twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయి బాగుంది

    By Staff
    |

    Ammayi Bagundi
    చిత్రం: అమ్మాయి బాగుంది
    నటీనటులు: శివాజీ, మీరాజాస్మిన్‌, తదితరులు
    సంగీతం: ఎం. ఎం.శ్రీలేఖ
    నిర్మాత: డి.దేవకుమార్‌రెడ్డి
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలశేఖరన్‌

    తమిళ చిత్రం 'పార్థిబన్‌ కనవు' అనే చిత్రానికి రీమేక్‌ శివాజీ, మీరాజాస్మిన్‌ నటించిన 'అమ్మాయి బాగుంది'. కథలో నవ్యత ఉంది. కానీ కథనంలో నవ్యత లోపించింది. 'మిస్సమ్మ' చిత్రంతో మంచి కామెడీ చేసే హీరోగా పేరు తెచ్చుకొన్న శివాజీ ఈ సినిమాలో ఫ్యామిలీ హీరోగా (జగపతిబాబు టైప్‌లో) నటించాడు. ప్రథమార్థం డల్‌గా సాగుతూ, సెకాంఢాఫ్‌లో మంచి ఉత్కంఠ రేపే ఈ చిత్రం యావరేజ్‌ చిత్రం అని చెప్పాలి. మీరాజాస్మిన్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాతో పోల్చితే, మాతృక 'పార్థిబన్‌ కనవు'లో స్నేహ నటనే బాగుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

    సినిమా ప్రధానంగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం. తమిళంలో సంగీతం, స్నేహ నటన వల్లే హిట్‌ అయింది. మీరా జాస్మిన్‌ బాగానే చేసినా, 'ఫీల్‌' లేదు. దర్శకుడు బాలశేఖరన్‌ గతంలో ప్రియమైన నీకు, స్నేహమంటే ఇదేరా వంటి చిత్రాలు చేసినప్పటికీ, ఆయనకంటూ ఓ స్టైల్‌ లేదు. కథను బట్టి ఒక ఫ్లోలో వెళ్ళే ఆయన చిత్రీకరణ తీరు మోస్తారుగానే ఉంది.

    కథ: శివాజీ ఓ అమ్మాయి(మీరా జాస్మిన్‌)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే, తండ్రి కోరిక మేరకు బలవంతంగా పెళ్ళిచూపులకు వెళితే, తను చూసిన అమ్మాయే పెళ్ళికూతురు కావడంతో వెంటనే ఒప్పుకుంటాడు. పెళ్ళి అయ్యాక, శివాజీకి తెలుస్తుంది, తను చూసిన అమ్మాయి తన భార్య కాదని, తన భార్యలానే ఉన్న మరో అమ్మాయి(మీరా జాస్మిన్‌) అని. శివాజీ ఉంటోన్న ప్లాట్‌ ఎదురు ఇంట్లోనే ఆ అమ్మాయి కూడా కొత్తగా దిగుతుంది. ఆమె కూడా శివాజీనీ ప్రేమిస్తుంది. ఇక మిగతా సినిమా హీరో డైలామాతోనే సాగుతుంది.

    కథ బాగుంది. కానీ సెకంఢాఫ్‌ చివర్లో ఉన్నంత ఉత్కంఠ సినిమాలో అంతటా లేదు. ఎం.ఎం.శ్రీలేఖ పేరుకే సంగీత దర్శకురాలు అన్ని పాటలను కాపీ చేసి వదిలినవే. మూడు పాటలను ఒరిజినల్‌ చిత్రం నుంచి తీసుకోగా, మిగతా రెండు ఇళయారాజా పాత పాటలు, కీరవాణి పాటలను 'రీమిక్స్‌' చేసింది. శివాజీ నటన ఒకే. మీరా జాస్మిన్‌ చూడడానికి బాగుంది. మోస్తారు చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X