Anaganaga Oka Raju First Review: అనగనగా ఒక రాజు మూవీ ఫస్ట్ రివ్యూ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ హీరో, హీరోయిన్లు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం అనగనగా ఒక రాజు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడిగా మారి పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటర్‌గా, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం జనవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రాన్ని ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేశారు. ఈ సినిమా గురించి సెన్సార్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏమిటి? ఈ మూవీకి జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండుగ ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని ఈ చిత్రం పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో ముఖ్యంగా గోదావరి జిల్లాల కథాంశంతో పూర్తిస్థాయి వినోదంగా తెరకెక్కింది. ఈ చిత్రం ప్రమోషన్స్ వైవిధ్యంగా జరుగుతూ ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రమే కాకుండా క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ క్రమంలో ఈ సినిమాను సెన్సార్ అధికారులు సమీక్షించారు. ఈ రివ్యూ సందర్భంగా కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌లో స్వల్ప మార్పులు సూచించారు. అందుకు స్పందనగా చిత్ర యూనిట్ వాటికి మార్పులు చేర్పులు చేసి వారి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఈ సినిమాపై సెన్సార్ అధికారులు పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.
అనగనగా ఒకరాజు సినిమా వీక్షించిన తర్వాత పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ అందించారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకొని నిర్మించిన ఈ చిత్రానికి సెన్సార్ యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. 16 సంవత్సరాలు నిండిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ సినిమాను చూడొచ్చు. 16 ఏళ్లకు దిగువన ఉన్న ప్రేక్షకులు వారి తల్లిదండ్రుల సంరక్షణలో వీక్షించాల్సి ఉంటుందనే నిబంధనను సెన్సార్ సర్టిఫికెట్‌లో తెలిపారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్‌కు స్కోప్ ఎక్కువగా కనిపించారు. కథాపరంగా గొప్పగా ఉండకపోయినా.. కథనం, క్యారెక్టర్లు, వాటి చుట్టూ ఉండే సన్నివేశాలు ఆద్యంతం నవ్విస్తాయి. పంచ్ డైలాగ్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. నవీన్ పొలిశెట్టి యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, మీనాక్షి చౌదరీ గ్లామర్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి.
ఇలాంటి సినిమాలో ల్యాగ్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాం. ఈ సినిమా నిడివి పెంచకుండా క్రిస్పీగా కట్ చేశారు. ఈ చిత్రం నిడివి 2 గంటల 20 నిమిషాలు అంటే.. 140 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశాం అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్, రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











