అమర్ అక్బర్ ఆంటోని మూవీ రివ్యూ, రేటింగ్

Recommended Video

Amar Akbar Anthony Movie Review అమర్ అక్బర్ ఆంటోని సినిమా రివ్యూ | Filmibeat Telugu

Rating:
1.0/5
Star Cast: రవితేజ, ఇలియానా, సునీల్, అభిమన్యు సింగ్, సత్య, వెన్నెల కిషోర్
Director: శ్రీనువైట్ల

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రం నవంబర్ 16న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని వరుస విజయాలతో దూసుకెళ్తున్న మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించారు. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమా ద్వారా శ్రీనువైట్ల, రవితేజ మళ్లీ ట్రాక్‌లో పడ్డారా? రీ ఎంట్రీతో ఇలియానా సక్సెస్ కొట్టిందా? మైత్రీ మూవీస్ హిట్ల పరంపర కొనసాగిందా అనే విషయాలను తెలుసుకోవాలంటే అమర్ అక్బర్ ఆంటోని సమీక్షను చదవాల్సిందే.

అమర్ అక్బర్ ఆంటోని కథ

అమర్ అక్బర్ ఆంటోని కథ

అమెరికాలో ఓ ఫార్మా కంపెనీ అధినేత కుమారుడు అమర్ (రవితేజ). వ్యాపారంలో తండ్రి భాగస్వామి కూతురు ఐశ్వర్య (ఇలియానా). రెండు కుటుంబాల మధ్య అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉంటాయి. బిజినెస్‌‌లో మరో నలుగురు (తరుణ్ అరోరా తదితరుల) పార్ట్‌నర్స్ మోసం వల్ల చిన్నతనంలోనే అమర్, ఐశ్వర్య తమ కుటుంబాలను కోల్పోతారు. అనుకోని కారణాల వల్ల వారిద్దరూ విడిపోతారు. పెరిగి పెద్దయిన తర్వాత తమ కుటుంబాన్ని వంచన చేసి.. తమను అనాధలుగా చేసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారనేది చిత్ర కథ.

కథలో ట్విస్టులు

కథలో ట్విస్టులు

ఇక ఈ కథలో అమర్ మినహాయించి అక్బర్.. ఆంథోని పాత్రలేంటి? చిన్నతనంలో విడిపోయిన అమర్, ఐశ్వర్య ఎలా కలుసుకొన్నారు? తమ కుటుంబానికి ద్రోహం చేసిన ఆ నలుగురు విలన్లను ఏరకంగా చంపారు? ఈ చిత్రంలో షియాజీ షిండే పాత్ర ఏంటి? సునీల్ కమెడియన్‌గా ఆకట్టుకొన్నారా? సత్య, వెన్నెల కిషోర్ ఏ విధంగా వినోదాన్ని పంచారనే ప్రశ్నలకు సమాధానమే అమర్ అక్బర్ ఆంటోని.

ఫస్టాఫ్ అనాలిసిస్

ఫస్టాఫ్ అనాలిసిస్

ఇక చిన్నతనంలో అమర్, ఐశ్వర్యలకు జరిగిన అన్యాయం నేపథ్యంగా కథ మొదలవుతుంది. ఆ తర్వాత అమర్ జైలు నుంచి విడుదల కావడమనే ఎపిసోడ్‌లోకి జంప్ చేసి కథలో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశాడు. అయితే కాసేపటికే దర్శకుడు సినిమా కథలోకి వెళ్లడానికి పడిన ఇబ్బందులు చూస్తే విషయం లేదనే స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసీజ్ అనే వ్యాధితో వండిన వంటకం వెగటుపుట్టించింది. హీరో మూడు పాత్రల్లోకి మారడం ఆకట్టుకోలేకపోయింది. అమెరికాలో తెలుగు వారి సంఘం వాటా ఎపిసోడ్ నాసిరకంగా మారడంతో మరింత కష్టాల్లోకి నెట్టినట్టు అనిపిస్తుంది. కథాగమనంలో విలన్లను హీరో చంపే తీరు అత్యంత పేలవంగా ఉండటంతో ఆకట్టుకోలేకపోయింది. అలా సాగదీస్తూ ఓ సాధారణమైన పాయింట్‌తో ఇంటర్వెల్ అయిందమ్మా అనే ఫీలింగ్ కలుగుతుంది.

సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

ఇక రెండో భాగంలో నాసిరకమైన కామెడీతో నస పెట్టించాడు. సునీల్ చేత చేయించిన హాస్యం అపహాస్యంగా మారింది. కేఏ పాల్ శిష్యుడిగా సత్య క్యారెక్టర్ కొంతలో కొంత ఊరట. సత్య కామిక్ టైమ్ బాగుంది. వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి పాత్రలు అవసరమా అనేపించే రేంజ్‌లో డిజైన్ చేశారు. రెండో భాగంలో అదే మర్డర్ల ఎపిసోడ్స్ విసుగుపుట్టించేలా ఉంటాయి. అక్బర్ పాత్ర చాలా దారుణంగా డిజైన్ చేశారు. ఆ పాత్ర కోసం రాసిన డైలాగ్స్ నవ్వు తెప్పించలేకపోగా, అసహనానికి గురిచేస్తాయి. ఆంటోని పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్‌గా నిస్సారమైన కథను అత్యంత పేలవంగా చెబుతూ విలన్లపై కాకుండా ప్రేక్షకులపై ప్రతీకారం తీసుకొనే చిత్రంగా ముగుస్తుంది.

శ్రీనువైట్ల గురించి

శ్రీనువైట్ల గురించి

వరుస ఫ్లాప్‌లతో దర్శకుడు శ్రీనువైట్ల ఎలాగైనా హిట్టు కొట్టాలనే వారికి నిరాశే మిగిల్చాడు. 80 దశకాల్లో కూడా ఊహించన కథ, కథనాలతో తన రాతను మార్చుకోలేకపోయాడు. బలహీనమైన అంశాలతో మరోసారి సాహసం చేశాడు. మూస ధోరణితోనే ముందుకెళ్లడంతో మరోసారి ఎదురుదెబ్బ తగలడం సహజంగా మారింది. గత పదేళ్ల క్రితం ఉన్న ప్రేక్షకులకు, ఇప్పటితరం ప్రేక్షకులకు ఉన్న గ్యాప్‌ను గుర్తించలేకపోవడం ప్రధానమైన లోపం. అమర్ అక్బర్ ఆంటోని పాత్రల్లో కానీ, ఇలియానా రోల్‌‌‌లో గానీ భావోద్వేగాన్ని నింపలేకపోవడం ప్రధాన లోపంగా మారింది. లెక్కకు మించిన క్యారెక్టర్లతో సినిమాను గందరగోళంగా మార్చాడు.

రవితేజ యాక్టింగ్

రవితేజ యాక్టింగ్

ఇక రవితేజ విషయానికి వస్తే.. మరోసారి జడ్జిమెంట్ మిస్ అయ్యాడు. ప్రస్తుతం పరిస్థితులకు సరిపడని కథ, కథనాలను గ్రహించలేకపోవడం మైనస్ పాయింట్. వరుస ఫ్లాప్‌లతో ముందుకెళ్తున్న తరుణంలో బలమైన కథను ఎంచుకోలేకపోయడం మరో లోపం. అమర్, అక్బర్, ఆంటోని పాత్రల్లో ఎనర్జీ లేకపోవడంతో రవితేజ చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయింది. రెండున్నర గంటల నిడివిలో ఒక్కసీనైనా పండకపోవడం అతని పాత్రల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కథలో బలం లేకపోవడంతో మాస్ మహారాజా సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు.

సాదాసీదాగా ఇలియానా

సాదాసీదాగా ఇలియానా

ఇలియానా విషయానికి వస్తే తేలిపోయే పాత్రలో కనిపించింది. వాస్తవానికి మంచి భావోద్వేగానికి స్కోప్ ఉన్న పాత్ర అది. పాటలకు, ప్రాధాన్యం, గుర్తుంచుకొనేలా లేని సన్నివేశాలతో మెప్పించలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత కనిపించిన ఇలియానాకు ఈ సినిమా ద్వారా ఒరిగేదేమీ లేదనే చెప్పాలి. గ్లామర్‌పరంగా ఓకే. కాకపోతే కొంత లావుగా ఉన్నట్టు కనిపించినా ఎలాగోలా మేనేజ్ చేసేసింది.

మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో

అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో లెక్కకు మించిన క్యారెక్టర్లు ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా గొప్పగా ఆకట్టుకోలేకపోయింది. సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సత్య, జయప్రకాశ్ రెడ్డి, రవి ప్రకాశ్ టీమ్ పండించిన కామెడీ పరమ రొటీన్‌గా ఉంది. సినిమాలో నలుగురైదుగురు విలన్లు ఉన్నా ఒక్కరు కూడా బలంగా కనిపించలేకపోయారు. ఇక లయ, అభిరామి లాంటి హీరోయిన్లు ఉన్నారనే విషయం స్పృహకు రాదు. అభిమన్యు సింగ్ అటు విలన్‌గా కాకుండా, ఇటు కమెడియన్ కాకుండా కన్‌ప్యూజన్‌గా మారింది.

