For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనగనగా ఓ అతిథి మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. పాయల్ రాజ్‌పుత్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..

  |

  Rating:
  2.5/5
  Star Cast: పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి, వీణా సుందర్ నల్ల వేణు
  Director: దయాళ్ పద్మనాభన్

  లాక్‌డౌన్‌ కాలంలో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచడానికి వచ్చిన మరో చిత్రం అనగనగా ఓ అతిథి. కన్నడలో విజయవంతమై అవార్డులు గెలుచుకొన్న కరాళ రాత్రి చిత్రాన్ని తెలుగులోకి అనగనగా ఓ అతిథిగా తెరకెక్కించారు. పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి, వీణా సుందర్ తదితరులు నటించారు. నవంబర్ 20వ తేదీన ఆహా యాప్ ద్వారా తెలుగులోకి వచ్చిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయాన్ని తెలుసుకొందాం.

  అనగనగా ఓ అతిథి కథ

  అనగనగా ఓ అతిథి కథ

  వ్యవసాయం, కూలీ పనులు చేసుకొనే పేద దంపతులు (ఆనంద చక్రపాణి, వీణా సుందర్) కూతురు మల్లిక (పాయల్ రాజ్‌పుత్). వయసు పైబడుతున్నా పెళ్లి కాకపోవడంతో బతుకుపై ఓ రకమైన నిరాశ, నిస్పృహలు జీవిస్తుంటుంది. మగాళ్లంటే చులకన భావం ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ల ఇంటికి అతిథిగా చిన్నికృష్ణ అలియాస్ శ్రీనువాస్ (చైతన్య కృష్ణ) వస్తాడు. చిన్ని కృష్ణ వద్ద బంగారం, డబ్బు ఉండటంతో అత్యాశ, దురాశగా మారుతుంది.

  అనగనగా ఓ అతిథిలో ట్విస్టులు

  అనగనగా ఓ అతిథిలో ట్విస్టులు

  పాయల్ రాజ్‌పుత్‌కు వివాహం జరగడకపోవడానికి కారణాలేంటి? చిన్నికృష్ణ మల్లిక ఇంటికే అతిథిగా ఎందుకు వచ్చారు. చిన్నికృష్ణ వద్ద ఉన్న డబ్బు, నగలు చూసిన మల్లిక కుటుంబంలో ఎలాంటి ఆశపుట్టింది. తమలో పుట్టిన ఆశ, దురాశగా ఎందుకు మారింది. చివరకు మల్లిక ఇంటిలో చిన్నికృష్ణకు ఎలాంటి అనుభవం ఎదురైంది అనే ప్రశ్నలకు తెరపైన సమాధానమే అనగనగా ఓ అతిథి కథ.

  అనగనగా ఓ అతిథి ఎలా ఉన్నాడంటే...

  అనగనగా ఓ అతిథి ఎలా ఉన్నాడంటే...

  ఆశ, అత్యాశ, దురాశ అనే అంశాల గురించి తెలియజెప్పే ఓ ఫీల్‌గుడ్ పాయింట్‌తో కథ మొదలవుతుంది. మల్లిక మనసులో కోరికలు, కుటుంబ పరిస్థితుల గురించి సన్నివేశాలు భావోద్వేగంగా కొనసాగడంతో సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక చిన్నికృష్ణ అతిథిగా మల్లిక ఇంట్లో అడుగుపెట్టాక డ్రామా మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కొన్ని సీన్ల ద్వారా ప్రేక్షకుల చిన్న చిన్న ట్విస్టులు ఇస్తూ కథను పలు మలుపుతిప్పుతూ ప్రథమార్థాన్ని ఎమోషనల్‌గా మార్చారు. ఇక రెండో భాగంలో పాత్ర మధ్య జరిగే సంఘర్షణ సినిమాకు హైలెట్‌గా మారుతాయి. క్లైమాక్స్‌లోని ఓ ట్విస్టు కథను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. దాంతో ప్రేక్షకుడు మంచి ఫీలింగ్‌తో రావడానికి అవకాశం ఏర్పడుతుంది.

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడి ప్రతిభ

  కన్నడలో కరాళ రాత్రి చిత్రంతో అవార్డులను, భారీ కలెక్షన్లను దర్శకుడు దయాళ్ పద్మనాభన్ అందుకొన్నారు. కన్నడ రీమేక్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు ఉంచారు. ఓ ఇంటెన్సివ్ కథకు తగినట్టుగా పాత్రధారులను, సాంకేతిక నిపుణులను ఎంచుకోవడంతోనే సగం సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. నటీనటుల నుంచి నటనను రాబట్టుకొన్న తీరు అతని ప్రతిభకు అద్దం పట్టింది. చివరి 20 నిమిషాల చిత్రం ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేయడంలో దర్శకుడు పై చేయి సాధించారని చెప్పవచ్చు.

