Ambajipeta Marriage Band Telugu Movie Review భావోద్వేగాలతో సుహస్ మూవీ.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు రివ్యూ

Rating: 3/5

నటీనటులు: సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు
కథ, దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి
సమర్పణ: బన్నీ వాసు, వెంకటేష్ మహా
సినిమాటోగ్రఫి: వాజిద్ బేగ్
ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్
మ్యూజిక్: శేఖర్ చంద్ర
బ్యానర్: జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2024-02-02

నాయి బ్రాహ్మణ కులానికి చెందిన మల్లికార్జున్ అలియాస్ మల్లి (సుహస్) అంబాజీపేటలో మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేస్తుంటాడు. మల్లికి కవల సోదరి లక్ష్మీ (శరణ్య ప్రదీప్), తల్లిదండ్రులతో కలిసి సరదాగా బతుకుతూ ఉంటాడు. ఊరి పెద్ద వెంకట బాబు (నితిన్ ప్రసన్న) సోదరి లక్ష్మీ (శివానీ నాగారం)ను చిన్నతనం నుంచే ప్రేమిస్తుంటాడు. టీచర్‌గా పనిచేసే లక్ష్మీపై ఊరిపెద్ద వెంకట బాబు దౌర్జన్యం చేస్తాడు.

Ambajipeta Marriage Band Movie Review

Recommended Video

Ambajipeta Marriage Band Movie Personal Opinion | Telugu Filmibeat

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండులో మల్లీ ఎలా నడిపిస్తుంటాడు? తన కులవృత్తిని చేస్తూ గ్రామంలో ఎలాంటి అవమానాలకు గురి అవుతుంటాడు. డబ్బు, అగ్ర కులం చాటున వెంకట్ బాబు ఎలాంటి అరాచకాలు చేస్తుంటాడు. తన అక్క లక్ష్మీకి జరిగిన అవమానానికి మల్లీ ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు? లక్ష్మీపై ప్రేమను పెంచుకొన్న సంజీవీ (జగదీష్)కు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? తన సోదరిపై దౌర్జన్యం చేసిన వెంకటబాబుకు ఎలాంటి శిక్షను మల్లి విధించాడు అనే ప్రశ్నలకు సమాధానమే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ చెప్పడానికి కొత్తగా ఏమీ ఉండదు. రెగ్యులర్, రొటీన్ కథ. ఇప్పటి వరకు కుల వివక్ష, గ్రామ పెద్ద కూతురును తక్కువ కులం వ్యక్తి ప్రేమించడం లాంటి అంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ దుష్కంత్ కటికనేని రాసుకొన్న స్క్రీన్ ప్లే, క్యారెక్టర్లను డిజైన్ చేసుకొన్న విధానం, కథను నడిపించిన తీరు అతడి ప్రతిభకు అద్దం పట్టింది. కంటెంట్ ప్రధానంగా నడిపించడానికి రాసుకొన్న డైలాగ్స కూడా భారీగానే పేలడమే కాకుండా భావోద్వేగానికి గురిచేస్తాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా తొలి భాగంలో వినోదాత్మకంగా మొదలై ఫన్, కొన్ని ఎమోషన్స్‌తో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కు ముందు 20 నిమిషాల ముందు చోటుచేసుకొన్న ఓ సంఘటన కథను చాలా సీరియస్‌గా ఎమోషనల్‌గా మారడమే కాకుండా అదిరిపోయే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌కు సహాయపడింది. ఇక సెకండాఫ్‌లో కొన్ని రొటీన్ సీన్లతో ప్రీ క్లైమాక్స్ వరకు లాక్కొచ్చారనే అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి గ్రిప్ప్పింగ్‌గా, ఎమోషనల్‌గా రాసుకొన్న కథ, దర్శకుడు దుష్యంత్, హీరో సుహస్, శరణ్య, శివానీ తమ పెర్ఫార్మెన్స్‌తో సూపర్ హిట్ సినిమా అనే ఫీలింగ్ కలిగేలా చేసింది.

గతంలో సుహస్ తన చిత్రాలతో విలక్షణమైన నటుడు అనే అభిప్రాయాన్ని కలిగించాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాలో కూడా ఎమోషనల్‌తోపాటు ఎంటర్‌టైనింగ్ తన ప్రతిభను చాటుకొన్నాడు. అయితే ఈ సినిమాకు ప్రాణం లక్ష్మీ పాత్రలో కనిపించిన శరణ్య ప్రదీప్. ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలతో గుర్తింపు పొందిన ఆమె.. లక్ష్మీ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ సినిమాను రకరకాల ఎమోషన్స్‌తో తన భుజాల మీద మోశారనే చెప్పాలి. హీరోయిన్‌గా పరిచయం అవుతున్న శివానీ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. గ్లామర్‌గానే కాకుండా నటనతో కూడా ఆకట్టుకొన్నది.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. మ్యూజిక్, డైలాగ్స్, సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. శేఖర్ చంద్ర తన బీజీఎంతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. వాజిద్ బేగ్ తన కెమెరాతో కోనసీమ అందాలను మరోసారి రుచి చూపించాడు. పవన్ కల్యాణ్ ఎడిటింగ్, ధీరజ్ మొగిలినేని అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

సిస్టర్ సెంటిమెంట్, క్యూట్ లవ్ స్టోరి, రూరల్ విలేజ్ డ్రామా, కుల వివక్ష, ధన వివక్ష లాంటి అంశాలతో తొలి చిత్ర దర్శకుడు రూపొందించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. కథలో కొత్తదనం లేకపోయినా.. స్క్రీన్ ప్లే, రాసుకొన్న సీన్లు, పాత్రలతో చెప్పించిన డైలాగ్స్ సినిమాను నిలబెట్టాయి. ఊహించని మలపులు, సన్నివేశాలు ప్రేక్షకుడిని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేలా చేశాయి. అన్ని వర్గాలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ నచ్చేలా ఈ మూవీ ఉంది. థియేటర్‌లోనే చూసేందుకు ప్రయత్నించడం.. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనే నిరాశపరచదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X