twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.0/5
    Star Cast: అజ్మల్ అమీర్, ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే, బ్రహ్మనందం, అలీ, పృథ్వీ తదితరులు
    Director: సిద్దార్థ తాతోలు

    రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఎన్నో వివాదాలు, మరెన్నో ఉత్కంఠల మధ్య విడుదలైంది. చివరి క్షణం వరకు మిస్టరీగా మారిన విడుదల విషయం.. బుధవారం రాత్రికి వీడిపోయింది. ఇలా సినిమా విడుదలకు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే చిత్రం ఎట్టకేలకు నేడు (డిసెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుని విజయం సాధించిందా? లేదా? అన్నది చూద్దాం.

    కథ

    కథ

    ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుంది. అప్పటి వరకు పాలించిన వెలుగు దేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురవుతుంది. ఇక తన కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న బాబుకు గట్టి ఎదురెబ్బ తగులుతుంది. ఎలాగైనా మళ్లీ అధికార పీఠం ఎక్కాలని ఎత్తులు పైఎత్తులు వేస్తుంటారు. ఈ రాజకీయ రణరంగంలోని హత్యా రాజకీయాలతో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీఎస్ జగన్నాథ్ రెడ్డి (అజ్మల్ అమీర్)కు ఎదురైన సవాళ్లు, అధిగమించిన తీరు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు కథ.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వీడీపీ నేత ఎలాంటి ఎత్తుగడలు వేశాడు? అధికార పార్టీ అధ్యక్షుడు, నూతన ముఖ్యమంత్రి వీఎస్ జగన్నాథ్ రెడ్డి ఎలా ఎదిరించాడు? ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి వీడీపీ పన్నిన పన్నాగం ఏంటి? ప్రతి పక్ష పార్టీ ముఖ్య నేత దయనేని రమను హత్య చేసింది ఎవరు? ఈ కేసును విచారించడానికి వచ్చిన సిట్ అధికారి స్వప్న కుమారి, సీబీఐ ఆఫీసర్ గన్ రమేష్ కథ ఏంటి? మనసేన పార్టీ అధ్యక్షుడు ప్రణవ్ కళ్యాణ్, ప్రపంచ శాంతి పార్టీ అధ్యక్షుడు పీపీ జాల్ పాత్ర ఏంటి? అనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.

    ఫస్టాఫ్ అనాలిసిస్..

    ఫస్టాఫ్ అనాలిసిస్..

    అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌సీపీ పార్టీ, వీఎస్ జగన్నాథ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఘోర పరాజయాన్ని చవిచూసిన వీడీపీ నేతలు, బాబు, చిన్నబాబు దు:ఖించడం లాంటి సీన్లతో మొదలు కావడంతో కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా ఉంది. శాసనసభలో వీడీపీ నేతలు, పార్టీ అధినేత బాబుకు పరాభవం ఎదురవ్వడం, అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం, అసెంబ్లీ అంతా గందరగోళంగా మారడం లాంటి సీన్లు అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఓ వైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పాలనపై దృష్టి పెడుతూ ఉంటే.. ప్రతి పక్ష పార్టీ మాత్రం కూలగొట్టే ప్రయత్నాల్లో ఉండే సీన్లు కథను ముందుకు తీసుకెళ్తుంటాయి. రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించేందుకు, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షపార్టీ ముఖ్య నేత దయనేని రమ హత్యకు గురవ్వడంతో ప్రథమార్థం ముగుస్తుంది. రాజకీయ ఎత్తుగడలతో మొదలైన కథ.. ప్రథమార్థం ముగింపుకు మరింత ఆసక్తికరంగా మారుతుంది.

     సెకండాఫ్ అనాలిసిస్..

    సెకండాఫ్ అనాలిసిస్..

    దయనేని రమ హత్యతో అట్టుడికిన రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తడం, అధికార పార్టీపై విపక్ష నేతలు ఆరోపణలు చేయడం లాంటి సీన్లతో ద్వితీయార్థం మొదలవుతుంది. గంగవీటి భవాని (ధన్ రాజ్), ఓబుల్ రెడ్డిలకు ఈ హత్యలో భాగముందని సిట్ స్వప్న వారిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగడం లాంటి సీన్లతో కథ ముందుకు సాగుతోంది. ఎంతో సీరియస్‌గా సాగుతున్న ఈ కథలో గన్ రమేష్ ఎంటరవ్వడం, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, మళ్లీ పీపీ జాల్ ఎంట్రీ ఇవ్వడంతో కథలో ఆసక్తి తగ్గినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న సీరియస్‌నెస్ సెకండాఫ్‌లో మిస్ అయినట్టు అనిపిస్తుంది. మధ్యంతర ఎన్నికలు రావడం, మళ్లీ ప్రచార గోల మొదలవడంతో కథనం గాడి తప్పినట్టు అనిపిస్తుంది. చివరకు దయనేని రమ హత్యకు కారణమైన వారి గురించి తెలియడం, మధ్యంతర ఎన్నికల్లో వీఎస్ జగన్నాథ్ రెడ్డి 174 సీట్లను గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోవడంతో ద్వితీయార్థం ముగుస్తుంది. సెకండాఫ్‌లో ఇంకాస్త వేగాన్ని పెంచి, సీరియస్‌నెస్‌ను యాడ్ చేస్తే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది.