తమన్ సంగీతం

తమన్ సంగీతం

ఇటీవల కాలంలో పరిణతితో కూడిన సంగీతాన్ని అందిస్తున్న తమన్ ఈ చిత్రంలో చతికిలపడ్డారనే చెప్పవచ్చు. అందుకు తమన్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బలమైన సన్నివేశాలు, భావోద్వేగమైన క్యారెక్టర్లు లేకపోవడంతో రీరికార్డింగ్‌కు స్కోప్ లేకపోయింది. హలో హలో డాన్ బాస్క్ పాట హుషారుగా సాగింది. మిగితా పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

ఆకట్టుకోలేని సినిమాటోగ్రఫీ

ఆకట్టుకోలేని సినిమాటోగ్రఫీ

సినిమా షూటింగ్ మొత్తం అమెరికా నేపథ్యంగా సాగుతుంది. అందమైన లోకేషన్లను సినిమాటోగ్రాఫర్ అందంగా చూపించాడు. ఎక్స్‌టీరియర్‌లో అద్భుతంగా సన్నివేశాలను చిత్రకరించి తన ప్రతిభను చాటుకొన్నారు. ఇలియానాను సాధ్యమైనంత వరకు గ్లామర్‌గా కనిపించేలా ప్రయత్నం చేశాడు.

సాగదీతగా సన్నివేశాలు

సాగదీతగా సన్నివేశాలు

ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు సాగదీతగా కనిపిస్తాయి. కథకు మించిన నిడివి సినిమాకు భారంగా మారింది. అనవసరమైన సీన్లు బాగానే ఉన్నాయి. సీన్లలో ల్యాగ్‌ను ఇంకాస్త తగ్గిస్తే మరింత షార్ప్‌గా కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనీతీరు కూడా బాగుంది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

పగ, ప్రతీకార నేపథ్యంతో ఎలాంటి ఎమోషన్స్, పాజిటివ్ అంశాలు లేకుండా తెరకెక్కిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ప్రేక్షకులను రవితేజ, శ్రీనువైట్ల మరోసారి దారుణంగా నిరాశపరిచిన చిత్రమని చెప్పవచ్చు. ఎలాంటి కేటగిరి ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేని చిత్రమని బలంగా చెప్పవచ్చు. బలహీనమైన కథ, కథనాలు సినిమాకు శాపంగా మారాయి. కల్యాణ్ రామ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన అతనొక్కడే చిత్రం ఛాయలు కనిపిస్తాయి.

మైత్రీ ప్రొడక్షన్ వ్యాల్యూస్

మైత్రీ ప్రొడక్షన్ వ్యాల్యూస్

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా వస్తుందంటే ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంటుంది. అమర్ అక్బర్ ఆంటోని లాంటి బ్లాక్ బస్టర్ టైటిల్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో భారీ అంచనాలను పెంచడంలో ప్రొడక్షన్ సక్సెస్ అయింది. కానీ కథ, కథనాలపై ఈ సంస్థ మరింత జాగ్రత్త పడాల్సింది. మితీమీరిన క్యారెక్టర్లు కట్టడి చేయలేకపోవడం ఓ లోపంగా కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు పునరావృతమైతే సంస్థ గుడ్‌విల్‌కు ప్రమాదం పొంచి ఉండే అవకాశం లేకపోలేదు.

 బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్
లొకేషన్లు
సినిమాటోగ్రఫి
ప్రొడక్షన్ వ్యాల్యూస్


మైనస్ పాయింట్స్
పాత్రల డిజైన్
కథ, కథనాలు
డైరెక్షన్
రీరికార్డింగ్
రొటీన్ కామెడీ

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: రవితేజ, ఇలియానా, తరుణ్ అరోరా, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, లయ, అభిరామి, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి తదితరులు
దర్శకత్వం: శ్రీనువైట్ల
సంగీతం: ఎస్ థమన్
సినిమాటోగ్రఫి: వెంకట్ దిలీప్ చుండూరు
ఎడిటింగ్: ఎంఆర్ వర్మ
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్: 2018-11-16

ట్యాగ్ లైన్: అతనొక్కడే...!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X