Anaganaga Oka Raju Twitter Review: అనగనగా ఒక రోజు ట్విట్టర్ రివ్యూ

టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం అనగనగా ఒక రాజు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడిగా మారి పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటర్‌గా, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం జనవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ప్రమోషనల్ కంటెంట్ మూవీపై భారీ క్రేజ్ పెంచింది. ఈ క్రమంలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Anaganaga Oka Raju Twitter Review

అనగనగా ఒక రాజు సినిమా చూశాను. హానెస్ట్ ఎమోషన్స్‌తో తెరకెక్కించిన కామెడీ చిత్రం. సింపుల్ స్టోరీ, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. లీడ్ యాక్టర్ల పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఫస్టాఫ్ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్. సెకండాఫ్ కొంత స్లోగా ఉంది. కానీ ఈ సినిమా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఓవరాల్‌గా ఈ సినిమా క్లీన్ ఎంటర్‌టైనర్. నా రేటింగ్ 3/5 అని నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.


ఫస్టాఫ్ చూస్తుంటే కామెడీతో పిచ్చెక్కించారు. నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో. కామెడీ సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. మిక్కి జే మేయర్ అందించిన సాంగ్స్, మ్యూజిక్ చాలా బాగున్నాయి అని నెటిజన్ కామెంట్ చేశాడు.

అనగనగా ఒక రాజు సినిమా ఫస్టాఫ్ పూర్తయింది. ఈ సంక్రాంతి రాజు గారిదే. ప్రాపర్ పండుగ హడావిడి ఉంది స్క్రీన్ మీద. నవీన్ పొలిశెట్టి నువ్వు వైబ్ బ్రో, నువ్వు వైబ్ బ్రో, మీనాక్షి చౌదరీ నీవు బ్యూటీఫుల్. కామెడీ ట్రాక్ చాలా బాగున్నాయి. ఆర్గానిక్‌గా కామెడీ ఉంది. ఆడియెన్స్ ఫుల్లుగా కనెక్ట్ అవుతారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

అనగనగా ఒక రాజు వర్త్ వాచింగ్. పెట్టిన ప్రతీ పైసా కి సంతృప్తి లభిస్తుంది. క్లంప్లీట్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్. నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు. కామెడీ సినిమాలో నిన్ను కొట్టేవాడు లేడు లే. సంక్రాంతి విన్న అనగనగా ఒక రాజు. టీమ్‌కు కంగ్రాట్యులేషన్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫస్టాప్ చాలా బాగుంది. నవీన్ పొలిశెట్టి నవ్వులతో ముంచెత్తాడు. భీమవరం బాల్మా పాట బాగుంది. బుల్లిరాజు, తారక్ పొన్నప్ప పాత్రలు ఈ సినిమాలో బాగున్నాయి. చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, పొలిశెట్టి కామెడీ బాగా వర్కవుట్ అయింది. ఇదే టెంపో మెయింటేన్ చేస్తే ఈ సినిమా హిట్ అవ్వడం గ్యారెంటీ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ సందర్భంగా నా డియరెస్ట్ ఫ్రెండ్ నవీన్ పొలిశెట్టికి బెస్ట్ విషెస్. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. మేము కలిసిన ప్రతీసారి నన్ను, మా స్నేహితులను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. ఈ సంక్రాంతి పండుగ సమయంలో తన సినిమాతో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాడు అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

ఇన్‌సైడ్ రిపోర్టు ప్రకారం.. యువ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమాకు పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. ఈ రోజు ప్రదర్శించే ప్రీమియర్ల తర్వాత ఈ సినిమా రియల్ రిజల్ట్ క్లియర్‌గా తెలుస్తుంది. చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో పాటు ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో రియల్ విన్నర్‌గా నిలుస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అనగనగా మూవీ కేవలం రిలీజ్ మాత్రమే కావడం లేదు. రెండేళ్లుగా చూపిస్తున్న ప్రేమ, ఇష్టం, బాధ, గర్వం, మాస్, సోల్ రూపం ఇది. ఈ సినిమా కంటెంట్ మీ చేత కేకలు వేయిస్తుంది. స్క్రీన్లపై మెరుపులు మెరిపిస్తుంది. మిమ్మల్ని ఆస్వాదించేలా చేస్తుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X