twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాక్షన్‌, సెంటిమెంట్‌, ఓ అమ్మాయి

    By Staff
    |

    Ammananna O Tamil Ammayi
    -జలపతి
    చిత్రం: అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి
    నటీనటులు: రవితేజ, ఆసిన్‌, జయసుధ, ప్రకాష్‌ రాజ్‌
    సంగీతం: చక్రి
    కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌

    ఒక ఫైట్‌, ఒక సెంటిమెంట్‌ సీన్‌, ఒక పాట..మళ్లీ ఒక ఫైట్‌, ఒక సెంటిమెంట్‌ సీన్‌, ఒక పాట..మళ్లీ..ఇదీ క్లుప్తంగా ఈ సినిమా. ఫక్తు ఫార్ములా చిత్రం ఇది. ఇప్పుడు వస్తోన్న టీవీ సీరియల్స్‌ తరహా కథ, ఎనభైవ దశకం నాటి కథనానికి శ్యాంనాయుడు ఫోటోగ్రఫీ తళుకులు అద్ది వదిలిన సినిమా ఇది. ప్రకాష్‌ రాజ్‌ నటన, కొత్త అమ్మాయి ఆషిన్‌ అందం మినహా సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ 'ఎవరినో' ఉద్దేశించి ఈ సినిమా తీశాడు. ఆయన మారాలని, ప్రేక్షకులను ఇలా బలి చేయడం ఏమిటో!

    రవితేజ కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌. ఆయన తల్లి జయసుధ. లెక్చరర్‌. భర్త వదిలేసి వెళ్లిపోతాడు. తనే అన్ని అయి పెంచుతుంది. హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోతుంది. చనిపోయే ముందు 'నాన్న' ఎవరో చెప్పి అతని దగ్గరే ఉండుమని చెపుతుంది. నాన్న అంటే ఇష్టం లేని రవితేజ అమ్మ కోరిక మీద ప్రకాష్‌ రాజ్‌ వద్దకు వెళ్ళి ఉంటాడు. ప్రకాష్‌ రాజ్‌ ఆరుసార్లు జాతీయ స్థాయిలో కిక్‌ బాక్సింగ్‌ లో గెలిచిన వ్యక్తి. తన గోల్‌ కోసం పెళ్ళాం, పిల్లలను వదిలి వెళిన ప్రకాష్‌ రాజ్‌ - వైజాగ్‌ లో స్థిరపడి కోచ్‌ గా అవతరిస్తాడు.

    అక్కడే మరో ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. తన అత్యంత ఇష్టపడే శిష్యుడే వారసుడిగా ప్రకటిస్తాడు. ఆ శిష్యుడు తన కూతురికి కడుపు చేసి, ప్రకాష్‌ రాజ్‌ ను కాదని వేరే కోచ్‌ ను నియమించుకుంటాడు. అప్పుడు హీరోగారు...రంగంలోకి దిగి..కుటుంబం పరువు కాపాడి..బాక్సింగ్‌ ఛాంపియన్‌ గా అవతరించి..ప్రకాష్‌ రాజ్‌ కు 'బుద్ది' వచ్చేలా చేయడంతో కథ ముగుస్తుంది. మధ్యలో హీరోయిన్‌ తో ప్రేమాయణం, ఐదు పాటలు కూడా పాడుకుంటాడనుకొండి.

    రవితేజ అవసరం లేకపోయినా అతిగా అరవడం ఇంకా మానకపోవడం బాధకరం. జయసుధ ఈ సినిమాలో 'అతి మేకప్‌'తో ఎబ్బెట్టుగా కన్పిస్తుంది. ఆమె నటన గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన దృశ్యాలేవీ లేవు ఇందులో. ప్రకాష్‌ రాజ్‌ గెటప్‌, నటనే కాస్తా ఫర్వాలేదు. చక్రి సంగీతం మోస్తారు. శ్యాం.కె.నాయుడు ఫోటోగ్రఫీ బాగుంది. ఎం.ఎస్‌.నారయణ-అలీ-ఆల్ఫాన్సా కామెడీ ట్రాక్‌ మరీ ఛీఫ్‌ స్థాయిలో ఉంది. కూతురును వేశ్య చేసే తండ్రి, దానిపై కామెడీ ట్రాక్‌ చేయడం దర్శకుడు పూరీకి, రచయిత కోన వెంకట్‌ కే చెల్లింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X