Anveshi Review అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ మూవీ ఎలా ఉంది.. అన్వేషి రివ్యూ
నటీనటులు: అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ ధాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ తదితరులు
రచన, దర్శకత్వం: వీకే ఖన్నా
నిర్మాత: టీ గణపతి రెడ్డి
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సైమన్ కే కింగ్
సినిమాటోగ్రాఫర్: కేకే రావు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నాదికుడికర్
స్టంట్స్: జాషువా
బ్యానర్: అరుణ శ్రీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2023-11-18
మారేడుకోన గ్రామంలో అనుమానాస్పదమైన రితీలో మరణాలు జరుగుతుంటాయి. అను (అనన్య నాగళ్ల) అనే అమ్మాయి కోసం వెతుక్కొంటూ విక్రమ్ (విజయ్ ధరణ్ దాట్ల) ఆ గ్రామానికి వెళ్తాడు. అయితే అక్కడే పనిచేసే ఎస్ఐ కూతురు (అను)తో విక్రమ్ ప్రేమలో పడుతాడు. తను వెతుక్కొంటూ వచ్చిన అను మరణించిందనే విషయాన్ని తెలుసుకొంటాడు.
విక్రమ్ వెతుక్కొంటూ వచ్చిన డాక్టర్ అను ఎవరు? డాక్టర్ అను ఎలా మరణించింది? గ్రామానికి అను ఎందుకు వచ్చింది? ఎస్ఐ కూతురు అనుతో విక్రమ్ ఎలా ప్రేమలో పడ్డాడు? మారేడుకోనలో పెద్దిరెడ్డి అధిపత్యం, అక్రమాలు ఎలా కొనసాగాయి? అను మరణం వెనుక అసలు కారణాన్ని విక్రమ్ తెలుసుకొన్నాడా? అను మృతికి కారణమైన వ్యక్తికి విక్రమ్ ఎలాంటి శిక్షను వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే అన్వేషి సినిమా కథ.

అను కోసం అన్వేషణ కొనసాగిస్తున్న విక్రమ్‌కు గ్రామంలో ఆమె మరణించిన విషయాన్ని గ్రామస్థులు చెప్పడం.. వెంటనే అను వారికి పరిచయం కావడం లాంటి ఇంట్రెస్టింగ్ అంశంతో కథను మొదలుపెట్టాడు. ఆ తర్వాత మరణించిన అను వేరు.. పరిచయమైన అను వేరే అనే విషయాన్ని చెప్పిన విధానం బాగుంది. కానీ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్‌కు కావాల్సిన బలమైన సన్నివేశాలు ఫస్టాఫ్‌లో లేకపోవడం వల్ల రొటీన్ సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ రూరల్ నేటీవిటీని చూపించిన విధానం సినిమాలో ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా మార్చింది.
ఇక సెకండాఫ్‌కు వస్తే.. ఈ సినిమా వరకు మంచి ఎమోషన్స్ కనిపిస్తాయి. డాక్టర్ అను క్యారెక్టర్‌తో కథను భావోద్వేగంగా మార్చిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో కూడా కొన్ని చోట్ల సాగదీత కొనసాగడంతో కథలో ఉండే గ్రిప్ చేజారిందనిపిస్తుంది. అయితే క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్టు సినిమాను కొంత వరు ఫీల్‌గుడ్‌గా మార్చింది. ఆత్మల నేపథ్యంతో సాగే సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాకు కామెడీ ప్లస్ అవుతుంది. కామెడీ పండకపోవడం కూడా ఈ సినిమా ఓ మైనస్‌గా మారిందని చెప్పవచ్చు.

నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. విక్రమ్ పాత్రలో విజయ్ ధరణ్ దాట్ల ఒదిగిపోయాడు. నటుడిగా అనుభవం పెద్దగా లేకపోయినా సినిమా భారాన్నంతా తన మీద వేసుకొని మూవీని నడిపించిన గట్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి. ఇక అనన్య నాగళ్ల పాత్ర పరిధి తక్కువైనా గానీ.. ఉన్నంత సేపు మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. సిమ్రాన్ గుప్తా తనదైన శైలిలో ఫర్వాలేదనిపించింది. అజయ్ ఘోష్ సాఫ్ట్ విలనిజం బాగుంది. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక విషయాల విభాగాల విషయానికి వస్తే.. అన్వేషి సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యాజిక్ ప్లస్‌గా మారాయి. నేటీవిటీతో కూడిన సినిమాకు కేకే రావు అందించిన విజువల్ బాగున్నాయి. చైతన్ భరద్వాజ్ పాటలు, సైమన్ కే కింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్లు తగ్గించడానికి స్కోప్ ఉందనిపించింది. గణపతి రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

గ్రామీణ వాతావరణం నేపథ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే మర్డర్ మిస్టరీ అన్వేషి. స్టోరీ పాయింట్ మంచిదే.. ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్‌గా చేయడానికి స్కోప్ ఉందనిపిస్తుంది. సెంకడాఫ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. హ్యుమన్ ఎమోషన్స్ బాగా వర్కవుట్ కావడంతో ఫీల్‌గుడ్ సినిమా అనేది చివరకు ఎస్టాబ్లిష్ అవుతుంది.


Click it and Unblock the Notifications











