Anaconda Movie Review: అనకొండ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.5/5

నటీనటులు: పాల్ రడ్, జాక్ బ్లాక్, స్టీవ్ జాన్, థాండివీ న్యూటన్, డేనియల్ల మెల్చాయిర్, సెల్టాన్ మెల్లో, ఐస్ క్యూడ్ తదితరులు
రచన, దర్శకత్వం: టామ్ గోర్మికన్
నిర్మాతలు: బ్రాడ్ ఫ్యుల్లర్, ఆండ్రీ ఫార్మ్
సినిమాటోగ్రఫి: నిగెల్ బ్లక్
ఎడిటింగ్: క్రెయిగ్ అల్పర్ట్, గ్రెగరీ ప్లాకిన్
మ్యూజిక్: డేవిడ్ ఫ్లెమింగ్
రిలీజ్ డేట్: 2025-12-25

బాల్యమిత్రులు డౌగ్ మెక్‌కాలిస్టర్, రొనాల్డ్ గ్రిఫిన్, కెన్నీ ట్రెంట్, క్లెయిరీ సైమన్స్ తమ ప్రొఫెషనల్ లైఫ్‌ గురించి తీవ్ర నిరాశ, అసంతృప్తితో ఉంటారు. అలాంటి సమయంలో రొనాల్డ్ గ్రిఫ్ తన ఫేవరేట్ ఫిల్మ్ అనకొండను రూపొందించడానికి హక్కులు లభించాయి అంటూ శుభవార్త చెబుతాడు. తక్కువ బడ్జెట్‌తో సినిమాను రూపొందించడానికి అమెజారన్ రెయిన్ ఫారెస్ట్‌కు ప్రయాణవుతారు. షూటింగ్ సమయంలో పామును ప్రమాదవశాత్తు గ్రిఫ్ చంపుతాడు. దాని స్థానంలో మరో పామును రిప్లేస్ చేయడానికి అడవిలో వేట ప్రారంభిస్తారు. అలాంటి సమయంలో భారీ అనకొండ దాడి చేస్తుంది. ఆ తర్వాత గ్రిఫ్ బృందం సినిమాను పూర్తి చేసిందా? చనిపోయిన పాము స్థానంలో మరో స్నేక్‌ను ఎలా సంపాదించారు? అనకొండ దాడి నుంచి ఎలా తప్పించుకొన్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

Anaconda Movie Review

అనకొండ మూవీ కథ, కథనాలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. 1997 సంవత్సరంలో వచ్చిన చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా రూపొందించారు. ఈ చిత్రంలో సినిమా నిర్మాణం, బిజినెస్‌పై సెటైర్లు వేస్తూ సరదాగా సాగిపోతుంది. ఈ సినిమాలోని సన్నివేశాల్లోని వినోదం ఆడియెన్స్‌కు మంచి అనుభూతిని పంచేలా స్క్రిప్ట్ డిజైన్ చేశారు. దర్శకుడు టామ్ గోర్మియకన్ అనుసరించిన స్క్రీన్ ప్లే, డిజైన్ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయి. ఫస్టాఫ్ సరదాగా సాగిపోగా, సెకండాఫ్‌లో ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలతో గ్రిప్పింగ్‌గా ఉంటుంది.

ఇక ఈ సినిమాలో నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. డౌగ్ మెక్కాలిస్టర్‌గా జాక్ బ్లాక్, రొనాల్డ్ గ్రిఫిన్‌గా పాల్ రుడ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. పలు సన్నివేశాల్లో బెస్ట్ ఎమోషన్స్‌తో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగితా పాత్రల్లో స్టీవ్ జాన్, న్యూటన్, క్లేయిర్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. అనకొండ ట్రైనర్‌‌ సాంటియాగో పాత్రలో సెల్టాన్ మెల్లో నటన స్పెషల్ ఎట్రాక్షన్.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఎంచుకొన్న లొకేషన్లు, ఉపయోగించిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హైలీ టెక్నికల్‌గా ఉన్నాయి. తెర మీద కొన్ని సీన్లు మెస్మరైజ్ చేసే విధంగానే కాకుండా భయపెట్టేలా ఉండటం ఆడియెన్స్‌కు రియల్ థ్రిల్స్ అందించాయి. నెగిల్ బ్లాక్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు హైలెట్. ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు డెవిడ్ ఫ్లెమింగ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ సినిమాకు పాటించిన నిర్మాణ విలువలు ఉన్నత ప్రమాణాలను చాటిచెప్పాయి.

అనకొండ గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఉన్నత ప్రమాణాలతో వినోదం, ఫన్ ఎలిమెంట్స్‌ టార్గెట్‌గా రూపొందించిన హై ఎండ్ యాక్షన్ థ్రిల్లర్. జాక్ బ్లాక్, పాల్ రుడ్ లాంటి నటీనటుల యాక్టింగ్, సాంకేతిక నిపుణులు టాలెంట్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. యూత్‌కు, అనకొండ మూవీ ఫ్యాన్స్‌కు ఈ సినిమా పండుగ రోజున ఫుల్ మీల్స్ లాంటింది. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్.

More from Filmibeat

Read more about: anaconda paul rudd review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X