twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామెడీ ఎక్కువ, హారర్‌ తక్కువ.... (‘ఆనందో బ్రహ్మ’ రివ్యూ)

    ఆనందో బ్రహ్మ సినిమా రిలీజైంది. బాక్సాఫీసు వద్ద ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    Star Cast: తాప్సీ పన్ను, రాజీవ్ కనకాల, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, రఘు కారుమంచి
    Director: మహీ వీ రాఘవ

    హారర్, కామెడీ... ఈ రెండు మిక్స్ చేస్తే బాక్సాఫీసు వద్ద మినిమమ్ గ్యారంటీ సినిమా. ఇలాంటి కాన్సెప్టుతో ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా అలాంటి కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'ఆనందో బ్రహ్మ'.

    70 ఎం.ఎం.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, , ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌కుడు. విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి నిర్మాత‌లు. మరి ఈ సినిమాలో ప్రేక్షకుడిని మెప్పించేంత బ్రహ్మ పదార్థం ఏ మేరకు ఉందో రివ్యూలో చూద్దాం.

    కథ విషయానికొస్తే...

    కథ విషయానికొస్తే...

    మలేషియా బేస్డ్ ఎన్నారై (రాజీవ్ కనకాల) తల్లిదండ్రులు ఉత్తరాఖండ్ వరదల్లో ఆచూకీ లేకుండా పోతారు. వాళ్ల ఆచూకీ కోసం ఇండియా వస్తాడు. పోలీసులు వారు చనిపోయి ఉంటారని చెప్పడంతో ఇల్లు అమ్మేసి మలేషియా వెళ్లిపోదామని డిసైడ్ అయిపోతాడు. ఇల్లు అమ్మకానికి పెట్టగా కొనడానికి వచ్చిన వారు ఆ ఇంట్లో దయ్యాలను చూసి కొనకుండా వెళ్లిపోతారు.

    Recommended Video

    Bigg Boss Telugu : Tapsee Grand Entry And Surprise Fun in Bigg Boss
    నాలుగు దెయ్యాలు...

    నాలుగు దెయ్యాలు...

    ఆ ఇంటిని ఎవరు కొనడానికి వచ్చినా..... ఆ ఇంట్లో దెయ్యాలుగా ఉన్న తాప్సీ, విజయ్ చందర్, రఘు, మరో పిల్లదెయ్యం అందరినీ భయపెట్టి బయటకు తరిమేస్తుంటారు. దెయ్యం బూచి చూపి 10 కోట్ల విలువ చేసే ఆ ఇంటిని రూ. 1 కోటికి దక్కించుకోవాలని స్థానిక బిల్డర్ ప్లాన్ చేస్తాడు.

    డబ్బు కోసం...

    డబ్బు కోసం...

    ఆ ఇంటి సమస్యను తెలుసుకున్న బార్ వెయిటర్ శ్రీనివాసరెడ్డి ఆ ఇంట్లో దెయ్యాలు లేవని తాను నిరూపిస్తానని, నాలుగు రోజుల పాటు ఆ ఇంట్లో ఉండి మంచి రేటుకు అమ్ముడుపోయేలా చేస్తామని, తనకు కొంత కమీషన్ ఇవ్వాలని కోరుతాడు.

    దెయ్యాలు వర్సెస్ మనుషులు

    దెయ్యాలు వర్సెస్ మనుషులు

    తనలాగే డబ్బు అవసరం ఉన్న తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్‌లకు మీ కష్టాలు తీరేంత డబ్బు ఇప్పిస్తానని చెప్పి.....ఆ దెయ్యాల కొంపలో నాలుగు రోజులు గడిపేందుకు వారితో కలిసి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ నాలుగు దెయ్యాలు అదే ఇంట్లో ఉండటానికి కారణం ఏమిటి? వారి చావుకు కారణం ఏమిటి? అనేది తర్వాతి కత.

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్

    దెయ్యం పాత్రలో తాప్సీ ఫర్వాలేదు. అయితే ప్రేక్షకులు భయపడేంత హారర్ మాత్రం ప్రదర్శించలేకే పోయింది. విజయ్ చందర్, రఘు, మరో పిల్ల దెయ్యం కూడా జస్ట్ ఓకే. వాస్తవానికి వారు దెయ్యాలుగా మారక ముందు భయస్తులు. దెయ్యాలుగా మారిన తర్వాత కూడా అదే భయంతో జీవిస్తుంటారు. అందుకే దర్శకుడు వీరిని మరీ అంత భయంకరంగా చూపించలేదని భావించవచ్చు.

    ఆ నలుగురు అదరగొట్టారు

    ఆ నలుగురు అదరగొట్టారు

    శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. గుండె జబ్బున్న పాత్రలో శ్రీనివాస రెడ్డి, సినిమా పిచ్చోడి పాత్రలో షకలక శంకర్, తాగుబోతు పాత్రలో రమేష్, చెవుడు... రేచీకటి పాత్రలో వెన్నెల కిషోర్.......... తమ తమ చేష్టలతో ప్రేక్షకులను బాగా నవ్వించారు.

    కథ, స్క్రీన్ ప్లే...

    కథ, స్క్రీన్ ప్లే...

    కథ అంత గొప్పగా ఏమీ లేదు..... ఓ ఇల్లు, ఆ ఇంట్లో ఉండే మనుషులు, వారి హత్య, తర్వాత దెయ్యాలుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే ఓ కంక్లూజన్‌తో సింపుల్ స్టోరీ సిద్ధం చేసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లేలో ఎక్కడా బోర్ కొట్టకుండా హారర్, కామెడీ జోడించి వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించారు. దర్శకుడి పని తీరు ఫర్వా లేదు.

    సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు లేవు

    సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు లేవు

    హారర్, కామెడీ కాన్సెప్టులు ఎంచుకున్నపుడు ప్రేక్షకుడు ఊహించి ట్విస్టులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఉండాలి. అయితే సినిమాలో ఎక్కువగా కామెడీ మీదనే ఫోకస్ పోట్టారు. కొన్ని సస్పెన్స్ అంశాలు ఉన్నా ప్రేక్షకలను ఆకట్టుకునే స్థాయిలో లేవు. ఫస్టాఫ్ కొన్ని హారర్ సీన్లు, సెకండాఫ్ కామెడీ సీన్లతో నెట్టుకొచ్చారు.

    టెక్నికల్

    టెక్నికల్

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే.... ‘కె' అందించి సంగీతం ఫర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇతర టెక్నీకల్ అంశాలు జస్ట్ ఓకే.

    చివరగా చెప్పేదేమంటే...

    చివరగా చెప్పేదేమంటే...

    ఆనందో బ్రహ్మ గొప్ప సినిమా అని చెప్పలేం. టైమ్ పాస్ కోసం వెళ్లేవారికి పుష్కలంగా వినోదం లభించడం గ్యారంటీ. ఫస్టాఫ్‌లో వచ్చే హారర్ కాస్త భయపెడుతుంది. సెకండాఫ్‌లో శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ చేసిన కామెడీ పార్ట్ కడుపుబ్బా నవ్విస్తుంది.

    English summary
    'Anando Brahma' movie review and rating. Director Mahi V Raghav's Anando Brahma is a comedy horror film starring Tapasee Pannu, Srinivas Reddy, Vennela Kishore and Shakalaka Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X