twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మోరు తల్లి రివ్యూ అండ్ రేటింగ్.. నయనతార ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే!

    |

    Rating:
    2.5/5

    దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార ప్రత్యేక పాత్రలో తమిళ వినోద రంగంలో విశేషంగా అభిమానులను సంపాదించుకొన్న రేడియో జాకీ (ఆర్జే) బాలాజీ, ఊర్వశి, అజయ్ ఘోష్ నటించిన చిత్రం అమ్మోరు తల్లి. వాస్తవానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో దీపావళీ కానుకగా డీస్ని+హాట్ స్టార్ యాప్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార, ఆర్జే బాలాజీ ఎలా ఆకట్టుకొన్నారు? ఆర్జే బాలాజీ దర్శకుడిగా, నటుడిగా సక్సెస్ అయ్యారా అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    అమ్మోరు తల్లి కథ

    అమ్మోరు తల్లి కథ

    ఎంజెల్స్ రామస్వామి (ఆర్జే బాలాజీ) ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్. తండ్రి ఇంటి నుంచి పారిపోవడంతో ముగ్గురు చెల్లెల్లు, తల్లి, తాత పోషణ బాధ్యత తనపై పడుతుంది. ఇదిలా ఉండగా, భాగవతి బాబా (అజయ్ ఘోష్) దేవుడి పేరు చెప్పి 11 వేల ఎకరాలను ఆక్రమించుకొంటాడు. నకిలీ బాబా నిజస్వరూపం బయటపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎంజెల్స్ రామస్వామి ఎదుట ముక్కు పుడక అమ్మవారు (నయనతార) ప్రతక్ష్యమవుతారు.

    అమ్మోరు తల్లి కథలో ట్విస్టులు

    అమ్మోరు తల్లి కథలో ట్విస్టులు


    తండ్రి పారిపోవడంతో ఎంజెల్స్ రామస్వామికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? ఎంజెల్స్ రామస్వామి పెళ్లి కోసం ఏ విధంగా ప్రయత్నించాడు. ఏ పరిస్థితుల్లో ముక్కు పుడుక అమ్మవారు ఎందుకు ప్రత్యక్షమైంది? ఎంజెల్స్ రామస్వామి వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపింది? భాగవతి బాబా నకిలీ లీలలను ఎంజెల్స్ రామస్వామి ఎలా ఆటకట్టించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే అమ్మోరు తల్లి చిత్రం.

    అమ్మోరు తల్లి ఫస్టాఫ్ రివ్యూ

    అమ్మోరు తల్లి ఫస్టాఫ్ రివ్యూ


    ఎంజెల్ రామస్వామి ఫ్యామిలీ కష్టాలతో అమ్మోరు తల్లి చిత్రం కథ మొదలవుతుంది. పెళ్లిచూపులు లాంటి సీన్లు వినోదంతో సాగుతాయి. ఈ క్రమంలోనే తన వృత్తిలో భాగంగా బాబా భూ కబ్జాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతాడు. ఓ దొంగ ఆగడాలను అడ్డుకోకుండా దేవతలు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తాడు. ఇలాంటి సమయంలో తన కుల దేవత ముక్కు పుడక అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ఏం కావాలో కోరుకో అంటూ వరం ఇస్తుంది. దాంతో అతడి పరిస్థితి తలకిందులవుతుంది. అయితే తొలి భాగం అంతా వినోదానికే పెద్ద పీట వేయడంతో కథ ఆసక్తిగా సాగిపోతుంది.

    అమ్మోరు తల్లి సెకండాఫ్ రివ్యూ

    అమ్మోరు తల్లి సెకండాఫ్ రివ్యూ


    ఇక సెకండాఫ్‌లో అమ్మవారి అండతో నకిలీ బాబా ఆటలకు చెక్ చెప్పే కథను దర్శకులు భుజానికి ఎత్తుకొన్నాడు. అయితే నకిలీ బాబా ఆటలకు అడ్డుకంట్టే వేసేందుకు చేసే ప్రయత్నాల కోసం రాసుకొన్న సన్నివేశాలు పాత సినిమాల్లోని కొన్ని సీన్లు గుర్తు చేస్తాయి. దాంతో సినిమాపై ఉండే ఆసక్తి కొంత మేరకు తగ్గినట్టు కనిపిస్తుంది. కథ, కథనాల్లో ఉండే లోపాలను నయనతార తన నటనతో కనిపించకుండా చేయడం ఈ సినిమాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఓవరాల్‌గా పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో పెట్టినా.. ప్రేక్షకుడిని రెండు గంటలపాటు సీటులో అత్తుకుపోయి చూసేలా చేయడంలో దర్శకులు సఫలమయ్యారని చెప్పవచ్చు.

