For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nallamala movie review.. నిదానంగా సాగే నల్లమల.. అమిత్ తివారీ, భాను శ్రీ మెప్పించారా?

  |

  నటీనటులు: అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు

  కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
  నిర్మాత: ఆర్ఎమ్
  సినిమాటోగ్రఫి: వేణు మురళి
  సంగీతం, పాటలు: పీఆర్
  ఎడిటర్: శివ సర్వాణి
  ఆర్ట్: యాదగిరి
  ఫైట్స్: నబా
  వీఎఫ్ఎక్స్: విజయ్ రాజ్
  పీఆర్వో: దుద్ది శ్రీను
  రిలీజ్ డేట్: 2022-03-18

  దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతిని, సాధు జంతువులను ప్రేమించే నల్లమల (అమిత్ తివారీ) అక్రమ వ్యాపారం చేసేవారికి సహాయం చేస్తుంటాడు. మొరటోడులా కనిపించే నల్లమలకు తన వద్ద ఉండే మేలు రకం జాతి ఆవు అంటే పంచ ప్రాణాలు. తమ గూడెంలో ఉండే వనమాలి (భాను శ్రీ) మనసుకు దగ్గరవుతాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమ వ్యాపారులకు సింహస్వప్నంగా మారుతాడు.

  నల్లమలలో అవినీతి పోలీస్ ఆఫీసర్ (కాలకేయ ప్రభాకర్), అక్రమ వ్యాపారి (అజయ్ ఘోష్) చేసే అనైతిక పనులు ఏమిటి? ఏ విషయంలో అక్రమ వ్యాపారులకు నల్లమల ఎదురు తిరుగుతాడు? నల్లమల అడవి ప్రాంతంలో శాస్త్రవేత్త (నాజర్) ఎలాంటి పరిశోధనలు చేపట్టాడు? శాస్త్రవేత్త ఎందుకు నల్లమలలోని ఆవులను టార్గెట్ చేశాడు? మంత్రి (తనికెళ్ల భరణి)కి నల్లమలతో ఎలాంటి సంబంధం ఉంది? అక్రమార్కులను ఎదురించే క్రమంలో నల్లమలకు ప్రియురాలు వనమాలి ఎలాంటి సహకారం అందించింది అనే ప్రశ్నలకు సమాధానమే నల్లమల సినిమా కథ.

  Amit Tiwaris Nallamala movie review and rating: Bigg Boss fame Bhanu Sri looks glamourous

  శాస్త్రవేత్త (నాజర్)ను గిరిజనలు వెంటాడటంతో ఎమోషనల్ నోట్‌తో నల్లమల సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్కూల్ పిల్లలకు ఎలాంటి అంశాలతో పాఠ్యాంశాన్ని పుస్తకంలో చేర్చాలనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కథ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక మాజీ నక్సలైట్ (చత్రపతి శేఖర్) చెప్పే ఫ్లాష్ బ్యాక్‌తో ఫీల్ గుడ్‌ నోట్‌తో కథలోకి వెళ్తాం. సెకండాఫ్‌లో ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేయడం కొంత ఊరటగా అనిపిస్తుంది.

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అమిత్ తివారీ హీరోగా ఎంచుకొన్న కథ బాగుంది. కానీ బలమైన సన్నివేశాలు లేకపోవడంతో ఆయన ప్రతిభ బయటకు వచ్చినట్టు కనిపించదు. ఇక భాను శ్రీ పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. కాకపోతే గ్లామర్ పరంగా, డ్యాన్సుల పరంగా భాను శ్రీ ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో భాను శ్రీ నటన బాగుంది. అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, నాజర్, తనికెళ్ల భరణి పాత్రలు రొటిన్‌గానే కనిపిస్తాయి. ఆ పాత్రల్లో డెప్త్ ఉన్నప్పటికీ.. వారికి సంబంధించిన సన్నివేశాలు బలంగా రాసుకొని ఉంటే మరింత ఎమోషనల్‌గా ఉండేవనిపిస్తుంది.

  ఇక సాంకేతిక అంశాలకు వస్తే.. నల్లమల సినిమాకు బ్యాక్ గ్రౌండ్, సినిమాటోగ్రఫి స్కోర్ ప్రత్యేక ఆకర్షణ. సన్నివేశాల్లో బలం లేకపోయినా బీజీఎంతో కొన్ని సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. యాక్షన్ సీన్లు, అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సిద్ శ్రీరామ్ పాడిన ఏమున్నావే పిల్ల పాట ఆడియో పరంగాను, తెర మీద కూడా ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఇతర విభాగాల పనితీరు ఒకేలా ఉందనిపిస్తాయి. దర్శకుడు రవి చరణ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ ఎమోషనల్‌గా, ప్రేక్షకుల మనసుకు హత్తుకొనేలా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు.

  Recommended Video

  Nallamala Movie Team Visited KSRM Engineering College | Filmibeat Telugu

  ఓవరాల్‌గా నల్లమల సినిమా విషయానికి వస్తే.. అటవీ ప్రాంతంలో జరిగే అన్యాయాలు, వాటిని ఎదురించిన గిరిజన యువకుడి కథగా రూపొందింది. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే ఓ ఎమోషనల్ డ్రామా అయి ఉండేది. అమిత్, భాను శ్రీ చేసిన ప్రయత్నాలు కొంత మేరకు సఫలమయ్యాయి. గ్రామీణ వాతావరణం, నేటివిటి సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.

  English summary
  Actor Amit Tiwari's Nallamala movie hits the screen on March 18th. Here is Filmibeat Telugu exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X