Anaganaga Movie Review: అనగనగా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరీ, మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, బీవీఎస్ రవి తదితరులు
దర్శకత్వం: సన్నీ సంజయ్
నిర్మాతలు: రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్ర మాదిరెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: చందు రవి
సినిమాటోగ్రఫి: పవన్ పప్పుల
ఎడిటర్: వెంకటేశ్ చుండూరు
ఓటీటీ రిలీజ్: ఈటీవీ విన్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-05-15

కార్పోరేట్ స్టైల్ విద్యను వ్యతిరేకిస్తూ సంప్రదాయ పద్దతుల ద్వారా విద్యను బోధించాలనే విజన్ ఉన్న స్కూల్ టీచర్ వ్యాస్ (సుమంత్). భార్య భాగ్యలక్ష్మీ (కాజల్ చౌదరీ)తో కలిసి కార్పోరేట్ స్కూల్ (అవసరాల శ్రీనివాస్ నిర్వహించే) లో టీచర్లుగా పనిచేస్తుంటారు. విద్యార్థుల భవిష్యత్‌కు మార్కులే పరమావధి కాదు అని భావించే వ్యాస్, తన భార్య, అలాగే స్కూల్ మేనేజ్‌మెంట్ ఆగ్రహానికి గురి అవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా స్కూల్ ప్రారంభించి.. తనకు ఇష్టమైన విధానంలో విద్యను బోధించేందుకు సిద్దమవుతాడు. ఈ క్రమంలో వ్యాస్‌కు క్యాన్సర్ వ్యాధి సొకిందని తెలుస్తుంది.

Anaganaga Movie Review

కార్పోరేట్ విద్యను వ్యాస్ ఎందుకు వ్యతిరేకించాడు? తక్కువ మార్కులు వచ్చే విద్యార్థులకు పాఠాలు ఎలా బోధించాలని అనుకొన్నాడు? మార్కులే ప్రమాణంగా భావించే స్కూల్ మేనేజ్‌మెంట్ వ్యాస్‌పై ఎలాంటి చర్యలు తీసుకొన్నది? వ్యాస్ ఎందుకు స్కూల్ ప్రారంభించాలని అనుకొన్నాడు? సొంతంగా స్కూల్‌ను ఏ పరిస్థితుల్లో మొదలుపెట్టాడు? క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలుసుకొన్న వ్యాస్ రియాక్షన్ ఏమిటి? వ్యాస్‌కు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత భార్య పరిస్థితి ఏమిటి? తన చిరకాల కోరికైన ఇతిహాస్ పుస్తకాన్ని వ్యాస్ ప్రచురించాడా? క్యాన్సర్ వ్యాధిని వ్యాస్ జయించాడా? వ్యాస్ జీవితానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే అనగనగా సినిమా కథ.

ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ అంటే రక్తపాతం, మితి మీరిన హింస, అవసరం లేని యాక్షన్ సీన్ల అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అలాంటి పరిస్థితుల్లో ప్రతీ కుటుంబాన్ని ఆలోచింపజేసే విధంగా దర్శకుడు సన్నీ సంజయ్ రూపొందించారు. అలాగే సమాజంలో విద్య బోధనపై నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వచ్చిన క్లీన్ అండ్ ఫ్యామిలీ మూవీ అని చెప్పవచ్చు. విద్య వ్యవస్థలోని లోపాలు, విద్యా బోధనలో ఉండే వైపరీత్యాలపై సున్నితంగా సెటైర్ వేస్తూ దర్శకుడు రాసుకొన్న కథ భావోద్వేగానికి గురించి చేస్తుంది. సమాజాన్ని ఆలోచింప చేస్తుంది. 3 ఇడియట్ లాంటి సినిమాలను గుర్తు చేస్తుంది.

వ్యాస్‌ అనే టీచర్ పాత్రలో సుమంత్ మరోసారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. భర్తగా, తండ్రిగా, విద్యార్థుల భవిష్యత్‌పై ఆవేదన చెందే టీచర్‌గా రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన పరకాయ ప్రవేశమే చేశాడని చెప్పాలి. ఇక సుమంత్‌తో పోటీ పడుతూ మాస్టర్ విహర్ష్ తన వయసుకు మించిన ప్రతిభను చాటుకొన్నాడు. వీరిద్దరూ కలిసి ప్రేక్షకులను కొన్ని సందర్భాల్లో కంటతడి పెట్టించేంతగా నటించారు. కాజల్ చౌదరీ, అవసరాల శ్రీనివాస్, బట్ట అంకుల్‌గా నటించిన నటుడు ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

అనగనగా సినిమాకు నటీనటులు ప్రతిభే కాకుండా సాంకేతిక విభాగాల పనితీరు కూడా బలంగా మారింది. ఈ సినిమాకు సంభాషణలు చాలా క్లీన్‌గా ఉన్నాయి. ఎలాంటి అసభ్యత, అశ్లీలతకు తావు లేకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా కనిపిస్తుంది. చందు రవి మ్యూజిక్, పవన్ పప్పుల సినిమాటోగ్రఫి ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. వెంకటేశ్ ఎడిటింగ్ టాలెంట్ కూడా సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్ర మాదిరెడ్డి
అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్‌ బ్యాక్ డ్రాప్‌తో రూపొందించిన చిత్రం అనగనగా. సుమంత్, మాస్టర్ విహర్ష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. కాజల్, అవసరాల శ్రీనివాస్, బీవీఎస్ రవి తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. ఊహించే విధంగా సినిమా కథ ఉండటం వల్ల అంతగా థ్రిల్లింగ్ అనిపించదు. స్లో నరేషన్ కొంత మైనస్. కంటెంట్‌ సినిమాటిక్ లిమిటేషన్‌ను తప్పించుకోలేకపోవడం రొటీన్‌గా అనిపిస్తుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నది. తీరిక వేళలో తగినంత సమయాన్ని కేటాయించి ఈ సినిమాను చూడండి.. ఈ మూవీ హృదయాన్ని భారంగా మార్చడమే కాకుండా ఎమోషనల్‌గా మార్చేస్తుంది.

More from Filmibeat

Read more about: sumanth Kajal Chowdary Anaganaga
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X