Amaran Movie Review: అమరన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. సాయిపల్లవి, శివకార్తీకేయన్ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్
నటీనటులు: శివ కార్తీకేయన్, సాయిపల్లవి, రాహుల్ బోస్, భువన్ అరోరా, శ్యామ్ మోహన్ తదితరులు
స్క్రీన్ ప్తే, దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియార్
నిర్మాత: కమల్ హాసన్
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫి: సీహెచ్ సాయి
ఎడిటింగ్: కలైవనన్
బ్యానర్: సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్
రిలీజ్ డేట్: 2024-10-31
ముకుంద్ వరదరాజన్ (శివకార్తీకేయన్) ఆర్మీలో పనిచేయాలని కలలు కొనే యువకుడు. కాలేజీ రోజుల్లో ఇందు రెబాకా వర్గీస్ (సాయిపల్లవి) అనే మలయాళ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. తాను సైన్యంలో పనిచేయాలని ఉందని ఇందుతో చెబుతాడు. అయితే ఆర్మీలో పనిచేసే వ్యక్తికి తన తమ కూతురిని ఇవ్వమని ఇందు తల్లిదండ్రులు అభ్యంతరం చెబుతాడు. సైన్యంలో చేరిన ముకుంద్.. జమ్ము, కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, మిలిటెంట్లు చేసే అరాచకాలను ఉక్కుపాదం మోపుతాడు.

ఇందుతో ప్రేమాయణం ఎలా సాగింది? కుల మతాలు, ఆర్మీ తన ప్రేమ, పెళ్లికి అడ్డంకి కావడంతో ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇందు తల్లిదండ్రులను ఎలా ఒప్పించి పెళ్లి చేసుకొన్నాడు? జమ్ములో ముకుంద్ ఎలాంటి వ్యూహాలతో మిలిటెంట్లకు సింహస్వప్నంగా మారాడు? ఇందు, తన కూతురుతో ముకుంద్ ఎమోషనల్ జర్నీ ఎలా సాగింది? ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడు అయ్యాడనే భావోద్వేగమైన ప్రశ్నలకు సమాధానమే అమరన్ సినిమా కథ.
ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తకం ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ పెరియార్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ మూవీ కోసం ఆయన చేసిన రీసెర్చ్, ఎంచుకొన్న పంథా, రాసుకొన్న సన్నివేశాలు ప్రతీ క్షణం ఉద్వేగానికి గురి చేస్తాయి. పలు చోట్ల ఆవేశాన్ని, ఆవేదన కలిగించడమే కాకుండా కంటతడి పెట్టించేలా ఉంటాయి. కొన్ని చోట్ల రక్తం ఉడికేలా కథను చెప్పిన తీరుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇండియన్ ఆర్మీ చేసే సాహసాలు, అంకిత భావాన్ని ప్రతీ సన్నివేశంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ముకుంద్ పాత్రను, అలాగే ఇందు పాత్రను చిత్రీకరించిన తీరును చూస్తే ఆయన దర్శకత్వ ప్రతిభకు ఫిదా అవ్వాల్సిందే. ప్రేక్షకుడిని యుద్ద వాతావరణంలో ఉన్నామనే ఫీలింగ్ కలిగించేలా ప్రతీ సన్నివేశాన్ని తెరపైన చెక్కారు.

నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ముకుంద్‌గా శివ కార్తీకేయన్ నటించిన తీరు, యాక్షన్ సన్నివేశాల్లో విజృంభిన తీరుకు చేతులెత్తి మొక్కాల్సిందే. యుద్ద సన్నివేశాల్లో ఓ నటుడిగా కాకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్దంగా ఉన్న సైనికుడిగానే తెర మీద కనిపించాడు. ముకుంద్‌గా తెర మీద సజీవంగా కనిపించాడు. ఆయన తప్ప మరొకరు చేయలేరనే విధంగా సినిమాలో నటించారు. ఇక ఇందుగా సాయిపల్లవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లవ్ సీన్లలోను, రొమాంటిక్ సీన్లలో అద్బుతంగా హావభావాలను ప్రదర్శించింది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్, ఆ తర్వాత ఓ వార్ సీన్ సందర్భంగా ఫోన్‌లో మాట్లాడే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రాహుల్ బోస్, ఇతరులు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు ఎమోషనల్ నటనతో గుర్తుండిపోయేలా నటించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, సాయి సినిమాటోగ్రఫి, యాక్షన్ కొరియోగ్రఫి పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. ప్రతీ సన్నివేశాన్ని ఓ రేంజ్‌లో తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో నెక్ట్స్ లెవెల్ అనేలా కొట్టాడు. సాయి చిత్రీకరించిన సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. జమ్ము, కశ్మీర్‌లో వార్ ఎపిసోడ్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద కనిపించని విధంగా కొత్తగా ప్రజెంట్ చేశాడు. కలైవన్ ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్‌లో కథ చెప్పాల్సిన అవసరం ఉన్నందున స్లోగా అనిపిస్తుంది. కమల్ హాసన్, సోని పాటించిన నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.

తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంలోని కొన్ని కీలక సన్నివేశాలను తెర మీద అద్డుతంగా ఆవిష్కరించిన చిత్రం. ఎమోషనల్ కంటెంట్ మాత్రమే కాకుండా కమర్షియల్ హంగులతో అత్యద్బుతంగా రూపొందించారు. ప్రేమ,యుద్ధం, దేశభక్తిని రంగరించి ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా ఉంటాయి. ఈ మూవీలో సన్నివేశాలు గుండెను పిండేసేలా.. భావోద్వేగానికి గురి చేస్తూ.. కంటతడి పెట్టించేలా ఉంటాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రతీ ప్రేక్షకుడు దేశభక్తితో రగిలిపోవడం ఖాయం. శివ కార్తీకేయన్, సాయిపల్లవి పెర్ఫార్మెన్స్, టెక్నికల్ బ్రిల్లియెంట్ అంశాల కోసం ఈ సినిమాను తప్పకుండా తెరపైనే చూడాల్సిందే. డొంట్ మిస్..


Click it and Unblock the Notifications