  పాయల్ రాజ్‌పుత్ పెర్ఫార్మెన్స్

  పాయల్ రాజ్‌పుత్ పెర్ఫార్మెన్స్

  RX 100, RDX లవ్, డిస్కో రాజా సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకొన్న పాయల్‌కు మల్లిక పాత్రతో మంచి ఫెర్ఫార్మర్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకోవడం ఖాయం. మల్లిక పాత్ర ద్వారా పాయల్ అద్బుతమైన హావభావాలను పలికించారు. పలు రకాల వేరియేషన్స్‌ను పలికించే పాత్రను చాలా సులభంగా చేసిందేనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక జోహర్ సినిమా తర్వాత చైతన్య కృష్ణ మరో చక్కటి రోల్‌లో కనిపించారు. ఎమోషన్స్ పలికించే పాత్రలో జీవించాడని చెప్పవచ్చు.

  చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి నటన

  చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి నటన

  ఇక మిగితా పాత్రల్లో పాయల్‌కు తండ్రిగా ఆనంద చక్రపాణి అద్భుతంగా రాణించారు. పేద రైతుగా, కూలీగా, తాగుబోతు భర్తగా, కన్నకూతురికి పెళ్లి చేయలేని అసహాయ తండ్రిగా ఇలా పలు కోణాలు ఉన్న పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పవచ్చు. మల్లేశం తర్వాత అంతకంటే గొప్ప పాత్రను పోషించడమే కాకుండా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచాడని చెప్పవచ్చు. ఇక వీణా సుందర్ తల్లి పాత్రలో జీవించారనే చెప్పవచ్చు. సున్నితమైన భావాలను కళ్లతో పలికించిన విధానం ఆకట్టుకొంటుంది. ఆనంద్ చక్రపాణి, వీణా సుందర్ పాత్రలు సినిమాకు బలంగా మారాయని చెప్పవచ్చు. నల్ల వేణు పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ.. కథకు కీలకంగా మారింది.

  టెక్నికల్ విభాగాల పనితీరు

  టెక్నికల్ విభాగాల పనితీరు


  ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు కాశీ నడింపల్లి రాసిన మాటలు ప్రధాన ఆకర్షణ. కొన్ని సీన్ల కోసం ఆయన రాసిన మాటలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇక ఇంటి సెట్ వేసిన విఠల్ కోసనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కథను, యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌ను మరింత ఎలివేట్ చేయడానికి ఆర్ట్ విభాగం పనితీరు మరింత దోహదపడిందని చెప్పవచ్చు. రాకేశ్ బీ సినిమాటోగ్రఫి, ఆయన వాడుకొన్న లైటింగ్ పాత్రల మూడ్‌ను స్పష్టంగా తెరమీద కనిపించేలా చేసింది. గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా కెమెరాలో బంధించారని చెప్పవచ్చు. ట్రెండ్ లౌడ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా


  అనగనగా ఓ అతిథి చిత్రం విషయానికి వస్తే.. కథ బలంగా మారితే.. కథనం కాస్త నెమ్మదించడం కొంచెం ఇబ్బందిని కలిగించే అంశం. ఇక కథంతా ఒకే ట్రాక్‌లో సాగడం, కథలో సీరియస్ ఎలిమెంట్స్ మోతాదు మించడం వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు కాస్త పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఆర్ట్ ఫిలిం ఛాయలు ఎక్కువగా ఉండటం వల్ల రెగ్యులర్ ఆడియెన్స్‌కు రుచించకపోవచ్చు. ఇక కొన్ని పాత్రల డబ్బింగ్ ప్రధాన లోపంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇలాంటి లోపాలన్నింటిని నటీనటుల పెర్పార్మెన్స్ సవరించడం ఉపశమనంగా అనిపిస్తుంది. సీరియస్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా బ్రహ్మండంగా నచ్చుతుంది. కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను ఆశించే వారికి ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ను దర్శకుడు దయాళ్ పద్మనాభన్ కల్పించడం ఖాయం.

  తెరవెనుక, తెర ముందు

  తెరవెనుక, తెర ముందు


  నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి, వీణా సుందర్ నల్ల వేణు తదితరులు
  నిర్మాతలు: రాజా రామమూర్తి, చిదంబరం నడేసన్
  దర్శకత్వం: దయాళ్ పద్మనాభన్
  ఆర్ట్: విఠల్ కోసనం
  మాటలు: కాశీ నడింపల్లి
  సినిమాటోగ్రఫి: రాకేశ్ బీ
  సంగీతం: అరోల్ కోరేలి
  బ్యానర్: ట్రెండ్ లౌడ్
  రిలీజ్ డేట్: 2020-11-20
  ఓటీటీ రిలీజ్: ఆహా యాప్

  English summary
  Anaganaga O Athidhi is a telugu movie which is highly intensive story narrated by Dayal Padmanabhan. This movie is based on Kannada movie Karala Ratri. This remake movie released on November 20th on Aha app.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X