Amigos Review స్టోరీ పాయింట్ కొత్తదే.. కల్యాణ్ రామ్ ఎలా చేశాడంటే?

Rating:
2.5/5

నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, అషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న తదితరులు
రచన, దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
నిర్మాతలు: వై రవిశంకర్, నవీన్ ఎర్నేని
మ్యూజిక్: జిబ్రాన్
సినిమాటోగ్రఫి: సౌందరరాజన్
ఎడిటింగ్: తమ్మిరాజు
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2023-02-10

అమిగోస్ కథ గురించి

అమిగోస్ కథ గురించి

రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే సిద్దూ (కల్యాణ్ రామ్) తొలి చూపులోనే ఇషికా (అషికా రంగనాథ్) ప్రేమలో పడుతాడు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో సిద్దూ, ఇషికా నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఈ క్రమంలో మనిషిని పోలిన మనుషుల గురించి తెలిపే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడంతో మంజునాథ్, మైఖేల్ అలియాస్ బిపిన్ రాయ్ పరిచయం అవుతారు. మైఖేల్ చేసిన కుట్రకు మంజునాథ్ జాతీయ భద్రతాధికారులకు చిక్కిపోతాడు. ఇక సిద్దూ స్థానంలోకి వచ్చి మైఖేల్ వారి ఇంట్లో తిష్టవేస్తాడు.

అమిగోస్‌లో ట్విస్టులు

అమిగోస్‌లో ట్విస్టులు

మైఖేల్ ఎవరు? దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేశాడు? సిద్దూ, మంజునాథ్‌ను ఎలా వాడుకొన్నాడు. మైఖేల్ చేసిన కుట్రకు మంజునాథ్ ఎలాంటి కష్టాల్లో ఇరుక్కొన్నాడు? మైఖేల్ చెరలో ఉన్న తన కాబోయే భార్య ఇషికాను ఎలా కాపాడుకొన్నాడు. మైఖేల్ కుట్రలకు సిద్దూ ఎలా చెక్ చెప్పాడు? తనను పోలిన మనుషులను కలువడం ద్వారా సిద్దూ జీవితంలో జరిగిన మంచి, చెడులు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే అమిగోస్ సినిమా కథ.

అమిగోస్ ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

అమిగోస్ ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

అమిగోస్ సినిమా సిద్దూ ఇంట్రడక్షన్‌తో చాలా రొటీన్ ఫార్మాట్‌లో మొదలవుతుంది. మనిషిని పోలిన మనుషులు కాన్సెప్ట్‌తో కొంత వెరైటీ ట్రై చేశాయనే ఫీలింగ్ కలుగుతుంది. మూడు క్యారెక్టర్లను నడిపించిన విధానం ఫర్వాలేదనిపిస్తుంది. ఇక ఇషికాతో సిద్దూ లవ్ ట్రాక్ రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగడంతో ఓ సాదాసీదా సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్టుతో సెకండాఫ్ పై ఆసక్తిని కలిగేలా చేశాడనిపిస్తుంది.

అమిగోస్ సెకండాఫ్‌లో

అమిగోస్ సెకండాఫ్‌లో

ఇక సెకండాఫ్‌లో మైఖేల్ క్యారెక్టర్‌తో కల్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేశాడనిపిస్తుంది. కానీ మైఖేల్ పాత్రలో బలం లేకపోవడం, పాత్రలో వేరియేషన్ లేకపోవడం వల్ల ఎంగేజ్‌మెంట్ మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్లైమాక్స్ మరీ రొటీన్‌గా ముగియడంతో అమిగోస్ యావరేజ్ సినిమా అనిపిస్తుంది.

దర్శకుడు రాజేంద్ర రెడ్డి గురించి

దర్శకుడు రాజేంద్ర రెడ్డి గురించి

తొలిసారి దర్శకుడిగా మారిన రాజేంద్ర రెడ్డి ఎంచుకొన్న పాయింట్ సరికొత్తగా ఉంది. కానీ కథ, కథనాలు కోసం ఎత్తుకొన్న ఎత్తుగడ కరెక్ట్‌గా లేదనే చెప్పాలి. కథ పాతదైనా సన్నివేశాలు ఫ్రెష్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. మూడు పాత్రలను బలంగా రాసుకోలేకపోవడం ఒక మైనస్‌గా చెప్పుకోవాలి. కథలో ఫ్రెష్ నెస్ లేకపోవడం, సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నప్పటికీ కల్యాణ్ రామ్‌తో మంచి ఫెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొని ఒకే అనిపించేలా చేశాడు.

కల్యాణ్ రామ్, అషికా ఫెర్ఫార్మెన్స్

కల్యాణ్ రామ్, అషికా ఫెర్ఫార్మెన్స్

కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లో వేరియేషన్స్ చూపించేందుకు ప్రయత్నించిన తీరు బాగుంది. మైఖేల్ పాత్రలో కల్యాణ్ రామ్ ఒదిగిపోయాడు. ఫెర్ఫార్మెన్స్ పరంగగా, నటుడిగా మరో మెట్టు ఎక్కే ప్రయత్నం చేశాడు. విలనిజాన్ని బాగా పండించాడని చెప్పవచ్చు. ఇక ఆషికా రంగనాథ్ గ్లామర్ పాత్రకే పరిమితమైంది. రొమాంటిక్ సన్నివేశాల్లో కల్యాణ్ రామ్‌తో మంచి కెమిస్ట్రీని పండించింది. బ్రహ్మజీ, సప్తగిరి ఫర్వాలేదనిపించారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు వారి పాత్రల పరిధిలో ఓకే అనిపించారు.

టెక్నికల్‌ అంశాల గురించి

టెక్నికల్‌ అంశాల గురించి

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సౌందర రాజన్ సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్లను బాగా చిత్రీకరించాడు. మ్యూజిక్ విషయానికి వస్తే ఎన్నో రాత్రుల పాట తప్ప బీజీఎం కూడా నార్మల్‌గానే ఉందని చెప్పవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. ఈ సినిమాలో వాళ్లు ఖర్చు చేయడానికి, క్వాలిటీ మెయింటెన్ చేయడానికి స్కోప్ కూడా లేకపోయింది. పాటలో ఆర్ట్ వర్క్ బాగుంది. మిగితా విభాగాలు పెద్దగా ఎలివేట్ అయ్యే ఛాన్సే కనిపించలేదు.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?

ఫైనల్‌గా ఎలా ఉందంటే?

మనిషిని పోలిన మనుషులు అనే కొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్, డ్రామాగా అమిగోస్ రూపొందింది. దర్శకుడు ఆలోచించిన పాయింట్ బాగుంది. కానీ కథను విస్తరించడంలో తడబాటు కనిపిస్తుంది. కల్యాణ్ రామ్ ఫెర్ఫార్మెన్స్ మాత్రమే సినిమాకు హైలెట్. నందమూరి ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు బాగున్నాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలను బట్టి సినిమా కమర్షియల్ రేంజ్ తెలుస్తుంది.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు


ప్లస్ పాయింట్స్
నందమూరి కల్యాణ్ రామ్
అషికా రంగనాథ్ గ్లామర్ఈ

మైనస్ పాయింట్స్
కథ, కథనం
రొటీన్ సన్నివేశాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X