ఫర్వాలేని చిత్రం

By Staff

Anandamanandamaye
చిత్రం: ఆనందమానందమాయే
నటీనటులు: ఆకాష్‌, రేణుక(తొలిపరిచయం), జెడి చక్రవర్తి, ప్రీతి జింగ్యానీ, తదితరులు
సంగీతం: కోటి
నిర్మాత: రామోజీరావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల

ఇది ఫీల్‌గుడ్‌ చిత్రం. కథ కొత్తది కాకపోయినా, ఇంట్రెస్టింగ్‌ పాయింటే. ఐతే, ఇంటర్వెల్‌కు కొద్ది నిమిషాల ముందు వరకు సినిమా ఏమిటో అర్థం కాదు. ఇంటర్వెల్‌ నుంచి మరో అరగంట వరకు దర్శకుడు బాగా తీశాడు. మళ్ళీ చివర్లో సినిమాను సాగదీశాడు. అందమైన లోకేషన్లలో సింపుల్‌గా తీసిన సాధారణ సినిమా ఇది.

ఆకాష్‌ ఓఎన్‌జిసిలో ఇంజనీర్‌. పూడిపల్లి గ్రామానికి డెప్యూటేషన్‌ మీద వస్తాడు. ఆ ఊరి పెద్దమనిషి కూతురు రేణుక. వీరిద్దరికీ హైదరాబాద్‌ నుంచి ట్రైన్‌లో వస్తుండగా పరిచయం అవుతుంది. తన చెల్లెలు చెప్పిన సమాచారం తప్పుగా అర్థం చేసుకున్న రేణుక తండ్రి ఆకాష్‌తో పెళ్ళి నిశ్చయం చేస్తాడు. కానీ, ఆమె చెల్లెలు తను చూసిన సంబంధం ఇది కాదని చెప్పడంతో..ఈ పెళ్ళిని కాదని, ఆమె చూసిన సంబంధం ఖరారు చేసుకుంటారు. ఈలోపు, ఆకాష్‌ రేణుకను ప్రేమిస్తాడు.

మరోవైపు, తన పెద్ద కూతురుని చంపింది పెద్దల్లుడు జేడీ చక్రవర్తినేని రేణుక తండ్రి భావిస్తాడు. కానీ, ఆమె చనిపోవడంలో జేడీ తప్పేమీ లేదని తెలుసుకున్న ఆకాష్‌ వీరి కుటుంబాల్ని కలుపుతాడు. చివర్లో జేడీకి - ఆకాష్‌, రేణుక ప్రేమించుకున్న విషయం తెలుస్తుంది. వీరిద్దరిని ఎలా కలిపాడన్నది క్లైమాక్స్‌.

ఈ కథలో విలన్‌లు ఎవరూ లేరు. పెద్దగా మలుపులు లేవు. కాబట్టి స్క్రీన్‌ 'ప్లే' పకడ్బందీగా రూపొందించుకోవడంలో దర్శకుడు శ్రీను వైట్ల విఫలమయ్యాడు. కొత్త హీరోయిన్‌ రేణుక అందం, ఆకాష్‌ సింపుల్‌ యాక్టింగ్‌, జేడీ చక్రవర్తి నటన ఈ సినిమాకు ప్రధాన బలాలు. వీరు సీన్‌లో లేనప్పుడల్లా కామెడీతో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ధర్మవరపు సుబ్రమణ్యం యాస, ఆయన కామెడీ బాగుంది. కోటీ సంగీతం ఈ సినిమాకు మైనస్‌ పాయింట్‌. ఒక పాట బాగుంది. కానీ తన రీరికార్డింగ్‌ శబ్దాలు శృతిమించడంతో చాలావరకు డైలాగ్స్‌ వినిపించవు. అజయ్‌ విన్సెంట్‌ ఫోటోగ్రఫీ చాలా బాగుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X