twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబాయ్‌..పరమబోర్‌

    By Staff
    |

    Ammilu Abbailu
    -జలపతి
    చిత్రం: అమ్మాయిలు - అబ్బాయిలు
    నటీనటులు: విజయ్‌, మోహిత్‌, స్వప్నమాధురి, సోనూ సూద్‌,
    దేవిన, విద్య (అంతా కొత్త వాళ్లే) ప్లస్‌ అల్లరి టీం
    సంగీతం: చక్రి
    నిర్మాత: పి.కిరణ్‌
    రచన, దర్శకత్వం: రవిబాబు

    తొలి చిత్రం సంచలన చిత్రం రూపొందించిన ప్రతిదర్శకుడు మలి చిత్రం ప్రేక్షకులు భరించలేని చిత్రం రూపొందించాలని టాలీవుడ్‌ లో రూల్‌ ఉందేమో! అందుకే అల్లరి చిత్రం ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరుతెచ్చుకొన్న రవిబాబు - తేజ, పూరీ జగన్నాథ్‌, కరుణాకరన్‌..తదితరుల మాదిరిగా తన పైత్యాన్ని రెండో చిత్రంలో చూపించాడు. ఇటీవల కాలంలో వచ్చిన 'పిచ్చి చిత్రాల్లో' ఈ సినిమా పరాకాష్ట అని చెప్పవచ్చు.

    టీనేజీ యువతి యువకుల డైలమా గురించి సినిమా రూపొందించాలని భావించిన దర్శకుడు తనే ఏమీ చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డాడు. సినిమా ఆద్యంతం..(అదీ ఇంటర్వెల్‌ మధ్యలో ప్రేక్షకుడి లేచిపోకపోతే..) అయోమయమే. ఛీప్‌ డైలాగ్స్‌, సెక్స్‌ తప్ప ఇంకా ఏమీ ఆలోచన ఉండదన్నట్లుగా ప్రవర్తించే క్యారక్టర్స్‌, స్టూడియోలో వేసిన సెట్‌ లతో తీసిన ఇళ్ళు..అన్ని అవాస్తవికంగా ఉంటాయి.

    దర్శకుడి అవగాహనరాహిత్యం, పైత్యం ప్రతి ఫ్రేమ్‌ లోనూ కన్పిస్తుంది. ఇక ప్రతి పాటలోనూ..గమ్మత్తైన డ్రెస్సులు, టూత్‌ పేస్ట్‌ లు, నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌ సింబల్స్‌, ఆసుపత్రి డ్రెస్సులతో రకరకాలుగా చిత్రీకరించాడు. ఇంత వైల్డ్‌ ఇమాజినేషన్‌ ఎందుకో అర్థం కాదు. మళ్ళీ మధ్యలో ట్రైన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ లు..నిజంగా ఈ సినిమా చూడాలంటే ప్రేక్షకుడికి ఎంత బోర్‌ చిత్రాన్నైనా చూసే ఓపికన్నా ఉండాలి...జేబులో నిండుగా అమృతాంజన్‌ బాటిల్స్‌ ఐనా ఉండి ఉండాలి.

    కథ గురించి చెప్పడం శుద్ద దండగ. అంతా కొత్తవాళ్ళు నటించిన ఈ చిత్రంలో హీరోలు ఇద్దరూ బాగానే చేశారు. హీరోయిన్ల హాహభావాలు చూస్తే..తెలుగు సీరియల్స్‌ బెటర్‌ అన్పిస్తుంది. తెలుగు అమ్మాయి స్వప్నమాధురి బేతాళ సుందరిగా చూపించడంలోనే దర్శకుడి 'అతి' కన్పిస్తుంది. చక్రి అందించిన పాటలు వినడానికి బాగున్నా, సినిమాలో అవి అనవసరం. ఫోటోగ్రఫీ బాగుంది.ఇంగ్లీష్‌ సిట్‌ కామ్‌ ల మాదిరిగా స్టూడియో సెట్‌ లలో తీయడం వైవిధ్యమా?

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X