For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Am Aha movie review నిదానంగా సాగే థ్రిల్లర్.. కొత్తవారైనా ఇంట్రెస్టింగ్‌గా!

  |

  నటీన‌టులు: సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య‌, సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు త‌దిత‌రులు
  ద‌ర్శ‌కుడు: శ్యామ్ మండ‌ల‌
  నిర్మాత‌: జోరిగె శ్రీనివాస్ రావు
  బ్యాన‌ర్స్‌: రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్
  కో ప్రొడ్యూస‌ర్‌: అవినాష్ ఎ.జ‌గ్త‌ప్‌
  లైన్ ప్రొడ్యూస‌ర్‌: ప‌ళ‌ని స్వామి
  సినిమాటోగ్రాఫ‌ర్‌: శివా రెడ్డి సావ‌నం
  మ్యూజిక్‌: సందీప్ కుమార్ కంగుల‌
  ఎడిటర్: జె.పి
  పిఆర్వో: సాయి సతీశ్, పర్వతనేని రాంబాబు
  బ్యానర్: రంగస్థలం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌

  ఇంజనీరింగ్ విద్యార్థులు కల్యాణ్ (సుధాకర్ రెడ్డి), భల్లూ (రాజా) అరవింద్ ( ఈశ్వర్) క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సాధించి సంతోషంలో ఉంటారు. ఈ ఆనందంలో పబ్‌లో పార్టీకి వెళ్లి వస్తూ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుపోతారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే.. 20 లక్షలు ఇవ్వాలని సీఐ ఫణీంద్ర (రవిప్రకాశ్) డిమాండ్ చేస్తాడు. దిక్కు తోచని పరిస్థితుల్లో కావ్య (సిరి) అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి.. వారి తల్లిదండ్రుల నుంచి 20 లక్షలు డిమాండ్ చేస్తారు. ఈ క్రమంలో మాఫియా డాన్ జీఆర్ (రామరాజు) హత్య జరుగుతుంది.

  Am Aha movie review and rating

  కల్యాణ్, భల్లూ, అరవింద్ నిజంగానే మర్డర్ చేశారా? చేయని హత్యకు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. తన ప్రేయసి కల్యాణి (లావణ్య)ను కల్యాణ్ ఎలా కోల్పోయాడు? జీఆర్ (రామరాజు) సుబ్బరాజు (శుభోదయం సుబ్బారావు) మధ్య వైరం ఏమిటి? చివరకు కల్యాణ్, భల్లూ, అరవింద్ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? ఈ కథలో ఎస్పీ (రాజశ్రీ నాయర్) ట్విస్టు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే అం ఆః చిత్ర కథ.

  డైరెక్టర్ శ్యామ్ మండల రాసుకొన్న పాయింట్ బాగుంది. అయితే కథను విస్తరించే క్రమంలో తడబాటు పడినట్టు అనిపిస్తుంది. కాకపోతే ట్విస్టులో కథను విస్తరించే తీరు సాగదీసినట్టు ఉన్నా.. ఆసక్తికరంగా చెప్పగలిగాడనే ఫీలింగ్ కలుగుతుంది. చివరిలో ఎస్పీ, ముగ్గురు కుర్రాళ్ల మధ్య సినిమాకు మంచి ట్విస్టు ఫీల్ అందిస్తుంది. కాకపోతే ఈ సినిమా నిడివి, సాగదీసినట్టు కథ లాగించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

  ఇక ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులుగా సుధాకర్ రెడ్డి, రాజా, ఈశ్వర్ కొత్తవారైనా తమ పాత్రలను మంచి ఈజ్‌తో చేశారు. అనుభవం ఉన్న నటులుగా నటించారు. కిడ్నాప్ గురైన కావ్య సీఐ కూతురుగా నటించింది. విలన్ పాత్రలో జీఆర్‌గా రామరాజు తన నటనతో ఆకట్టుకొన్నాడు. ఎస్పీ రాజశ్రీ నాయర్ మరోసారి ఇంట్రెస్టింగ్ పాత్రలో నటించడమే కాకుండా కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

  సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే. సినిమాటోగ్రాఫ‌ర్‌: శివా రెడ్డి సావ‌నం సినిమాను రిచ్‌గా, అందంగా తీర్చి దిద్దారు. సందీప్ కుమార్ కంగుల‌ మ్యూజిక్‌ కథ, కథనాలకు తగినట్టుగా బాగుంది. ఎడిటర్: జేపికి ఇంకా కావాల్సినంత పని ఉంది. చాలా కంటెంట్‌పై కత్తెర వేస్తే సినిమా వేగం అందుకొనే అవకాశం ఉంది. చిన్న సినిమా అయినప్పటికీ. జోరిగె శ్రీనివాస్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

  డ్రగ్స్ మాఫియా నేపథ్యంగా థ్రిల్లర్, మర్డర్ మిస్టరీగా రూపొందిన చిత్రం అం ఆః. చిన్న సినిమాలు, థ్రిల్లర్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

  English summary
  Am Aha Thriller drama which hits the screen on September 16th. Here is the exclusive review by Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X