్చుతారు. కానీ సీత మాత్రం పెంపుడు తండ్రి ప్లాన్‌ను తిరస్కరించి శత్రువుగా మారుతుంది. ఆ క్రమంలో మరో కిల్లర్ (శర్వరీ)తో గట్టి పోటీ ఎదురువుతుంది. అయితే చివరకు వాస్తవం తెలుసుకొని ఇద్దరు ఒకటి అయి తండ్రితోపాటు దుష్టశక్తులపై యుద్దం ప్రకటిస్తారు. ఈ క్రమంలో మేజర్ కబీర్ (హృతిక్ రోషన్) సహాయం తీసుకోవాలని ప్లాన్ వేస్తారు. సీతను కరడుగట్టిన హంతకురాలిగా తండ్రి ఎందుకు ట్రైనింగ్ ఇచ్చారు? తండ్రిని ఎందుకు వ్యతిరేకించి ఆయనపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొన్నది? మరో కిల్లర్‌ను తొలుత వ్యతిరేకించి.. ఆ తర్వాత ఆమెతో ఎదుకు చేతులు కలిపింది? రా చీఫ్, కల్నల్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్) పాత్ర ఏమిటి? మేజర్ కబీర్ సీతకు ఎలాంటి సహాయం అందించారు. తండ్రి దుష్ట బుద్దికి ఎలాంటి గుణపాఠం నేర్పారు అనేది ఈ సినిమా కథ.

ఈ మూవీ సెన్సార్ రివ్యూ జూన్ 29వ తేదీన పూర్తయింది. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై సెన్సార్ బోర్డు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాలోని 35వ నిమిషంలో వచ్చే కొన్ని అభ్యంతరకరమైన డైలాగ్స్‌ను తొలగించారు. అలాగే 38 నిమిషంలో వచ్చే సన్నివేశాన్ని మార్పులు చేర్పులు చేసి దాని స్థానంలో మరో విజువల్‌ను పెట్టించారు. ఈ సినిమాలోని ఏ ఒక్క సన్నివేశాన్ని కూడా తొలగించకుండా మార్పులతో సరిపెట్టారు అని సెన్సార్ కట్ సర్టిఫికెట్‌ వెల్లడించింది.

ఆలియా భట్, శర్వరి నటించిన ఈ సినిమాకు ఎలాంటి తీవ్రమైన అభ్యంతరాలు లేకుండా సానుకూలంగా సెన్సార్ ప్రక్రియ ముగియడంతో విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఈ సినిమాను చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల మార్గదర్వకత్వంలో, అనుమతితో చూడాల్సి ఉంటుందని సెన్సార్ నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ చిత్రం నిడివి విషయానికి వస్తే..ఈ సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు అంటే.. 140 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.

అల్ఫా సినిమాలో దయాదక్షిణ్యాలు లేని కరుడ గట్టిన సైనిక శిక్షణ పొందిన యోధులుగా ఆలియా, శర్వరీ నటించారు. యాక్షన్ సీన్లలోను, ఎమోషనల్ సీన్లలోను వారి పెర్ఫార్మెన్స్ హైలెట్ అవుతుంది. ఇద్దరి హీరోయిన్లను కొత్తగా చూసే అవకాశం కనిపిస్తుంది. తండ్రి కూతుళ్ల మద్య ఎమోషనల్ డ్రామా ఆకట్టుకొనేలా ఉంటుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్, హృతిక్ రోషన్ పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి అనే ఫీడ్ బ్యాక్ సోషల్ మీడియాలో వస్తున్నది. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: Alpha alia bhatt bobby deol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X