twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మో! ఒకటే బోర్‌

    By Staff
    |

    Ammo Okato Tariku
    చిత్రం: అమ్మో ఒకటో తారీఖు
    నటీనటులు: ఎల్బీ శ్రీరాం, శ్రీకాంత్‌, రాశి, సురేష్‌, గంగ
    సంగీతం:వందేమాతరం శ్రీనివాస్‌
    నిర్మాత: కె.చంద్రశేఖర్
    దర్శకత్వం: ఇవివి సత్యనారయణ

    కామెడీ చిత్రాలతో రంగప్రవేశం చేసిన ఇవివి సత్యనారాయణ హాస్యంతోనే సక్సెస్‌ సాధించాడు. అగ్రదర్శకుడిగా మారాడు. ఆ తర్వాత రూటు మార్చి జీవితానికి దగ్గరగా ఉండే చిత్రాలను తీసేందుకు పూనుకొన్నాడు. ఆ ప్రయత్నంలో తీసిన చిత్రమే- అమ్మో! ఒకటో తారీఖు. అయితే అరిగిపోయిన కథనే తీసుకొని రంగులు పూసి దానికి కొత్తదనం తేవాలని చేసిన ప్రయత్నం వికటించింది. ఎన్నో చిత్రాలకు సరుకుగా ఉన్న కథనే తీసుకొని స్క్రీన్‌ ప్లేలో కూడా నవ్యత లేకుండా తీసిన ఈ చిత్రం ద్వారా కొత్తగా ఇవివి చెప్పదలుచుకున్నదేమిటో అర్థంకాదు. కామెడీ షుగర్‌ కోట్‌ పూసి బాధాకరమైన మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించామని సినిమా విడుదలకు ముందు ఇవివి ప్రకటించారు. కానీ ఇందులో కామెడీ లేదు. షుగర్‌ కోట్‌ లేదు. మనకు తలనొప్పి తెచ్చుకోవడం తప్ప ఈ సినిమా చూసి పొందే ఆనందం ఏమీ ఉండదు.

    ఎల్బీశ్రీరాం మధ్యతరగతి జీవి. చేసేది డ్రైవర్‌ ఉద్యోగం. ఆయనకు ఒక భార్య. ముగ్గురు కూతుళ్ళు. ఒక పనీ చేయకుండా ఖాళీగా తిరిగే కొడుకు. కళ్ళచూపు సరిగా లేని నాన్న. విధవ చెళ్ళెలు. ఇంటిని ఒక్కడే లాగాలి. వచ్చేది మూడువేలే. సో అప్పులు కామన్‌. ప్రెషర్స్‌ సరేసరి. వీరు జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, చివరికి ఎలా సుఖంగా బతకాలో నేర్చుకోవడమే అమ్మో ఒకటో తారీఖు. అంతకన్నా మించి ఏమీ లేదు.

    మధ్యతరగతి జీవిగా ఎల్బీ శ్రీరాం నటన చాలా బావుంది. మిగతా నటులందరూ ఆయా పాత్రలను చక్కగా పోషించినా స్పెషల్‌ గా చెప్పుకోదగ్గ నటన ఏమీలేదు. దర్శకుడు ఇవివి సత్యనారయణ ఇలాంటి కథను ఎన్నుకొని ఏమీ చెప్పదలుచుకున్నారో తెలియదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X