    దర్శకులుగా ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్

    దర్శకులుగా ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్


    అమ్మోరు తల్లి చిత్రానికి ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్ దర్శకులు. పాత పాయింట్‌నే కొత్తగా ప్రజెంట్ చేయాలనే తపన కనిపించింది. ఈ సినిమాకు నయనతారను ఎంచుకోవడం అదనపు ఆకర్షణ, ఆర్జే బాలాజీ కామెడీ టచ్‌తోపాటు నయనతార ఎమోషనల్ టచ్ సినిమాకు ప్రత్యేకంగా మారింది. ఈ కథకు సంబంధించి ఏదైనా కొత్త ఎత్తుగడ ఎత్తుకొంటే అమ్మోరు తల్లి చిత్రం డెఫినెట్‌గా మంచి చిత్రంగా మారి ఉండేది. బలమైన సన్నివేశాల కొరత స్పష్టంగా కనిపించింది. అజయ్ ఘోష్ పాత్రను మరింత బలంగా మార్చి ఉంటే ఫలితం మరింత బెటర్‌గా ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.

    నయనతార, ఆర్జే బాలాజీ ఫెర్ఫార్మెన్స్

    నయనతార, ఆర్జే బాలాజీ ఫెర్ఫార్మెన్స్

    నయనతార మరోసారి మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకువ వచ్చింది. అమ్మవారిగా ఆమె లుక్, హావభావాలు ఆకట్టుకోవడం గ్యారెంటీ. పాత్ర కోసం చెప్పిన డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. నయనతార కెరీర్‌లో ఈ పాత్ర బెస్ట్‌గా నిలుస్తుంది. ఇక ఆర్జే బాలాజీ టెలివిజన్ రిపోర్టర్‌గా ఆకట్టుకొన్నారు. నయనతార తర్వాత సినిమా బరువు, బాధ్యతను పూర్తిగా తన భుజాలపై మోసాడని చెప్పవచ్చు. నటనపరంగా బాడీ లాంగ్వేజ్ సవరించుకొంటే బెస్ట్ కమెడియన్ కమ్ హీరోగా మారే అవకాశం ఉంది.

    తల్లిపాత్రలో మెరిసిన ఊర్వశి, విలన్‌గా అజయ్ ఘోష్

    తల్లిపాత్రలో మెరిసిన ఊర్వశి, విలన్‌గా అజయ్ ఘోష్


    మిగితా పాత్రల్లో ఊర్వశి మరోసారి తల్లిపాత్రలో మెరిసింది. ఇప్పటికీ ఆకాశం నీ హద్దురా చిత్రంలో తల్లిగా అదరగొట్టిన ఊర్వశి.. అమ్మోరు తల్లి చిత్రంలో కూడా భేష్ అనిపించింది. బరువైన పాత్రను అవలీలగా పోషించింది. నలుగురు పిల్లల తల్లిగా, భర్తకు దూరమైన భార్య రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకొన్నది. ఇక అజయ్ ఘోష్‌కు మరో మంచి పాత్ర లభించింది. ఎప్పటిలానే తన హావభావాలతో ఆకట్టుకొన్నారు. పాత్రపరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. తనదై నటనతో మరోస్థాయికి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. మిగితా పాత్రల్లో వారి పరిధి మేరకు ఒకే అనిపించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు


    ఇక సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ సినిమాకు బలంగా మారాయి. గిరీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫి ఆకట్టుకొన్నది. పల్లెటూరు వాతావరణాన్ని కెమెరాలో ఆహ్లదకరంగా చూపించడంలో సఫలమయ్యారు. ఆర్కే సెల్వ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత ఇషారీ కే గణేష్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    Recommended Video

    Tollywood Actors Who Played As Devotees || Telugu Devotional Movies
    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    నకిలీ బాబా భూకబ్జాలు, అరాచకాలపై సినిమా తెరపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. గోపాలా గోపాలా, హిందీలో పీకే లాంటి సినిమాలు ఈ చిత్రానికి స్పూర్తిగా నిలిచాయనే చెప్పవచ్చు. తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని విషయం. నయనతార నటన ఈ సినిమాకు ఎస్సెట్. ఆర్జే బాలాజీ నటన, దర్శకత్వ ప్రతిభ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దీపావళీ పండుగ, వీకెండ్‌లో ఫ్యామిలీతోపాటు ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు.

    English summary
    Ammoru Thalli movie review: Ammoru Thalli is a Tamil dubbing devotional comedy film directed by RJ Balaji and N. J.Saravanan. The former also wrote the script and stars alongside Nayanthara. It is released on Disney+ Hotstar on 14 November 2020, during the occasion of Diwali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X