Tantra Review క్షుద్ర శక్తులు, మంత్ర విద్యలతో తంత్ర.. అనన్య నాగళ్ల మూవీ ఎలా ఉందంటే?

Rating: 2.5/5

నటీనటులు: అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ, సలోని అశ్విని, మీసాల లక్ష్మణ్, మనోజ్ ముత్యం, కుషాలిని తదితరులు
దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి
నిర్మాతలు: నరేష్ బాబు పీ, రవిచైతన్య
మ్యూజిక్: RR ధ్రువన్
సినిమాటోగ్రఫి: విజయ్ భాస్కర్ సద్దాల, సాయిరామ్ ఉదయ్
ఎడిటింగ్: SB ఉద్దవ్
ఆర్ట్: గురు మురళీ కృష్ణ
బ్యానర్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్: 2024-03-15

చిన్నతనంలోనే తల్లి (సలోని)ని కోల్పోయిన ఓ గ్రామీణ ప్రాంతానికి అందమైన యువతి రేఖ(అనన్య నాగళ్ల). కాలేజీలో తన స్నేహితులు తేజు(ధనుష్ రఘుముద్రి), శైలు(కుషాలిని), మరో ఫ్రెండ్ (శరత్ బరిగిలె)తో సరదాగా లైఫ్ గడిపేస్తూ ఉంటుంది. అయితే ఇంటిలో, కళాశాలకు వెళ్లే సమయంలోనూ ఎవరికీ కనిపించని కొన్ని శక్తులు కనిపిస్తూ ఉంటాయి. దాంతో రాత్రిళ్లు బయటకు వెళ్లాలంటే తెగ భయపడిపోతూ ఉంటుంది. రాత్రిపూట నిద్రలో నడుచుకుంటూ వెళ్లిపోతూ మిస్టరీగా కనిపిస్తుంది. తాంత్రిక శక్తులతో గుర్తు తెలియని శక్తులు వేధిస్తుండటంతో భయపడిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ ముస్లిం బాబాను కలిసి క్షుద్ర శక్తుల నుంచి కాపాడాలని వేడుకుంటుంది.

Ananya Nagalla s Tantra Movie Review in Telugu

నిజంగానే తాంత్రిక శక్తులు, క్షుద్ర శక్తులు రేఖను వేధిస్తున్నాయా? రేఖ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎలా? ఎందుకు జరిగాయి? అసలు రేఖ నేపథ్యం ఏమిటి? రేఖ తల్లి రాజ్యలక్ష్మి ఎందుకు? ఎలా చనిపోయింది? రేఖ తండ్రి ఎలాంటి వాడు? ఇందులో క్షుద్రపూజలు చేసే మాంత్రికుడు విగతి(టెంపర్ వంశీ)కి, రేఖకి సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే తంత్ర సినిమా కథ.

రామాయణంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు, క్షుద్రదేవత అయిన నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేసి ఇంద్రజిత్తు తలపెట్టిన క్షుద్రపూజను భగ్నం చేస్తాడు. ఇలా పురాణాల్లో కూడా క్షుద్రపూజలు చేసేవారని, అప్పట్లోనూ క్షుద్రదేవతలున్నారని చెబుతూ తంత్ర మూవీలో ప్రధాన ప్లాట్ ఏంటో సినిమా ప్రారంభంలోనే రివీల్ చేసి సినిమా ఏ పంథాలో సాగుతుందనేది ఆడియన్స్ కి హింట్ ఇచ్చేశారు దర్శకుడు.

Ananya Nagalla s Tantra Movie Review in Telugu

కథనాన్ని ఆసక్తిగా చెప్పడానికి కొన్ని ఘటనలను ఆరు(రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవి) విభాగాలుగా ఎంచుకుని సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. ఈ విభాగాలు మీద రాసుకున్న ఎపిసోడ్స్ అన్నీ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా వజ్రోలి రథి ఎపిసోడ్‌ను టెంపర్ వంశీ, సలోని మీద తీసిన తీరు ఆడియన్స్‌ను బాగా ఎంగేజ్ చేస్తుంది.

ఎక్కడా ఆడియన్స్ బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా అనన్య నాగళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో తాంత్రిక విద్యలతో కొన్ని ఎపిసోడ్స్‌ను చూపించి... సెకెండాఫ్‌లో క్షుద్రపూజలతో సినిమాను రక్తికట్టించారు. అయితే కొన్ని ఎపిసోడ్స్ సాగతీతలా ఉండటంతో అక్కడక్కడ సినిమా కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే క్లైమాక్స్ కూడా ఇంకాస్త బాగా రాసుకుని తీసుంటే బాగుండేదనిపిస్తుంది.

Ananya Nagalla s Tantra Movie Review in Telugu

గ్లామర్ బ్యూటీ అనన్య నాగళ్ల సినిమా మొత్తం అన్నీతానై సినిమాను ముందుకు నడిపించింది. హారర్, గ్లామర్ పాత్రల్లో బాగా ఆకట్టుకున్నది. ఎప్పటి లాగే తనదైన శైలిలో నటించి యూత్‌ను బాగా మెప్పించేలా నటించింది. ఆమెకు జోడీగా నటించిన ధనుష్ రఘుముద్రి కూడా మొదటి సినిమానే అయినా బాగా నటించి మెప్పించారు. అమాయకమైన పాత్రలో, అనన్యకు జంటగా ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యారు.

ఇతర పాత్రల విషయానికి వస్తే.. క్షుద్రపూజలు చేసి అమ్మాయిలను వశం చేసుకునే భయంకరమైన మాంత్రికుడి పాత్రలో టెంపర్ వంశీ ఆక్టుకున్నాడు. చాలా కాలం తర్వాత మర్యాదరామన్న బ్యూటి సలోని ఇందులో నటించింది. ఉన్నది కాసేపే అయినా... తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

Ananya Nagalla s Tantra Movie Review in Telugu

దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాసుకున్న స్టోరీ దాన్ని ముందుకు నడిపించేందుకు రాసుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తిరంగా ఉన్నాయి. ఎక్కడా ఆడియన్ బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా మెయిన్ ప్లాట్స్ ను రాసుకున్నారు. అలాగే చివరి దాకా సస్పెన్స్ కూడా తీసుకెళ్లి... ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచారు. ఇలాంటి హారర్ సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రధాన బలం. అలాంటిది ఈ సినిమాకి సంగీత దర్శకుడు వంద శాతం న్యాయం చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా ఉన్నతంగా నిర్మించారు. ఇలాంటి జోనర్ ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ సినిమా మంచి ఛాయిస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X