    నటీనటులు

    నటీనటులు

    ఈ కథలో ప్రతీ పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. తెరపై వారు కనిపించినా వెంటనే విజిల్స్, ఈలలు వేస్తుంటారు. తెరపై కనిపించే పాత్రల హావాభావాలు, రూపు రేఖలు రియల్ లైఫ్ క్యారెక్టర్లకు దగ్గరగా ఉండటంతో ఈజీగా ఓన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ చిత్రంలో వీఎస్ జగన్నాథ్ రెడ్డి పాత్రను పోషించిన అజ్మల్ అమీర్, బాబు పాత్ర, చినబాబు క్యారెక్టర్, చినబాబు ఆకాష్ భార్య రమణి, మనసేన పార్టీ, ప్రపంచ శాంతి పార్టీ అధినేతల క్యారెక్టర్స్ ప్రేక్షకులకు గుర్తుండి పోతాయి. వీఎస్ జగన్నాథ్ రెడ్డి, బాబు పాత్రలను పోషించిన వారు కళ్లతోనే నటించేశారు. వారి హావాభావాలు సైతం అందర్నీ ఆకట్టుకుంటాయి.అలీ, పృథ్వీ, స్వప్న, ధన్ ‌రాజ్, కత్తి మహేష్ లాంటి వారు కూడా తమ పరిధి మేరకు నటించారు.

     దర్శకుడి పనితీరు..

    దర్శకుడి పనితీరు..

    ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తీసుకుని, దానికి సినిమాటిక్‌ లిబర్టీ తీసుకుని అల్లిన కథనం, ఊహించి రాసుకున్న భవిష్యత్తు పరిణమాలు ఇలా అన్నింటిని జాగ్రత్తగా మలిచాడు దర్శకుడు. పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కించామని మొదటి నుంచి చెప్పుకొస్తున్న మేకర్స్.. రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను ప్రతిబింబించేలా చేయడంతో సఫలమయ్యారు. ప్రతీ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా, పాత్రలను తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ద్వితీయార్థాన్ని ఇంకాస్త బిగితో కూడిన కథనంతో నడిపిస్తే బాగుండేదేమోనని భావన ప్రేక్షకులకు కలగవచ్చు. సీరియాస్‌గా సాగుతుందని అనుకునే ప్రేక్షకులు నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది.

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రానికి వచ్చేసరికి సంగీతం ముఖ్యపాత్రను పోషించిందని చెప్పవచ్చు. మనుషుల స్వభావం, వారి ఆలోచనలు, వారి చేష్టలను నేపథ్య సంగీతంతోనే ప్రజెంట్ చేసేశారు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను, పాత్రల స్వభావాన్ని ఎలివేట్ చేసింది. సినిమాను అందంగా మలచడమే కాకుండా.. ఆర్జీవీ సినిమాల్లో ఉండే కొత్తదనం కూడా తన కెమెరా పనితనంలో చూపించేశాడు సినిమాటోగ్రఫర్. సెన్సార్ కత్తెరలకు గురి కావడంతో సినిమా అక్కడక్కడా అతుకుల బొంతలా అనిపించే అవకాశం ఉంది. దీంట్లో ఎడిటర్ తప్పేమీ లేదనిపిస్తోంది. ఆర్ట్ విభాగం, ఇతర సాంకేతిక నిపుణుల బృందం అందరూ తమ పరిధి మేరకు కృషి చేశారు.

    బలం బలహీనతలు

    బలం బలహీనతలు

    ప్లస్ పాయంట్స్

    నటీనటులు
    కథ
    సంగీతం

    మైనస్ పాయింట్స్
    ఆసక్తికరంగా లేని కథనం
    ద్వితీయార్థంలోని కొన్సి సీన్లు

    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    ఆర్జీవీ నుంచి ఆశించే అంశాలు అమ్మ రాజ్యంలో లేకపోయినా.. ఓవరాల్‌గా ఓకే అనిపిస్తుంది. మనం నిత్యం చూసే వ్యక్తులే తెరపై కనిపిస్తున్నారా? అని అనిపించేలా చేయడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    నటీనటులు :

    నటీనటులు :

    అజ్మల్ అమీర్, ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే, బ్రహ్మనందం, అలీ, పృథ్వీ తదితరులు
    దర్శకత్వం : సిద్దార్థ తాతోలు
    నిర్మాత : అజయ్ మైసూర్
    బ్యానర్ : టైగర్ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్
    మ్యూజిక్ : రవి శంకర్
    సినిమాటోగ్రఫి : జగదీష్ చీకటి
    ఎడిటింగ్ : అన్వర్ అలీ
    రిలీజ్ డేట్ : 2019-12-12
    రేటింగ్ : 2 /5

    English summary
    Amma Rajyamlo Kadapa Biddalu is an Telugu language Political Satire Drama written and directed by Siddhartha Thatholu. The film stars Ajmal Ameer, Dhanujay, Brahmanandam, Ali, Prudhvi. This movie released on December 12, 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X